మైలకాలంలో పూజలు చేయరాదంటారు. పోనీ దైవ స్తోత్రాలు చదవచ్చా??
Filed under: తెలుసుకుందామా Author: జ్యోతిసనాతన ధర్మశాస్త్రాలను స్మృతులు అంటారు. వాటిలో ఈ విషయాలన్నీ నిర్ణయించారు. పురుడుని జాతాశౌచం అంటారు. జాత అశౌచాన్ని దేవాలయ అర్చకులు తప్ప మిగతావారు పెద్దగా పట్టించుకోరు. కొంతమంది పురుడు కలిపేసుకుంటె శుభమని అసలు అశౌచాన్నే పాటించరు. కాని గృహంలో జరుపుకునే ఆరాధనలు ఆ సమయంలో పదోరోజు వరకు పనికిరావు.
తల్లిదండ్రులు మరణిస్తే మృత అశౌచం తీరిపోయాక ఇంట్లో పూజలు మామూలుగానే చేసుకోవాలి. కొందరు ఏడాది దాకా దీపం కూడా పెట్టరాదంటారు. అది తప్పు. దీపారాధన మైల సమయంలో తప్ప ఎప్పుడూ ఆపకూడదు. మామూలుగా ఆలయాలలో దైవదర్శనం దోషం కాదు. అయితే ఉత్సవాలు నిర్వహించడం పనికిరాదు. ఒక వ్యక్తి తన తండ్రితో కలిపి మూడు తరాలవరకు పితృకార్యాలు చేయాలి తాను ఉన్నంతవరకు చేస్తాడు. ఆ తర్వాత మొదటి తరం పోయి ఇతనితో కలిపి మూడుతరాలకు అతని కొడుకు చేస్తాడు.
వివాహం, గృహప్రవేశం ఇతర శుభకార్యాల తరవాత ఆరునెలల దాకా అదే గృహంలో పితృకార్యాలు చేయవచ్చు. అలాగే కర్మకాండలు జరిగిన గృహంలో వివాహాలు జరగవచ్చు. చనిపోయినవారి కొడుకులకు సంవత్సరం వరకు వివాహం చెయరు. కూతుళ్లకు మాత్రం చనిపోయినవారికి కన్యదాన ఫలం దక్కేందుకు గాను అదే సంవత్సరం వీలైతే వివాహం చేస్తారు. బ్రహ్మచారులకు మైలకాలం తీరిపోయాక ఇక ఏ అశౌచం ఉండదు. అశౌచ సమయాలలో ఏ పారాయణం అయినా బయటకు వినపడకుండా మనసులో చదువుకోవచ్చు. కొత్తవి చదవాల్సిన అవసరం లేదు. భగవన్నామస్మరణ అన్నివేళలా శ్రేయోదాయకమైనదే.
Indian Minerva
March 21, 2009 at 7:57 PM
Indian Minerva
March 21, 2009 at 7:57 PM
Rajasekharuni Vijay Sharma
March 21, 2009 at 10:04 PM
తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం
March 21, 2009 at 11:25 PM
మృతాశౌచం గల ఇంట్లో ఏడాది దాకా వివాహాలు పనికిరావు, కూతుళ్ళకయినా, కొడుకులకయినా ! కూతుళ్ళకి మినహాయింపు నివ్వడం - వాళ్ళ పెళ్ళిళ్ళు చెయ్యలేమోనని, వచ్చిన సంబంధాలు వెనక్కి పోతాయనే పాతకాలపు desperation లో ఎవరికి వాళ్ళు కల్పించుకున్నది మాత్రమే. మనుషుల మానసిక పరిస్థితి ఆలోచిస్తే - తండ్రి పోయిన దుఃఖంలో ఉన్న పిల్ల శోభనానికి సంతోషిస్తుందా ?
ఈ అనాచారం వల్లనే ఆధునిక ఆడపిల్లలు పితృదేవతల ఆగ్రహానికి గురైనట్లు కనిపిస్తోంది. అంతకుముందు లేని భార్యాహింస ఆ తరువాతి కాలంలో మన దేశంలో పెచ్చుమీఱిపోయింది.
Naga
March 22, 2009 at 3:53 AM
@ఇండియన్ మినర్వా
The Power of Now పుస్తకంలో శాస్త్రీయతను వివరించారు. ఇక్కడ రాయడం కష్టం.
జ్యోతి
March 22, 2009 at 3:08 PM
జ్యోతి
March 22, 2009 at 3:11 PM
మీరు చెప్పింది నిజమే. సంబంధం సిద్దంగా లేకున్నా చావు జరిగిన ఇంట్లో ఏడాదిలోగా ఆడపిల్ల పెళ్లి చేయాలంటారు. కాని పెళ్లి జరిగిన ఇంట్లో ఎప్పుడో పాతికేళ్ల క్రింద చనిపోయిన తండ్రి ఆబ్దికం పెట్టకూడదు, ఇతర సోదరులు పెట్టినా కన్యాదానం చేసినవారు తద్దినపు భోజనం తినొద్దు అంటారు.
