అశ్వని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం

ఆదాయం:2, వ్యయం:8, రాజపూజ్యం:1, అవమానం:7

ఈ రశివారికి నవంబరు 15 వరకు చతుర్ధము నందు కేతువు, రాజ్యమునందు రాహువు, ఆ తదుపరి అంతా తృతీయమునందు కేతువు. భాగ్యమునందు రాహువు. ఈ సంవత్సరం సెప్టెంబరు వరకు పంచమమునందు శని, ఆ తదుపరి అంతా షష్టమమునందు, ఈ సంవత్సరం మే 1 వరకు రాజ్యమునందు బృహస్పతి,
ఆ తదుపరి లాభమునందు, జులై 30 నుంచి వక్రగతిన మకరమునందు తిరిగి డిశంబరు నుంచి లాభమునందు సంచరిస్తారు.

ఈ సంవత్సరం 'కూరిమి విరసంబైనను' అన్నట్టుగా మీ సహాయం పొంది మిమ్మల్ని తక్కువ అంచనా చేసేవారు అధికం అవుతారు. మీ మిత్రులలో మార్పు మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ప్రతి విషయంలో ఓర్పు అవసరమని గమనించండి. తల పెట్టిన పనులలొ కొన్ని అవరోధాలు ఎదుర్కొనక తప్పదు. తోటలు, వ్యవసాయ రంగంలోని వారికి చికాకులు తప్పవు. బంధువుల రాకపోకలు పెరుగుతాయి. ప్రియతముల కోసం,ముఖ్యుల కోసం ధనం బాగా వెచ్చిస్తారు. అధికారులతో సంభాసించేటప్పుడు మెళకువ వహించండి. నూతన వ్యాపారం పట్ల ఆసక్తి పెరుగగలదు. కాంట్రాక్టర్లకు రావలసిన బకాయిలు సకాలంలో రావడం వలన ఆర్ధిక ఇబ్బందులు ఉండవు. బంగారు వెండి, వస్త్ర వ్యాపారులకు శుభదాయకం, పారిశ్రామిక రంగంలోని వారికి క్రమంగా మార్పులు రాగలవు. అవివాహితులకు అనుకూలమైన కాలం, వాణిజ్య రంగాలలోని వారికి నెమ్మదిగా మార్పులు కానవస్తాయి. ముఖ్యులలో ఒకరికి వీడ్కోలు పలుకుతారు. మీ కళత్ర మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. మీ నూతన పథకాలు ఆచరణలో పెట్టి జయం పొందుతారు. మీ పట్టుదల వలన ముఖ్యమైన విషయాలలో విజయం చేకూరుతుంది.

అశ్వని నక్షత్రం వారు కృష్ణవైడూర్యం, భరణి నక్షత్రం వారు వజ్రం, కృత్తికా నక్షత్రం వారు పచ్చ, కెంపు అనే రాయిని ధరించిన శుభం చేకూరుతుంది. ఈ రాశివారు లలితా సహస్రనామం, విష్ణుసహస్రనామం పారాయణ చేసిన ఆరోగ్యం, శుభం చేకూరుతాయి.