ఒక అద్భుతమైన పద్యం గురించి ఒక్కసారి తెలుసుకుందాము.

ఈ పద్యంలో ప్రతి పాదానికి గల మూడు అక్షరాల సమాధాన పదం - మూడేసి పదాల ఏక పదంగా ఉంటుంది. అంటే మొదటి రెండక్షరాలతో ఒక పదం, చివరి రెండక్షరాలతో ఒక పదం, మొదటి చివరి అక్షరాలతో ఒక పదం ఉంటాయి.

ఆద్యంత మధ్య మంతాది మధ్యంబులో
తేటి రక్కసి రాజు తెలియ తల్లి

ఆద్యంత మధ్య మంతాది మధ్యంబులో
శివు నిల్లు నరిచేను క్షీర ధార

ఆద్యంత మధ్య మంతాది మధ్యంబులో
భార్యయు ఖడ్గంబు బరగచెట్టు


అన్నిటికి జూడ మూడేసి అక్షరములు
మొదలు తుదలును, నడి తుద, మొదలు నడుమ
ప్రాణ రక్షణ తలలందు పాదపముల
పరికరములందు నీ యర్ధ మరయ వలయు !!