ఈ మద్య నేను చూసిన మరో వింత ఆచారం. ఎవరి ఇంట్లో అయినా తల్లి చనిపోతే ఆ ఏడాది పండగలు జరుపుకోరు కాని ఇంటికి పెద్ద తండ్రి బ్రతికి ఉన్నాడు కాబట్టి నోములు చేసుకుంటున్నారు. పైగా బ్రాహ్మణులను అఢిగి. వారే ఈ సంగతి చెప్పారంట. ఇది నిజమా... వీటికి అశౌచం ఉండదా..
సుజాత వేల్పూరి
March 22, 2009 at 4:32 PM
పితృదేవతల ఆగ్రహం అనే మాట నాకు నమ్మశక్యంగా తోచదు. తమ తర్వాత తరాల వారు సంతోషంగా ఉండాలనే పితృదేవతలు కోరుకుంటారు గానీ, అస్థికలు గంగలో కలపలేదనో, తాము పోయిన ఏడాదిలోపల పెళ్ళి చేసుకున్నారనో కోపించేవారికి పితృ "దేవతలు"అని పేరెందుకూ ఇక?
భార్యా హింస అనేది అనాదిగా ఉన్నదే! ఇదివరలో ఇలా కేసులు పెట్టడాలు, కోర్టులకెక్కడాలు లేవుకాబట్టి తెలీలా మనకి! మనుషుల్లోని అనాగరిక పద్ధతులకూ, మృగప్రవృత్తికీ పితృదేవతలతో సంబంధం అంటగట్టడం ఏమి న్యాయం?
తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం
March 23, 2009 at 3:05 PM
సాధారణంగా పితృదేవతలంటే మనలో చాలామంది భావిస్తున్నట్లు చచ్చిపోయిన పెద్దవాళ్ళు కారు. పితృలోకానికి అధిపతులే పితృదేవతలు. చనిపోయినవాళ్ళ తరఫున వారు ప్రవర్తిస్తారు. పనిచేస్తారు. పిండప్రదానాలూ గట్రా స్వీకరించి వాళ్ళకి సద్గతులు ప్రసాదించేదీ, భావితరాల్నీ, ప్రస్తుతతరాన్నీ ఆశీర్వదించేదీ వారే. ఒకవేళ పిండప్రదానాలు మానేస్తే వంశనాశనం చేసేదీ, దరిద్రాన్ని ప్రసాదించేదీ కూడా వారే.
ఇహపోతే, భార్యాహింస ఈ కాలంలో ఉన్నట్లు ఏ కాలంలోను లేదు. ఉందనడానికి చారిత్రిక ఆధారాలు లేవు. ఎందుకంటే గతకాలంలో ఉన్నవి కేవలం ఉమ్మడి కుటుంబాలు కావు. బంధుత్వం గల వంశాలన్నింటికీ కలిపి ఏకంగా ఉమ్మడి గ్రామాలుండేవి. ఒకే ఊళ్ళో సంబంధాల్ని ఇచ్చిపుచ్చుకునేవారు. ఒక్కొక్కరికీ ఊళ్ళో యాభై, వందమంది బంధుబలగం ఉండేది. మాయింట్లోనే 18 మంది ఉండేవారు. అలాంటి వాతావరణంలో స్త్రీలని బాధపెట్టడం సాధ్యపడదు. ఆడవాళ్ళకీ, ఆడవాళ్ళకీ పడకపోవడం ఉండేది. అంతమాత్రాన భార్యాహింస ఈ కాలంలో మాదిరి ఉండేదనడం సమంజసం కాదు. "అనాదిగా....అనాదిగా...అనాదిగా.....స్త్రీ.." అంటూ ఫెమినిస్టులు తమ నోటికొచ్చినట్లు చేసిన ప్రచారమే తప్ప అది వాస్తవం కాదు. తాము కోరుకున్న మార్పుల కోసం, తమ కనుకూలమైన చట్టాల కోసం అందునిమిత్తం మగజాతి సానుభూతి కొట్టెయ్యడం కోసం వాళ్ళు పదేపదే ఎడాపెడా ఎక్కడ పడితే అక్కడ చేసిన victimization propaganda మాత్రమే ఇది. ఆ propaganda ని ఆడవాళ్ళ మీద కూడా అదే స్థాయిలో చెయ్యడానికి అవకాశం ఉందని గమనించాలి. అసలు ఈ రోజున కూడా ఆ propaganda లో వాస్తవం పాలు బహుతక్కువ. నాకయితే ఎక్కడ చూసినా భార్యాదాసులే కనిపిస్తున్నారు. వేమన అంతటి వాడు ఆ రోజుల్లోనే "భార్య వశత గాని బతుకులు లేవయా !" అన్నాడు. స్వాములవార్ల చరిత్రల్లో గయ్యాళిగంపల కథలు చాలానే ఉన్నాయి.
