ఒరుత్తి మగనాయ్ పిఱందు ఓరిరవిల్

ఒరుత్తి మగనాయ్ యొళిత్తు వళర
తరిక్కిలానాకి త్తాన్ తీంగు నినైంద
కరుత్తై పిరపిత్తు కంజన్ వైత్తిల్
నెరుప్పెన్న నిన్న నెడుమాలే ఉన్నై
అరుత్తిత్తు వందోం పఱై తరుతియాగిల్
తిరుత్తక్క శెల్వముమ్ శేవకముమ్ యాంపాడి
వరుత్తముమ్ తీరుంద్ ముగిరుంద్-ఏలోర్ ఎంబావాయ్



రాగం : కల్యాణి

ఒక అమ్మ కొమరుడివై ప్రభవించినావు
ఆ రాత్రె మరు అమ్మ ఒడిలోన దాగి పెరిగినావు // ఒక అమ్మ //
నిన్నే మార్చి పరిమార్చ పన్నిన పన్నాగముల
తలక్రిందులుగ జేసి, కలకలము రేపావు..
కుమతి కంసుని గుండె బడబాగ్ని వయినావు! ఓ ఆశ్రిత
వ్యామోహశీలి! నిన్నెకోరి వచ్చితిమి - నీవే కోరి పరనిచ్చితే
శ్రీకే శ్రీ యగు నీ విభవమ్ము, వీరగాధలు
గానమ్ము చేసెదము - శ్రమతీరి ఆనందించెదము
జగతికే మంగళము కూర్చు మన శ్రీ వ్రతము..


ఈ పాశురంలో శ్రీకృష్ణావతార రహస్యాన్ని వివరిస్తున్నారు. " కృష్ణా! ఒక అమ్మకు (దేవకి) కి బిడ్డగా జన్మించి, అదే రాత్రి ఊరు దాటి మరో అమ్మ(యశోద)కి బిడ్డవై పెరిగావు. ఐనా కూడా నీవు బ్రతికి ఉండడం సహించలేక నీకు కీడు తలపెట్టి ఎన్నోసార్లు చంపడానికి ప్రయత్నించిన కంసుని ఆలోచనలను నాశనం చేసి ఆతని కడుపున చిచ్చువైనావు. మేము నీనుండి ఏది కోరడానికి రాలేదు స్వామి! నిన్నే కోరి వచ్చాము. సిరికే శ్రీవైన నీ ఐశ్వర్యాన్ని, వీరచరిత్రను గానం చేసి మా శ్రమను పోగొట్టుకుని ఆనందిస్తున్నాము."


ఒకరు తపస్సు చేసి నలుగురు బిడ్డలను పొందగా నలుగురు తపస్సు చేసి ఒక బిడ్డను పొందారు. వారే దశరథుడు, దేవకీ వసుదేవులు, యశోదానందులు. శ్రీకృష్ణుడు దేవకీ గర్భాన జన్మించినా ఆమెకు దూరమై యశోద ఇంట పెరిగాడు. ఐనా కూడా అతని ఉనికి సహించలేని కంసుడు ఎన్నోసార్లు కృష్ణుని చంపాలని ప్రయత్నం చేసాడు. భగవత్ తత్వాన్ని నాశనం చేయాలని చూసేవాడు తానే లేకుండా పోతాడు. శ్రీకృష్ణుడి తనను ఆశ్రయించివారి కడుపులో ఉన్న కంసుని మీది భయాన్ని ఆతని కడుపులోనే అగ్నిలా ఉంచి చివరకు అంతమొందించాడు... పరమాత్మ 'రక్షింపుము' అనగానే రక్షిస్తాడు. మనస్ఫూర్తిగా కాకున్నా తలచినంతనే వచ్చి రక్షిస్తాడు. కాని శిక్షించేటప్పుడు మాత్రం జాగ్రత్తగా అన్నీ గమనించి శిక్షిస్తాడు. కంసుడు కేవలం మాటలు, చేతలలోనే కాక మనసులో కూడా చెడు తలంపు కలిగి ఉన్నవాడు కాబట్టి అతన్ని సంహరించాడు.



గోపికలు 'నిన్నే కోరి వచ్చాము స్వామీ అనగానే కృష్ణుడు అదేమమ్మా నిన్న పర కావాలన్నారు ఇవాలేమో నేనే కావాలంటున్నారు? అని అడుగగా. సామీ! మేమడిగినంత మాత్రాన నువ్వు మాకు 'పర'ను ఇస్తావా? నీకు ఇవ్వాలనుకున్నప్పుడే ఇవ్వు.అంతా నీ దయ, సంకల్పమే కదా? స్త్రీ ఐనా, పురుషుడైనా బాయటనుండి అందరూ స్త్రీలే. అంతరంగా మాత్రం అందరూ పురుషులే!. ఇక కావలసినదేముంది? ఆ పరమాత్మతో నిత్యం కలిసి ఉండి ఆతనికే చెంది ఉండడం.. సిరి(లక్ష్మి)కి ఐశ్వర్యమైనశ్రీ(శ్రీ) ఐన పరమాత్మను కీర్తించి, సేవించడంలో తాము పడిన శ్రమ అంతా తీరిపోయి ఆనందంగా ఉన్నామని గోపికలు అన్నారు.