కురుక్షేత్ర యుద్ధం తరువాత,, అంపశయ్యపై ఉన్న భీష్మ పితామహుని ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ పాండవులకు ఉపదేశం చేయించిందే శ్రీవిష్ణు సహస్రనామం. భగవద్గీత కంటే ఈ స్తోత్రం వల్లనే సులభంగా లోకం తరించగలదని శ్రీకృష్ణుడు భావించాడు. " ఏ జీవి ఐనా ఈ సంసార చక్రం నుండి బయటపడాలంటే తెలియవలసిన తత్వమేది అని ధర్మరాజు భీష్ముడిని ప్రశ్నించగా " సర్వజగత్కారణమైన, లోఖేశ్వరుడైన ఆ పుండరీకాక్షుని అర్చించడమే ధర్మాలలో శ్రేష్టమైన ధర్మం" అని భీష్మ పితామాహుడు ఉపదేశిస్తాడు. అంతే కాదు విష్ణు నామాలు కీర్తిస్తే సకల పాపాలు పోతాయి. పవిత్రులవుతారు. కోరినవన్నీ లభిస్తాయి. వేయి నామాలు గల విష్ణు సహస్రనామ స్తోత్రానికి మించిన గొప్ప మంత్రం మరొకటి లేదు. శ్రీమన్నారాయణుని కల్యాణ గుణములను అనుభవించిన ఋషులు వారి అనుభవసారంగా ఒక్కో నామాన్ని దర్శించి గానం చేసినవే ఈ సహస్రనామాలు " అని అంటాడు భీష్ముడు. ప్రతిదినం ఉదయం కాని, సాయంత్రం కాని శ్రీలక్ష్మీ శతనామ స్తోత్రాన్ని ముందుగా పఠించి, తర్వాత విష్ణుహస్రనామ స్తోత్రాన్ని పఠించిన సత్ఫలితాలు తప్పక కలుగుతాయి.

విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఇక్కడ వినండి ..