శ్రీ, శ్రీమతే, శ్రీమాన్, శ్రీమతి
Filed under: జిజ్ఞాస Author: జ్యోతిఈ పదాలన్నీ "శ్రీ" అనే విశిష్ట పదానికి సంబంధించినవి. శ్రీ అని లక్ష్మికి, సంపదకు పేరు. పేర్లకు ముందు శ్రీ అని పెడితే గౌరవవాచకం అవుతుంది. శ్రీమతి అంటే భాగ్యవతి, లక్ష్మి విశిష్టురాలు. శ్రీవైష్ణవుల పేర్ల ముందు శ్రీమాన్ అని వాడతారు. శ్రీరామాయణంలొ "శ్రీమాన్" అనే సంబొధన విశేషణంగా కూడా వాడతారు. శ్రీమాన్ అంటే భాగ్యవంతుడు అని అర్ధం. వాల్మీకి చెప్పినదానిప్రకారం భగవంతుని సన్నిధిలో , సేవలో ఉన్నవారందరూ భాగ్యవంతులే. లక్ష్మి, గోదాదేవి వంటి దేవేరుల పేర్ల ముందు గౌరవవాచకంగా శ్రీ వాడబడుతుంది. శ్రీమత్ + మహాభారతం = శ్రీమన్మాహాభారతం, శ్రీమత్ + రామాయణం = శ్రీమద్రామాయణం సంపత్కరమైన గ్రంధాలు. శ్రీమతే నారాయణాయనమః అని భగవత్ కైంకర్య సమర్పణంగా కల రామనుజుల వారికి నమస్కారం అని అర్ధం . శ్రీమత్ + నారాయణుడు = శ్రీమన్నారాయణుడు అనగా శ్రీ విశిష్టమైన శ్రీతో కూడిన నారాయణుడు అని అర్ధం. శ్రీమతే అంటే శ్రీకల నారాయణుని కొరకే అని అర్ధం . సందర్భాన్ని బట్టి ఆయా పదాల వాడకం జరుగుతుంది.
Srujana Ramanujan
May 27, 2009 at 7:14 PM
హరే కృష్ణ
May 28, 2009 at 11:22 AM
మంచిబాలుడు-మేడిన్ ఇన్ వైజాగ్.
May 30, 2009 at 1:58 PM
Unknown
July 17, 2009 at 1:21 AM
Naa peru Sandhya Rani
DOB: 29th Aug 1982
Nakshatram : moola nakshatram
Please na gurinchi telusikovalani vundhi
Be kind hearted and do the needful
Jasmine
August 16, 2009 at 2:55 PM
naa nakshtra,tithi,raasi teliyacheyagalaru
kasiram
August 17, 2009 at 3:34 AM
naa nakshtram,tithi,raasi,ganamu teliyacheyagalaru.
Thank you very much