పునర్వసు 4 వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పదాలు

ఆదాయం: 8, వ్యయం:11, రాజపూజ్యం:3, అవమానం:3

ఈ రాశివారికి నవంబరు 15 వరకు జన్మమునందు కేతువు, సప్తమమునందు రాహువు, ఆ తదుపరి అంతా వ్యయమునందు కేతువు. షష్టమమునందు రాహువు, ఈ సంవత్సరం సెప్టెంబరు వరకు ద్వితీయమునందు శని, ఆ తదుపరి అంతా తృతీయమునందు, మే 1 వరకు సప్తమమునందు బృహస్పతి, ఆ తదుపరి జులై 30 వరకు అష్టమమునందు, ఆ తదుపరి డిశెంబరు 19 వరకు సప్తమము నందు తదుపరి అష్టమమునందు సంచరిస్తారు.

ఈ సంవత్సరం 'ధనం మూలమ్ ఇదం జగత్' అన్నట్లుగా మీరు మీ ధనమును ఖర్చుపెట్టడంలో తగు జాగ్రత్తలు పాటించాలి. ఈ సంవత్సరం బద్ధకం వదిలి బాగా కష్టపడిన మంచి ఫలితాలు పొందగలరు. రవాణా రంగంలోని వారికి లాభదాయకం, రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు, బ్రోకర్లకు, ఎక్స్‌పోర్టు వ్యాపారస్థులకు వారి వారి రంగాలలో విజయం చేకూరగలదు.నిరుద్యొగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మీ కుటుంబమ్ళో ప్రేమానుబంధలౌ బలపడతాయి. వైద్యరంగంలో వారికి పురోభివృద్ధి. శుభకార్యాలకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇసుక, ఇటుక, తాపీ పనివారికి కలిసి వచ్చే కాలం, దైవ కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. బంధుమిత్రుల రాకపొకలు పెరుగుతాయి. నూతన వ్యాపారాల్ అపట్ల ఆసక్తి పెరుగుతుంది.వ్యవసాయదారులకు ఆందోళన తప్పదు. ఆంతరంగిక సమస్యలకు పరిషకార మార్గం కానవస్తుంది. చిన్న చిన్న విషయాలకు ఉద్రేకం మాని తెలివితేటలతో అనుకున్న పని సాధించండి. అధిక ఉష్ణం వలన కుటుంబ పెద్దల పట్ల ఆందోళన చెందుతారు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఎక్స్‌పోర్టు వ్యాపారస్థులకు లభదాయకం. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగి జయం పొందండి.

ఈ రాశివారికి 2009 వరకు ఏలినాటి శని దోషం ఉన్నందువల్ల శనికి 3 నెలలకోసారి తైలాభిషేకం చేయించిన కలిసి రాగలదు.నవగ్రహస్తోత్ర పారాయణం, దుర్గాపూజ చేయడం వలన ఆరోగ్యం, ఆర్ధికాభివృద్ధి చేకూరుతాయి. పునర్వసు నక్షత్రం వారు కనక పుష్యరాగం లేక వైక్రాంతమణి, పుష్యమి నక్షత్రం వారు సౌగంధికా నీలం, ఆశ్లేషా నక్షత్రం వారు మయూరి మరకతం ధరించిన శుభం చేకూరగలదు.