పుత్ర కామేష్టి యాగఫలం
Filed under: జిజ్ఞాస Author: జ్యోతి
దశరథుడు తన ముగ్గురు రానులకు ఇచ్చిన పాయస విభాగం. దాని అంతరార్థమేంటి ???
పుత్రకామేష్టి జరిగిన అగ్నిహోత్రము నుంచి ఒక దివ్య పురుషుడు ఆవిర్భవించి దివ్యపాయసముతో నిండిన ఒక బంగారు గిన్నెను దశరథునికి ఇచ్చాడు. ఆ పాయసములో సగభాగామును దశరథుడు కౌసల్యకిచ్చాడు. మిగిలిన సగభాగములో సగము సుమిత్రకు ఇచ్చాడు. ఆ విధంగా మరో ఎనిమిదో వంతుని కైకకివ్వగా మిగిలిన ఎనిమిదవ వంతు భాగమును సుమిత్రకు మరలా ఇచ్చాడు. సంప్రదాయ రీత్యా పెద్ద భార్య కంటే రెండవ భార్యకు, రెండవ భార్యకంటే మూడవ భార్యకు తక్కువ ఉండాలి. అందువల్ల సగము కౌసల్యకు, నాలుగవ వంతు మరల ఎనిమిదవ వంతు సుమిత్రకు, కేవలం ఎనిమిదవ వంతు మాత్రమే కైకేయికి ఇవ్వబడింది. ఆ క్రమంలో రామ, భారత, లక్ష్మణ , శతృజ్ఞులు జన్మించారు. ఇది వాల్మీకి రామాయణం ప్రకారం పాయస విభాగం. ఇక దీని అంతరార్ధము చూద్దాం. దశరథుడనే జీవుడు సత్త్వ రజస్తమో గుణములనే ముగ్గురు భార్యల ద్వారా ధర్మ, అర్ధ, కామ, మోక్షములనే నాలుగు పురుషార్ధములను పొందాలి. సాక్షాత్ ధర్మ స్వరూపుడు శ్రీరాముడి, అర్ధకామమోక్షములు కవలలు. ఒకటి ఉంటే రెండవది ఉంటుంది. లక్ష్మణ శత్రుఘ్నులు సుమిత్ర కుమారులు. ఇక భరతుడే మోక్షము. నలుగురు కుమారులు వారి వారి ప్రవర్తనలతో దీనిని నిరూపించారు. అయితే వీరు నలుగురు ఎప్పుదూ ఇద్దరు, ఇద్దరు కలిసే ఉన్నారు. ధర్మార్ధములు ఒక జంట, మోక్షకామములు ఒక జంట. రామ లక్ష్మణులు, భారత శత్రుఘ్నులు. ధర్మ బద్ధంగా అర్ధాన్ని సంపాదించాలి. మొక్షేచ్చతో కామాన్ని పొందాలి. ఈ విధంగా మానవుడు పురుషార్ధములు పొందగలదని
శ్రీ రామాయణము నిరూపించింది.

No response to "పుత్ర కామేష్టి యాగఫలం"
Post a Comment