పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు

ఆదాయం: 5, వ్యయం: 14, రాజపూజ్యం: 6, అవమానం:5


ఈ రాశివారికి నవంబరు 15 వరకు పంచమము నందు కేతువు, లాభమునందు రాహువు, ఆ తదుపరి అంతా చతుర్ధము నందు కేతువు, రాజ్యమునందు రాహువు, ఈ సెప్టెంబరు 9 వరకు షష్టమమునందు శని, ఆ తదుపరి అంతా సప్తమమునందు, మే 1 వరకు లాభమునందు బృహస్పతి, ఆ తదుపరి వ్యయము నందు, జులై 30 నుంచి మరలా వక్రగతిన లాభమునందు, డిశంబరు 19 నుంచి వ్యయము నందు సంచరిస్తారు.

ఈ సంవత్సరం ' పాలాసునకై ఆపద ' అన్నట్లుగా ఈ సంవత్సరం ప్రతి విషయంలోనూ ప్రశాంతత వహించడం వల్ల అన్ని విధాలుగా సంతృప్తి కానరాగలదు. కళాకారులు ఆందోళనకు గురవుతారు. శుభకార్యాలకై చేసే ప్రయత్నాలు అనుకూలించగలవు. ఫైనాన్స్, చిట్ ఫండ్ రంగాలలొ వారికి ఒడిదుడుకులు తప్పవు. రాజకీయాలలోని వారు ఆచితూచి వ్యవహరించాలి. వాణిజ్య రంగాలలోని వారు ఇన్‌కమ్ టాక్స్ వంటి సమస్యలు ఎదుర్కోక తప్పదు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. తొందరపడి వాగ్ధానాలు చేయడం వల్ల సమస్యలు ఎదుర్కొనక తప్పదు. కుటుంబీకుల విషయంలో సంతృప్తి కానరాదు. ప్రయివేటు సంస్థల వారు మార్పులకై చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ కళత్ర ఆరొగ్యం మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. నరాలు, మెడ, మోకాళ్లు, ఎముకలు, తలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు. మీ విరోధులు మీరు తలపెట్టిన పనిలొ అంతరాయం కలిగించడానికి ప్రయత్నిస్తారు. పనివారితో ఆవగాహనా లోపం ఏర్పడుతుంది. జాగ్రత్త వహించండి. దైవకార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వాహనం కొనుగోలు చేసె ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ పెద్దల ఆరొగ్యం విషయాలలో జాగ్రత్త వహించండి. మీ పిల్లల కోసం, ప్రియతముల కోసం ధనం బాగా ఖర్చు చేస్తారు. జాగ్రత్త వహించండి. ఊహించని ఖర్చులు అంచనాలు దాటడం వల్ల ఆందోళన పడతారని చెప్పవచ్చు. కోర్టు వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది. చిన్న చిన్న విషయాలకు ఆందోళన పడతారు. సదస్సులలో పాల్గొంటారు. తీర్ధయాత్రలకు ధనం వెచ్చిస్తారు.

గృహానికి మరమ్మతులు చేయించగలుగుతారు. ఇంట, బయట సమస్యలు తలెత్తినా తెలివితేటలతో పరిష్కరించుకోగలుగుతారు. అవివాహితులకు అనుకూలమైన కాలం. విద్యా సంస్థలలో వారికి అనుకూలంగా ఉండగలదు. కొంతమంది మీ మీద నిందారోపణ చేయడం వల్ల ఆందోళన అధికం అవుతుంది.

మీరు లక్ష్మీనారసింహుడిని పూజిస్తూ, ఎర్రని పూలతో కామెశ్వరీ దేవిని ఆరాధన చేసిన ఏ దోషాలు ఉన్నా తొలగిపోతాయి. పూర్వాభాద్ర నక్షత్రంవారు కనక పుష్యరాగం లేక వైక్రాంతమణి, ఉత్తరాభాద్ర నక్షత్రంవారు సౌగంధికానీలం, రేవతి నక్షత్రం వారు మయూరి మరకతం ధరించిన పురోభివృద్ధి పొందుతారు.