కౌసల్యా సుప్రజారామా పూర్వా సంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ట నరశార్దూలా కర్తవ్యం దైవమాహ్నికం

ప్రతీరోజు ప్రభాతవేళ శ్రావ్యంగా వినిపించే ఈ చరణాలతో ఆ దేవదేవుడినే కాదు సమస్త లోకాలను మేలుకొలుపుతుంది ఈ సుప్రభాతం. మొత్తం సుప్రభాతం కంఠతా రాకున్నా ఈ రెండు చరణాలు తెలీని భక్తుడు ప్రపంచంలో ఎక్కడా ఉండడేమో. శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం కలియుగ వైకుంఠపతి వేంకటేశ్వరుని సుప్రభాత సేవలో కీర్తించే స్తోత్రము. సంస్కృతంలో ఉన్న ఈ ప్రార్ధన తెలుగునాట, మరియు ఇతర హిందువులలోను అత్యంత ప్రాచుర్యం పొందిన స్తోత్రం . అన్ని వెంకటేశ్వరస్వామి ఆలయాలలోను, ఇండ్లలోను ఈ సుప్రభాతాన్ని చదివే, వినే ఆచారం ఉంది. తిరుమలలోని శ్రీనివాసుడిని ప్రతీరోజు ఉదయం మూడుగంటలకు అర్చక స్వాములు ఈ సుప్రభాతంతో లేవయ్యా స్వామీ! మమ్మేలుకోవయ్యా! అని స్తుతిస్తారు. తిరుమలలోనే కాదు శ్రీవేంకటేశ్వరుడి ఆలయాలన్నింటిలోనూ ఈ సుప్రభాతం తప్పకుండా వినిపిస్తుంది. సామాన్యులమైన మనమే కాదు సకలదేవతలు కూడా ఈ సుప్రభాతంతో స్వామిని మేల్కొలుపుతారంట. ఈ సుప్రభాతంతో స్వామి మాత్రమే కాదు జగత్తు మొత్తం మేలుకుంటుంది. ఇక ఆ స్వామి నిద్రలేవకుండా ఉంటాడా??సుందర మనోహరుడు సర్వజగద్రక్షకుడు శ్రీనివాసుడిని మేల్కొలిపే ఈ సుప్రభాతాన్ని ఎవరు రచించారు? ఎప్పటినుండి ఇది ఆనవాయితీగా మారింది? ఈ విషయాలు తెలుసుకుంటే... శ్రీవైష్ణవ భక్తాగ్రేసరుడైన ప్రతివాద భయంకర అణ్ణన్ ఈ సుప్రభాతాన్ని రచించారు. ఈయన క్రీ.శ.1361 వ సంవత్సరంలో అనంతాచార్యులు మరియు ఆండాళ్ దంపతులకు కంచి పట్టణంలో జన్మించారు. ఈయన శ్రీరామానుజాచార్యులచే నియమింపబడిన 74 సింహాసనాధిపతులలో ఒకరైన 'ముడుంబ నంబి' వంశానికి చెందినవారు. ఈయన గురువు మణవాళ మహాముని. ఆ శ్రీనివాసుని అనుగ్రహంతో చిన్న వయసులోనే ఎన్నో విద్యలు అభ్యసించారు అణ్ణన్. ఒకసారి ఉత్తరభారతదేశం నుండి వచ్చిన "నరసింహ మిశ్ర" అనే పండితుడు తన ప్రావీణ్యంతో దక్షిణ భారతదేశంలోని పండితులను ఓడించాడు. కాని అణ్ణన్ అతడిని ధీటుగా ఎదుర్కొని ఓడించారు . అప్పటినుండి ఆయన పేరు "ప్రతివాద భయంకర అణ్ణన్" గా స్థిరపడిపోయింది.


