శ్రీ మహావిష్ణువు ధరించి, మానవుడు తన ఉజ్జీవనానికి ఇలా ధరించాలని చెప్పినదే ఊర్ద్వ పుండ్రం. "పూడి - ఖండనే " అనే సంస్కృత దాతువునుఅనుసరించి అజ్ఞానాన్ని, కర్మపాశాన్ని ఖండించేది పుండ్రం. సత్వగుణం మనిషిని ఉన్నతమైన మార్గంలో, ఉత్తమ లక్ష్యం వైపు నడుపుతుంది. తెల్ల నామాలు సత్వగునాన్ని, దానివల్ల కలిగే ఉద్రేకరహిత స్థితిని తెలియజేస్తాయి. అది పునాదిగా ఉండాలని క్రింద పాదపీతం ఉంటుంది. సత్వగుణం మనల్ని ఉన్నతికి తీసుకు వెడుతుందని సూచించేదే నిలువు బొట్టు. సత్వగుణానికి అధిష్టాన దేవత శ్రీ మహావిష్ణువు కనుక రెండు తెల్లని ఊర్ద్వ పుండ్రాలు ఆయన పాదాలుగా శిరసావహిస్తారు. ఇక విశ్వమంతటా వ్యాపించిన అనురాగానికి ప్రతీక లేత ఎరుపు రంగు . అనురాగానికి, ప్రేమకు మూలం లక్ష్మీ దేవి. శుభకరమైన ఆ లక్ష్మీ స్వరూపానికి చిహ్నంగా నిలువు పుండ్రాల మధ్య మంగళకరమైన శ్రీ చూర్ణం ధరిస్తారు.