"అహం" వీడితే ఆనందం....
Filed under: మంచి మాట Author: జ్యోతి
"అహం" చూడడానికి రెండక్షారాలైనా ఈ చిన్ని పదం ఎంతటి వారినైనా మాయలా కప్పేస్తుంది. లోకం పోకడ తెలియనివ్వకుండా , తెలుసుకోకుండా చేస్తుంది. తాను ఉన్నదే ప్రపంచం, తానూ నమ్మిందే అసలైన సిద్ధాంతం, తానూ చేసిందే సరియైనది అనే ధృఢమైన భావనల్ని ఉసిగొల్పి, చివరికి వారినే అందరూ ఉన్న ఒంటరివారిని చేస్తుంది.
అహం అంటే నేను అని అర్ధం. కాని అసలు అంతరార్ధం మాత్రం చాలా సంక్లిష్టమైనది. ఈ చిన్ని పదం నుండి పుట్టినదే అహంకారం, అహంభావం, గర్వం .. ఈ అహం అనే భావన చిన్నగా కనిపించినా చాలు అది మహావృక్షంలా మనలో వ్యాపిస్తుంది. దీనిని నివారించుకోవడం మన చేతిలోనే ఉంది. పాండిత్యం అనేది కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా ప్రత్యక్షంగా మన పరిసరాల పరమార్ధం తెలుసుకోవాలి. విద్య మనకు వినయం నేర్పి కలిసి మెలసి ఎలా బ్రతకాలో చెప్తుంది. ఇదంతా పుస్తకాల నుండి కాక మనకు ఎదురైనా అనుభవాలతోనే సాధ్యం అవుతుంది. ఒదిగి ఎదగాడంలోనే ఔన్నత్యం ఉంది. ఐతే మిడిమిడి జ్ఞానం ఉన్నవాడు అన్నీ తమకే తెలుసన్న అతి విశ్వాసంతో ఉంటారు. ప్రతీదానికి వితండ వాదం చేస్తారు.
ప్రతి మనిషికి తనపై తనకు పూర్తి నమ్మకుముండాలి. అది తప్పనిసరి. ఇది ఆత్మవిశ్వాసం. లేకుంటే తనకంటే దురదృష్టవంతులు, హీనులు, అజ్ఞానులు లేరనే ఆత్మన్యూనత ఏర్పడుతుంది. ఇది చాలా ప్రమాదకరమైనది. మనిషిని కృంగదీస్తుంది. అదే విధంగా అతివిశ్వాసం కూడా మంచిది కాదు. తనకంటే గొప్పవాడు లేదు అని అనుకుని ఎదుటివారిని చులకన చేస్తుంటారు. జ్ఞానం, లోకానుభావమున్నపండితులు సంస్కారవంతులై గౌరవిమ్పబాడతారు. మిడిమిడి జ్ఞానమున్నవారే అహంకారంతో విర్రవీగుతారు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక నేర్పు ఉంటుంది. తనకే అన్నే తెలుసు అన్న అహంకారం మంచిది కాదు. నేర్చుకోవడానికి ఏదో ఒకటి కొత్తది ఉంటూనే ఉంటుంది. వినయంతో తెలుసుకోవాలి. తమలోని జ్ఞానసంపడని ఇనుమడింప చేసుకోవాలి.
"నేను" అన్న స్వార్ధచింతన వీడి "మన" అనే సమిష్టి తత్త్వం అలవరుచుకోవాలి. ఇదే మన ముందున్న తరాలవారికి నేర్పించాల్సిన గొప్ప సంస్కారం. పాఠం..

Rajasekharuni Vijay Sharma
January 23, 2010 at 10:34 PM
చాలా చక్కగా చెప్పారు.
భావన
January 24, 2010 at 10:14 AM