కృత్తిక 2, 3, 4, పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదలు

ఆదాయం: 11, వ్యయం:14, రాజపూజ్యం:4, అవమానం:7

ఈ సంవత్సరం సెప్టెంబరు వరకు తృతీయమునందు కేతువు, భాగ్యమునందు రాహువు, ఆ తదుపరి అంతా ద్వితీయమునందు కేతువు, అష్టమమునందు రాహువు, మే 1 వరకు భాగ్యమునందు బృహస్పతి, ఆ తదుపరి అంతా రాజ్యమునందు, జులై 30 నుంచి వక్రి గతిన మకరమందు, డిశంబరు 19వ తేదీనుంచి తిరిగి రాజ్యమునందు, సెప్టెంబరువరకు అర్ధాష్టమ శని, ఆ తదుపరి అంతా పంచమమునందు సంచరిస్తారు.

ఈ సంవత్సరం 'పాలసునకై ఆపద' అన్నట్టుగా ప్రతి విషయంలోనూ ప్రశంతత వహించుట వలన అన్నివిధాలుగా సంతృప్తి కానరాగలదు. దైవ కార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొంతమందిమిమ్మల్ని ఉద్రేకపరచి లబ్ది పొందడానికి ప్రయత్నిస్తారు. ఆర్ధిక ఒడిదుడుకులు తలెత్తినా మిత్రుల సహకారం వలన సమసిపోతాయి. జీవిత భాగస్వామి వలన లాభం పొందుతారు.నూతన వ్యాపారాలు కలసి వస్తాయి. భాగస్వామ్యం పనికి రాదు. శుభకార్యాల మూలకంగా అధికంగా ధనం ఖర్చు చేస్తారు. విద్యార్థుల మొదటి భాగంలో జయం చేకూరుతుంది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలవసరం. నూతన ఎగ్రిమెంట్ల పట్ల ఆసక్తి పెరుగుతుంది వ్యాపారంలో నూతనంగా తయారు చేయు వస్తువుల అమ్మకాలు పెరుగుతాయి. చిన్న తరహా పరిశ్రమల వారికి శ్రమానంతరం విజయం చేకూరగలదు. తొందరపాటు నిర్ణయాల వలన సమస్యలు ఎదుర్కొనక తప్పదని తమనించండి. మీ వ్యక్తిగత విషయాలు ఇతరులకు తెలియపర్చుట మంచిది కాదు. మీ లక్ష్య సాధనకు నిరంతర కృషి అవసరమని గమనించండి. ఉత్తర ప్రత్యుత్తరాలు కలసి వస్తాయి. శుభాకాంక్షలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. రైతులు ఆందోళనకు గురి అవుతారు. వాతావరణంలో మార్పులు ఇబ్బంది పెడతాయి. ప్రయాణాలలొ మెళకువ వహించండి. అనుకోని ఖర్చులు మీ అంచనాలను దాటటం వలన ఆందోళన పడతారని చెప్పవచ్చు. ఉద్యోగస్థులు ప్రమోషన్లకై చేయు ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఇప్పటివార్కు విరోధులుగా ఉన్నవారు మీ సహాయం అర్ధిస్తారు. సాంఘిక కార్యక్రమాలలో పాల్గొంటారు. క్రీడల పట్ల అసక్తి పెరుగుతుంది. ముఖ్యమైన విషయాలు గోప్యంగా ఉంచండి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలవారికి అనుకూలం. హామీలు ఉండడం మంచిది కాదని గమనించండి. సినిమా, విద్య, సాంస్కృతిక రంగాల పట్ల ఉత్సాహం కనబరుస్తారు. ఊహించని శుభవార్త మీకు ఆశ్చర్యానందాలను కలిగిస్తుంది.స్థిర, చరస్థుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. భూముల గురించి చర్చలు జరుగుతాయి. కంప్యూటర్, ఎలక్ట్రానిక్ రంగాలలో వారికి మిశ్రమ ఫలితం. ఎస్టేట్ వ్యాపారస్థులకు, బ్రోకర్లకు శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. కూరగాయలు, పండ్లు, పూల వ్యాపారస్థులకు లాభదాయకంగా ఉంటుంది.

కృత్తిక నక్షత్రం వారు జాతి కెంపు, రోహిణీ నక్షత్రం వారు స్పందన ముత్యం, మృగశిర వారు జాతి పగడం ధరించిన శుభం. జయం చేకూరగలదు. ఈ రాశివారు 2009 సెప్టెంబరు వరకు శనికి తైలాభిషేకం చేయిస్తూ, వేంకటేశ్వర స్వామి ఆరాధన చేస్తే శుభం, జయం, అభివృద్ధి చేకూరగలదు.