మృగశిర 3,4 పదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పదాలు.


ఆదాయం: 14, వ్యయం: 11, రాజపూజ్యం: 14, వ్యయం: 11

ఈ రాశివారికి సెప్టెంబరు 9వ తేదీ వరకు తృతీయమునందు శని, ఆ తదుపరి అంతా అర్ధాష్టమ శని, మే 1 వరకు అష్టమమునందు బృహస్పతి, ఆ తదుపరి భాగ్యమునందు, జులై 30 నుంచి వక్రగతిన అష్టమమునందు, డిశంబరు 19 నుంచి భాగ్యము నందు, ఈ సంవత్సరం నవంబరు 15 వరకు ద్వితీయమునందు కేతువు, అష్టమమునందు రాహువు, ఆ తదుపరి జన్మమునందు కేతువు, సప్తమమునందు రాహువు సంచరిస్తారు.

ఈ సంవత్సరము 'నాదసుమీ అప్పిచ్చుట' అన్నట్టుగా మీరు ఎవరికన్నా ధన సహాయం చేసినా సమస్యలు, మాట పడక తప్పదు. మెళకువ వహించండి. ఉద్యోగాభివృద్ధికై చేయు ప్రయత్నాలు అనుకూలించగలవు. సంఘంలో మీ స్థాయి పెరుగుతుంది. బంధుమిత్రుల రాకపోకలు పెరుగగలవు. ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగంలోనికి వారికి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. విద్యార్థులు ఏకాగ్రత వహిస్తే గణనీయమైన పురోభివృద్ధి పొందుతారు. కోర్టు వ్యవహారాలలో ఆటంకాలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. గృహాది రంగాలలొ ఒత్తిడి, చికాకులు ఎదుర్కొనక తప్పదు. నూతన పెట్టుబడులు పెట్టినప్పుడు ఆచితూచి వ్యవహరించండి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించినవాటిని సద్వినియోగ పరుచుకోగలుగుతారు. వ్యాపారస్థులకు అనుకూలమైన కాలం, నూతన వస్తువులు అమ్మకానికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. వైద్యులకు సదవకాశాలు లభించగలవు. దూర ప్రయాణాలకై చేయు ప్రయత్నాలలో జయం చేకూరుతుంది. భాగస్వామ్య వ్యాపారం చేయగోరువారు అతి జాగ్రత్తగా మీ భాగస్వాములకు శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. యాక్టర్లకు, సినిమా రంగాలలో వారికి సంతృప్తికరంగా ఉండదు. మందులు, ఎరువులు, రసాయనిక, సుగంధ ద్రవ్య వ్యాపారం చేయువారు మంచి అభివృద్ధిని సాధిస్తారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలలొ వారికి ఒత్తిడి, చికాకులు తప్పవు. బంగారం, వెండి, వస్త్ర, లోహ వ్యాపారం చేయువారుఈ సంవత్సరం మంచి లాభాలు గడించగలుగుతారు. ఇంతవరకు విరోధులుగా ఉన్నవారు మీ స్నేహాన్ని కోరుకుంటారు. స్త్రీల వాక్ చాతుర్యానికి, సమయస్ఫూర్తికి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తాయి.

ఈ రాశివారు అష్టభుజ గణపతి స్తోత్రం పఠించిన శుభం కలుగుతుంది. మృగశిర నక్షత్రం వారు జాతి పగడం, ఆరుద్ర నక్షత్రం వారు ఎర్ర గోమేధికం, పునర్వసు నక్షత్రం వారు వైక్రాంతమణి లేక కనక పుష్యరాగం ధరించిన ఆరొగ్యం, అభివృద్ధి పొందుతారు.