ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 అప్దాలు, ధనిష్ట 1, 2 పాదాలు

ఆదాయం: 8, వ్యయం:8, రాజపూజ్యం:7, అవమానం:2


ఈ రాశివారికి మే 1 వరకు జన్మమునందు బృహస్పతి, ఆ తదుపరి ద్వితీయమునందు, జులై 30నుంచి వక్ర గతిన జన్మమునందు, డిశంబరు 9 నుంచి ద్వితీయమునందు, ఈ సంవత్సరము నవంబరు 15వరకు జన్మమునందు రాహువు, సప్తమమునందు కేతువు, ఆ తదుపరి అంతా వ్యయమునందు రాహువు, షష్టమమునందు కేతువు. ఈ సంవత్సరము సెప్టెంబరు 9 వరకు అష్టమ శని, ఆ తదుపరి అంతా భాగ్యము నందు సంచరిస్తారు.

ఈ సంవత్సరము ' అపకారికి ఉపకారము 'అన్నట్లుగా అందరికీ సహాయ సహకారములు అందించడం వల్ల మీకు గుర్తింపు, రాణింపు లభిస్తాయి. అష్టమ శని దోషం మీకు హానికారం కాదు. ఆహార వ్యవహారాలలో జాగ్రత్త. ఆరోగ్యంలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ నెమ్మదిగా సమసిపోగలవు. స్థిరమైన మనసుతో స్థిరమైన పనులు చేపట్టి లాభం పొందండి. ఖాదీ, కలంకారీ, చేతి పరిశ్రమ రంగాలలో వారికి గుర్తింపు లభిస్తుంది. కాంట్రాక్టర్లకు ఊహించని సమస్యలు తలెత్తినా పరిష్కరించుకోగలుగుతారు. కార్మికులకు తాపీపని వారికి ఆర్ధిక విషయాలలో అభివృద్ధి కానవచ్చినా ధనం మాత్రం నిల్వ చేయలేరు. మీ ఆలోచనలను క్రియారూపంలో పెట్టి జయం పొందండి. నూనే, ఎరువులు, మందులు, రసాయనిక, సుగంధ ద్రవ్య, ఫ్యాన్సీ, కిరాణా వ్యాపారస్థులకు శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొన్నా ఏకాగ్రత వహించలేరు. అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. నూతన పెట్టుబడులకు శ్రీకారం చుట్టండి. ప్రెమికుల మధ్య ఆవగాహన లోపం, నిరమణ పధకాలలో పనివారితో సమస్యలు తలెత్తినా తెలివితో పరిష్కరిస్తారు. ఉద్యోగాభివృద్ధికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి.అతిథి మర్యాదలు బాగా నిర్వహిస్తారు. ఇతర దేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఉన్నట్టుంది మీలో ఆకస్మిక వేదాంత ధోరణి కనిపిస్తుంది. రైతులు, తోటలు రంగాలలోవారికి కలిసి రాగలదు. శాస్త్రజ్ఞులకు, పరిశోధకులకు, సాస్త్రరంగాలలో వారికి గుర్తింపు లభిస్తుంది. భూమి కొనుగోలుకై చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారస్థులకు కలిసి రాగలదు. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలో వారికి గుర్తింపు లభిస్తుంది. ట్రాన్స్ పోర్ట్, ఆటోమొబైల్ రంగాలలో వారికి అభిమాన బృందాలు అధికమవుతాయి. కుటుంబీకులలో ఒకరి ధోరణి మీకు చికాకు కలిగిస్తుంది. వైద్యులకు, న్యాయవాద రంగంలో వారికి పురోభివృద్ధి కానవచ్చిన మీ సహాయం పొంది మిమ్మల్ని తక్కువ అంచనా వేసేవారు ఎక్కువ అవుతారు. మీ మనోభావాలకు మంచి స్ఫురణ లభించగలదు. పాత విషయాలు ఒక కొలిక్కి రాగలవు. ఋణ ప్రయత్నం వాయిదా పడుతుంది. కొత్త వ్యక్తుల పరిచయం వల్ల కొత్త అనుభూతికి లోనవుతారు. స్త్రీ మూలక సమస్యలు ఎదురవుతాయి. సాహిత్య సదస్సులలో పాల్గొంటారు. అనవసరం సంభాషణలు చేయడం వల్ల ముఖ్యులలో ఆకస్మిక అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి.

ఈ రాశివారు శ్రీరామ పట్టాభిషేకం, ఉమా మహేశ్వర స్తోత్రం చదివినా, లేక విన్నా శుభం కలుగుతుంది. ఈ సంవత్సరం సెప్టెంబరు వరకు అష్టమ శనిదోషము ఉన్నందువల్ల నెలకు ఒక శనివారమునాడు శనికి తైలాభిషేకం చేయించిన కలిసి రాగలదు. శ్రవణ నక్షత్రం వారు స్పందన ముత్యం, ధనిష్టా నక్షత్రం వారు జాతి పగడం ధరించిన కలిసిరాగలదు.