'హనుమాన్ చాలీసా ' లో "అష్టసిద్ధి నవనిధికే దాతా" అనే నామం ఉన్నది. అష్టసిద్ధులు,నవనిధులు అంటే ఏమిటి?

అష్టసిద్ధులు...

1.అణిమా
2.మహిమ
3.లఘిమ
4.ప్రాప్తి
5.ప్రాకామ్యము
6.ఈశత్వం
7.వశిత్వం
8.సర్వ కామసిద్ధి (కామావసాయిత్వము)

" అణువులా" సూక్ష్మరూపాన్ని పొందడం "అణిమాసిద్ధి" ,అనేక కోట్ల బ్రహ్మాండాల కంటే అధికుడవడం "మహిమా"సిద్ధి, పరమాణువుల కంటే తేలిక కావడం " లఘిమా" సిద్ధి, గొప్ప బరువుగా మారగలగడం "గరిమ", ఇష్టపదార్థాలను పొందగలగడం "ప్రాప్తి"సిద్ధి. లౌకిక పారలౌకిక పదార్థాలలో దేనిని కావాలంటే దానిని పొందడం "ప్రాకామ్యసిద్ధి" అన్నిటిపై, అందరిపై అధికారాన్ని పొంది, తన ఇచ్చ మేరకు నడిపించడం "వశిత్వం" దేవతలతో సహా తాను కోరిన వారిని వశం చేసుకొనడం "వశిత్వం" అన్ని కోరికలను పూర్తిగా తీర్చుకొనడం "కామావసాయిత్వం"



నవనిధులు...

1. పద్మం
2. మహాపద్మం
3. శంఖం
4. మకరం
5. కచ్చపం
6. ముకుందం
7. నీలం
8. కుందం
9. వరం

ఇవి ఐశ్వర్య ప్రతీకలైన నిధులు. ఇవి కుబేరుని వద్ద మహాలక్ష్మి దయవలన కలిగి ఉన్నాయి. ఈ నిధి దేవతల వలన భూ,జల, లోహ భోగాది సంపదలు లభిస్తాయి.