ధనూ రాశి
Filed under: రాశి ఫలాలు Author: జ్యోతిమూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పదాలు, ఉత్తరాషాఢ 1 వ పాదం.
ఆదాయం: 5 , వ్యయం:14, రాజపూజ్యం:4, వ్యయం:2
ఈ రాశివారికి మే 1 వరకు ద్వితీయమునందు గురువు, ఆ తదుపరి తృతీయమునందు, జులై 30 నుంచి వక్రగతిన ద్వితీయమునందు, డిశంబరు 9 నుంచి తిరిగి తృతీయమునందు, ఈ సంవత్సరము నవంబరు వరకు ద్వితీయమునందు రాహువు. అష్టమమునందు కేతువు, ఆ తదుపరి అంతా జన్మమునందు రాహువు, సప్తమమునందు కేతువు, సెప్టెంబరు 9 వరకు భాగ్యమునందు శని, ఆ తదుపరి అంతా రాజ్యమునందు సంచరిస్తారు.
ఈ సంవత్సరము ' చింతింపకు గడచిన పని ' అన్నట్లుగా గడచిన దాని గురించి ఆలోచిస్తూ కాలం వ్యర్ధం చేయక సత్కాలం సద్వినియోగం చేసుకోండి. ఎంత వస్తువున్నప్పటికీ కూడా ఊహించని ఖర్చులు మీ అంచనాలను దాటుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలొ పాల్గొంటారు. అవివాహితులకు అనుకూలమైన కాలం. ఉపాధ్యాయులకు మార్పునకై చేయు ప్రయత్నాలు ఫలించగలవు. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి, విద్యార్థులకు మొదటి భాగంలో చాలా సంతృప్తి, అభివృద్ధి కానవస్తాయి. మీ ధైర్యసాహసాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. దూరప్రయాణాలకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. వాణిజ్య రంగంలోనివారికి సంతృప్తి, అభివృద్ధి కానవస్తుంది. ఉద్యోగస్థులు అనవసర ప్రసంగాల వలన అధికారులతో మాట పడవలసి వస్తుంది. ముఖ్యుల గురించి ఆందోళన పడతారు. తోటలు, వ్యవసాయ రంగంలోని వారికి పురోభివృద్ధి. నూతన పెట్టుబడులకు అనుకూలమైన కాలం, తల, కాళ్లు, నరాలకు సంబంధిన చికాకులు ఎదుర్కొనక తప్పదు. లాయర్లకు గుర్తింపు, రాణింపు లభించగలదు. సిమెంటు, కలప, ఇసుక, ఇనుము వ్యాపారస్థులకు పురోభివృద్ధి. ఉత్తర ప్రత్యుత్తరాలు మీకు ఎంతో సంతృప్తి నిస్తాయి. స్త్రీలకు అనుకూలత, రైతులకు వాతావరణంలో మార్పు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన బకాయిలు వాయిదా పడడం వల్ల ఆందోళనకు గురవుతారు. గృహంలో మార్పులు, చేర్పులు చేస్తారు.
ఈ రాశివారు హనుమాన్ చాలీసా చదువుతూ లేక వింటూ కుటుంబ సౌఖ్యానికి ఆరోగ్యాభివృద్ధికి రాహు, కేతువులకు శ్రీకాళహస్తిలొ పూజ చేయించిన అభివృద్ధి కానవస్తుంది. మూల నక్షత్రంవారు కృష్ణవైడూర్యం, పూర్వాషాఢ నక్షత్రం వారు జాతి వజ్రం, ఉత్తరాషాఢ నక్షత్రం వారు కెంపు ధరించిన పురోభివృద్ధి పొందుతారు.
No response to "ధనూ రాశి"
Post a Comment