సాధారణంగా తమ మనోవాంచలు నెరవేర్చుకోవడం దేవతలకు పూజ చేసి ప్రత్యేక రోజులలో ప్రసాదాలు సమర్పించడం జరుగుతుంది. ఇది సరియైన పద్ధతేనా?? కాదు. భగవంతుడు సర్వశక్తిమంతుడు. వాస్తవానికి అతడు భక్తుడి నుండి ఏమీ ఆశించడు. అతను మనఃస్పూర్థిగా ఇచ్చినదేదైనా సంతోషంగా స్వీకరిస్తాడు. అది ఫలమైనా, పుష్పమైనా ఏదైనా సరే. అది కూడా భక్తుని సంతృప్తి పరచడానికే తీసుకుంటాడు. కనుక తన సంతృప్తికై భక్తుడు తన ఇష్టదైవానికి తీపి వంటకమో, పుష్పమాలయో, ధూపదీపాలో లేక మరే ఇతరమైనవో సమర్పించుకుంటాడు . అంతే కాని ఏ దేవుడు నాకిది కావాలని అడగడు. ఇచ్చింది కాదనడు. దైవానికి నైవేద్యం సమర్పించడమంటే భగవంతుడికి పూర్ణంగా శరణు జొచ్చడమని భావం. దేవుది పూజకు కావలసినవి సమర్పించిన తరువాత భక్తుడి ఆత్మవిశ్వాసం, దైవవిశ్వాసం పెరిగి తన ప్రార్ధనా లక్ష్యంపై మనసు సంపూర్ణంగా లగ్నం కాదు. ప్రసాదం అంటె దేవునికి లంచం ఇవ్వడం కాదు. భక్తుడు తనకోసమై తనదనుకుంటున్న సొత్తును కాస్త భగవంతుడికి అర్పించడం. అలాగే అది తనకు భగవానుడే ఇచ్చాడు అని భావించడం అనేది నైవేద్యం యొక్క ముఖ్య ఉద్ధేశ్యం.
విశ్వ ప్రేమికుడు
July 28, 2009 at 4:52 PM
"దేవుది పూజకు కావలసినవి సమర్పించిన తరువాత భక్తుడి ఆత్మవిశ్వాసం, దైవవిశ్వాసం పెరిగి తన ప్రార్ధనా లక్ష్యంపై మనసు సంపూర్ణంగా లగ్నం కాదు."
అంటే... భక్తుని మనసు కోరికల పైకి వెళ్లదనా... మీ వుద్దేశం? మంచి విషయం.
ఫోటో చాలా బాగుంది. :)
Nrahamthulla
March 1, 2010 at 11:28 AM
In the Rig Veda there is a chapter called Nasadiya Sutra where it is discussed whether God created us and the conclusion is that we were created from heat and that God is a creation of the human mind. Even the Bhagavad Gita is originally an atheistic philosophy. Shankaracharya changed it into a theistic philosophy. The Dhyana Sloka says: "Dhyana vartita tathgatena manasa pashyantiyam yogino" - you can perceive God only in the mind. he has only existed in imaginations. Religion is big business. --B.premanand