ముక్తి భేదాలు
Filed under: తెలుసుకుందామా Author: జ్యోతి
సాలోక్య, సామీప్య, సాయుజ్య, సారూప్య ముక్తులు అంటే ఎట్టివారు? భేదాలేమిటి?
సారూప్య, సాలోక్య, సామీప్య, సాయుజ్య ...అని ముక్తి భేదాలు.
తాను ఉపాసించే దేవతను నిరంతరం ధ్యానించడం చేత ఆ దేవతా రూపాన్ని
(దివ్య మంగళ దేహాన్ని) ధరించడం "సారూప్యముక్తి". వైకుంఠంలో
విష్ణువువంటి రూపాలు, మణిద్వీపంలో అమ్మ వంటి రూపాలు,కైలాసంలో
శివుని వంటి రూపాలు.. ఇవి "సారూప్య "ముక్తులు.
నిరంతరం భగవల్లోక భావన (భగవంతుడే లోకంగా ఉండడం) చేత ఆ
దేవతాలోకంలో నివసించడం "సాలోక్యం"
ఆ లోకంలో కూదా దేవతకి సమీపంలో ఉండగలిగే భాగ్యం "సామీప్యం".
చివరకు మరి దేవతకు భిన్నము కాకుండా పూర్తిగా తన జీవభావం దేవతలో
విలీనం కావడం "సాయుజ్యం"
ఇది అద్వైతంలో చెప్పబడుతుంది. తాదాత్మ్య ఉపాసన, అభిన్న భావన
వలన లభించే ముక్తి ఇది. వారి వారి ఉపాసనా స్థాయిని బట్టి ఈ ముక్తులు
అనుగ్రహించబడతాయి.

No response to "ముక్తి భేదాలు"
Post a Comment