ఈ కాలపు ఆడవాళ్ళు పితృశాపాలకి గురయ్యారో లేదో అది ఎవరి జాతకాలు వాళ్ళు చూసుకుంటే తెలుస్తుంది. అది గమనించకుండా ఈ దురాచారాలు, దుర్భాషలూ కొనసాగిస్తే వారు ఎదుర్కునే విషాదాలు రాబోయే తరాల్లో మరింత పెచ్చు మీఱతాయి తప్ప తగ్గుముఖం పట్టవు. ఎన్ని చట్టాలు చేసుకున్నా ఏమీ లాభం లేదు.మృగప్రవృత్తి గట్రా అని తిట్టుకుని ప్రయోజనం లేదు. శాపాలన్నీ సాధారణంగా అలాంటివాళ్ళ ద్వారానే అమలు జరపబడతాయి. పితృశాపమే కాక కొందరు ఆడవాళ్ళు పూర్వజన్మలో భర్తృశాపానికి గురికావడం కూడా ఈ జన్మలో భర్త ద్వారా హింసపడ్డానికి కారణమవుతుంది.చనిపోయేదాకా అవసరం లేదు. బతికుండగానే కొడుకులకీ కూతుళ్ళకీ శాపాలిచ్చేవాళ్ళున్నారు.
రవి
March 25, 2009 at 8:19 PM
సాయిబాబా గురించి నాకు తెలియదు కానీ నేను సుజాత గారితో ఏకీభవిస్తాను.
మన మీద ప్రేమ లేని పితృదేవుడు, తన పని నెరవేరలేదని, మనకు శాపాలు పెట్టటానికి మాత్రం వెనుకాడడు!
సమాజంలో అసమానతలకు, ఒకరి దారిద్ర్యానికి కారణం - ప్రతి మనిషిలోనూ ఉన్న తృష్ణ, aquisitive desire అంటాడు కృష్ణమూర్తి. ఇది పెద్ద గహనమైన విషయం కాదు. అయితే మనం ఒప్పుకోం.
నా వరకు నాకు ఈ శ్రాద్ధ కర్మలకన్న, అదే డబ్బు వెచ్చించి ఓ పదిమందికి సాయపడ్డం మంచిదనిపిస్తుంది.
ఇక స్త్రీ హింస. హింస అంటే కొట్టటం, తిట్టటమే కాదు. అర్థం పర్థం లేని అమానుషమైన ఆదర్శాలను స్త్రీలపై మోపి (ఉదాహరణ:బాల్య వివాహాలు, సతి, విధవకు పునర్వివాహ నిషేధం వగైరా)వాళ్ళను బానిసలుగా చేయటమూ హింసే. కొట్టటం, చంపటంకన్నా ఇది దారుణమైన హింస.
పురుషులను పీడించిన స్త్రీలు ఉండవచ్చు గాక. అయితే ఇప్పటి వరకు పురుషుని వల్ల హింసకు గురయిన స్త్రీలే ఎక్కువ.
Anil Dasari
March 27, 2009 at 2:33 AM
ఆధారాలేమన్నా ఉన్నాయా లేక మీ అనుభవంలోనుండి చెబుతున్నారా? ఒక వేళ మీ స్వీయానుభవం నుండే చెబుతున్నట్లైతే, సమస్య మీ (అనగా తా.ల.బా.సు. గారి) వైపే ఉందేమో ఆలోచిస్తే బాగుంటుంది.
ఎందుకో గానీ, మీకు బ్రాహ్మణేతరులపై అకారణ ద్వేషం ఉందనిపిస్తుంది.
సుజాత వేల్పూరి
March 27, 2009 at 10:55 AM
బాగా చెప్పారు. శ్రాద్ధ కర్మలకు వెచ్చించే డబ్బుని మరో రకంగా సద్వినియోగం చేయడం వైపే నా మొగ్గూనూ! మా నాన్నగారు (మా అమ్మ ఆరోగ్యం బాగాలేక) దాదాపు పదేళ్ళుగా వాళ్ళ అమ్మగారి(మా నాన్నమ్మ) ఆబ్దికం రోజున పేదవాళ్లకు అన్నదానం చేస్తారు. అంతకు మించిన సంతృప్తి కలిగించే కార్యక్రమం ఇంకొకటి మా నాన్నమ్మ గారికి ఉంటుందని నేననుకోను.
స్త్రీ హింస గురించి కూడా మీతో 100 శాతం ఏకీభవిస్తున్నాను.స్త్రీలు ఎక్కువ హింసకు గురయ్యారా, పురుషులా అనే దానికి కూడా చారిత్రక ఆధారాలు, గణాంకాలు చూడాల్సిన స్థితి మనది! రికార్డ్ ఉంటే చాలు, వాస్తవమేదైనా!
viswabrahmana viswa veekshanam
March 27, 2009 at 12:14 PM
viswabrahmana viswa veekshanam
March 27, 2009 at 12:15 PM
పై అభిప్రాయం తప్పని చెప్పలేము గాని ఆలయాలలో అర్చకుల నుండి పురోహితుల వరకు పూజలందుకునే భగవంతునేగాగ బ్రాహ్మణులను కూడా దేవుడని భావించెదరు సుమా.
బ్రాహ్మణులనగా బ్రహ్మజ్ఞానం కలవారని పెద్దలనగా వినికిడి
బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్
October 24, 2009 at 12:46 AM