చెప్పలేదంటనక పొయ్యేరు .. నరులార గురుని
చేరి మొక్కితే బతుక నేర్చేరూ ...

చెప్పలేదంటనక పొయ్యేరు
తప్పదిదిగో గురుని వాక్యము
తప్పుదోవల బోవు వారల
చప్పరించి మింగు శక్తుల


మోప్పెతనమున మోసపొయ్యేరు.. అదిగాక కొందరు
గొప్పతనమున గోసు మీరేరు
ఇప్పు డప్పు డనగ రాదు
ఎప్పుడో ఎ వేలనో మరి
గుప్పు గుప్పున దాటిపోఎడు
గుర్ర పడుగులు ఏరుపదును...

తాకుతప్పులు తలచకున్నారు తార్కాణమైతే
తక్కు వెక్కువ తెలియనేర్తూరు
జోక తోడుత తల్లి పిల్లలు
జోడు బాసి అడవులందు
కాకి శోకము చేసే ప్రజలు
కాయ కసురులు నమిలి చత్తురు

కేక వేసియు ప్రాణ మిడిచేరు .. రాకాసి మూకలు
కాకబట్టి కలవరించేరు
ఆకసమ్మది ఎర్రబారును
ఆరు మతములు ఒక్కటౌను
లోకమండలి జనము లందరూ
నీరు నిప్పున మునిగి పోదురు ...

ఆగలు విడిచి పొగలు చాటేరు .. అదిగాక పట్టా
పగలు చుక్కలు చూసి భ్రమసేరు
భుగులు భుగులు ధ్వనులు మింటను
పుట్టిఎగిన పిమ్మతాను
దిగులు పడుచు ప్రజలు చాలా
దిక్కులేని పక్షులోదురు ...

పాట కూలు పదట కలిసేరు .. పరిపూత చరితులు
సాధువులూ సంతసించేరు
భూతలంబున నిట్టి వింతలు
పుట్టియణగిన పిమ్మటాను
నీతి కృతయుగ ధర్మ మప్పుడు

నిజము నిలకడ మీద తెలియును

ఏమొ ఏమొ ఎరుగకున్నారు.. ఎందెందు జూచిన
యముని పురికే నడవమన్నారు
భూమి మీదన ధూము ధాములు
పుట్టి పెరిగిన పిమ్మటాను
రామా రామా యననివారలు
రాలిపోదురు కాలిపోదురు

ముందు వెనుకలు గానకున్నారు .. మూర్ఖాళి భువిలో
ముందు గతినే యెరుగకున్నారు
కందువతో పిన్న పెద్దల
కన్ను గానక గర్వములచే
మందె మేలము లాడువారిని
బందు బందుగ గోతురక్కడ

కీడె యైనను కూడదందురు .. ఒనగూడినప్పుడు
యేడ జూచిన వాడు కొందురు
వేడుకతో పోతులూరి వీరభోగ వసంతరాయలు
ఏడు దీవులు ఏకచక్రము
ఏలును బ్రహ్మాండమంతా...