ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు

ఆదాయం: 8, వ్యయం:8, రాజపూజ్యం: 3 అవమానం: 5

ఈ రాశివారికి మే 1 వరకు వ్యయమునందు బృహస్పతి, ఆ తదుపరి అంతా జన్మమునందు, జులై 30 నుంచి వక్రగతిన వ్యయమునందు, డీశంబరు 19 నుంచి తిరిగి జన్మమునందు. ఈ నవంబరు 15 వరకు వ్యయము నందు రాహువు, షష్టమము నందు కేతువు, ఆ తదుపరి అంతా లాభము నందు రాహువు, పంచమము నందు కేతువు. ఈ సంవత్సరము సెప్టెంబరు 9 వరకు సప్తమము నందు శని, ఆ తదుపరి అంతా అష్టమ శని సంచరిస్తాడు.

ఈ సంవత్సరం 'తన కోపమె తన శత్రువు ' అన్నట్లుగా కోపతాపాలను అదుపులొ ఉంచుకోవడం మంచిదని గమనించండి. సహకార సంగహాలలొ వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. స్త్రీలకు ఆరోగ్యంలో చికాకులు తలెత్తినా సమసిపొగలవు. నిరుద్యోగులు సదవకాశాలు జారవిడుచుకుణ్టారు. ఆర్ధిక వత్తిడి ఎదుర్కొనక తప్పదు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఏకాగ్రత వహిస్తారు. వ్యవసాయ రంగంలోని వారికి సత్కాలం. నూతన వ్యాపారానికి శ్రీకారం చుట్టండి. కార్మికులకు సంతృప్తి, అభివృద్ధి కానవస్తుంది. వస్త్ర, బంగారు, వెండి వ్యాపారస్థులకు లాభదాయకం. సిమెంటు, ఐరన్, కలప వ్యాపారస్థులకు శుభం. హోటల్స్, తినుబండారాల వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంటుంది. ఇసుక, ఇటుక, తాపీపనివారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇప్పటివరకు వాయిదా పడుతున్న పన్లు పునఁ ప్రారంభమవుతాయి. కాంట్రాక్టర్లకు సదవకాశాలు లభించినా ఆర్ధిక ఒత్తిడి ఎదుర్కొనక తప్పదు. ఉద్యోగస్థులు మార్పునకై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మీ అభిప్రాయాలను బయటకు వ్యక్తం చేయటం వల్ల సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది.
అపరాల, ధాన్య వ్యాపారస్థులకు అభివృద్ధి కానవస్తుంది. భాగస్వామ్య వ్యాపారస్థులకు చికాకులు తప్పవు. హామీలు ఉండడం మంచిది కాదని గమనించండి. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగగలవు. నూనె, ఎండుమిర్చి, చింతపండు, బెల్లం, పసుపు, ధనియాలు వ్యాపారస్థులకు కలిసి రాగలదు. ఇతర దేశాలకు వెళ్లడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు ప్రధమ కన్నా ద్వితీయ భాగంలో ఆశించిన ఫలితాలు పొందగలరు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలలో మెళకువ వహించండి. ముఖ్యమైన వ్యవహారాలు పరిష్కార దిశలో సాగుతాయి. బంధు,మిత్రుల రాకపోకలు పెరుగుతాయి. ఇతరుల ఆంతరంగిక విషయాలలో జోక్యం కలిగించుకోకండి. స్వల్ప విషయాలలో మీ చుట్టుపక్కలవారితో సమస్యలు తలెత్తినా సమసిపోగలవు.

సంతానం విషయంలో సంతృప్తి కానరాదు. ఇష్టాగోష్టీలో పాల్గొంటారు. స్త్రీల తెలివితేటలకు, మంచితనానికి గుర్తింపు లభిస్తుంది. ఎదుటివారి ప్రభావానికి లోనవుతారు. ఉద్యోగస్థులకు బరువు, బాధ్యతలు పెరుగుతాయి. ఒక ముఖ్యమైన వ్యవహారం మిమ్మల్ని ఎంతో తికమకపెడుతుంది. మీ మనోవాంచ నెరవేరే సమయం ఆసన్నమైనదని గమనించండి. కుటుంబీకుల గురించి నూతన పధకాలు వేస్తారు.

మీకు ఈ సంవత్సరం సెప్టెంబరు నుంచి అష్టమ శనిదోషం ఏర్పడుతున్నందువల్ల శనికి మీ పేరుతో 3 నెలలకు ఒకసారి తైలాభిషేకం చేయిస్తూ, శ్రీ జ్ఞానప్రసూనాంబను ఆరాధన చేస్తూ, ఈశ్వరునికి అభిషేకం చేయించిన కలిసి వస్తుంది. ధనిష్ట నక్షత్రం వారు జాతి పగడం, శతభిషా నక్షత్రం వారు గోమేధికం, పూర్వాభాద్ర నక్షత్రం వారు, పుష్యరాగం లేకా వైక్రాంతమణి ధరించిన శుభం, జయం చేకూరుతుంది.