పూర్వం వేంకటేశ్వర స్వామికి సుప్రభాతవేళ ప్రత్యేకమైన అర్చన అంటూ లేకుండా అర్చక స్వాములచే ప్రబంధ పఠనం మాత్రం జరిగేది. ఒకసారి అణ్ణన్ తన గురువు శ్రీరంగంలోని ప్రధాన జీయర్ ఐన శ్రీవరవరమునితో కలిసి తిరుమల సందర్శించారు. అక్కడ పరిస్థితి చూసిన గురువుగారి ఆదేశం మేరకు అణ్ణన్ అప్పటికప్పుడు ఆశువుగా శ్రీనివాసుని స్తుతిస్తూ సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళశాసనం పఠించాడు. కమ్మనైన పదాలతో కూడిన ఆ సుప్రభాతాన్ని విన్న అర్చక స్వాములతో పాటు స్వామి కూడా పరవశుడైనాడు. అణ్ణణ్ పఠించిన ఆ సుప్రభాతమే ఈనాటివరకూ స్వామివారికి మేల్కొల్పడానికి పఠిస్తున్నారు. ఈ సుప్రభాతంలోని మొదటి శ్లోకం రామాయణంలోనిది, తొమ్మిది, పది, పదమూడవ శ్లోకాలు మార్కండేయ పురాణంలోనివి అని అంటారు.

సుప్రభాతాన్ని బంగారువాకిలి ఎదురుగా "తిరుమామణి మంటపం"లో పఠిస్తారు. ఈ సుప్రభాతం కీర్తనలో నాలుగు భాగాలున్నాయి.

వెంకటేశ్వర సుప్రభాతం - దేవునికి మేలుకొలుపు : 29 శ్లోకాలు - ఇది ప్రతివాద భయంకర అణ్ణన్ రచించిన భాగం. శ్రీరామ, శ్రీకృష్ణ అవతారాలను ధరించిన శ్రీమహావిష్ణువు కలియుగంలో శ్రీవెంకటేశ్వరునిగా అవతరించి భక్తులను బ్రోచుచున్నాడని, ఆ దేవదేవుని కొలిస్తే సకలార్ధ సిద్ధి కలుగుతుందని సుప్రభాత కీర్తనలో సూచింపబడుతున్నది.
వెంకటేశ్వర స్తోత్రం - భగవంతుని కీర్తన : 11 శ్లోకాలు
వెంకటేశ్వర ప్రపత్తి - భగవంతునికి శరణాగతి: 16 శ్లోకాలు - శ్రీవైష్ణవ సంప్రదాయంలో ప్రపత్తి అనేది చాలా ముఖ్యమైన అంశం. గురువులకు, భగవంతునికి సంపూర్ణంగా శరణాగతులవడం ప్రపత్తి లక్షణం.
వెంకటేశ్వర మంగళాశాసనము - పూజానంతరము జరిపే మంగళము : 14 శ్లోకాలు - ఈ భాగాన్ని మణవాళ మహాముని రచించాడట.

కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే
ఉత్థిష్ఠ నర శార్దూల కర్తవ్యం దైవమాహ్నికం
ఉత్థిష్ఠోత్థిష్ఠ గోవింద ఉత్థిష్ఠ గరుడ ధ్వజ
ఉత్థిష్ట కమలా కాంతా త్రైలోక్యం మంగళం కురు
మాత స్సమస్త జగతాం మధుకైటభారేః
వక్షో విహారిణి మనోహర దివ్య మూర్తే
శ్రీ స్వామిని శ్రిత జన ప్రియ దాన శీలే
శ్రీ వేంకటేశ దయితే తవ సుప్రభాతం
తవ సుప్రభాత మరవింద లోచనే
భవతు ప్రసన్న ముఖ చంద్ర మండలే
విధి శంకరేంద్ర వనితాభిరర్చితే
వృష శైల నాథ దయితే దయానిధే
అత్ర్యాది సప్త ఋషయ స్సముపాస్య సంధ్యాం
ఆకాశ సింధు కమలాని మనోహరాణి
ఆదాయ పాద యుగ మర్చయితుం ప్రపన్నా ః
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం
పంచాన నాబ్జభవ షణ్ముఖ వాసవాద్యా ః
త్రైవిక్రమాది చరితం విబుధా స్తువంతి
భాషాపతిః పఠతి వాసర శుద్ధి మారాత్
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం
ఈషత్ ప్రఫుల్ల సరసీరుహ నారికేళ
ఫూగద్రుమాది సుమనోహర పాలికానాం
ఆవాతి మంద మనిల స్సహ దివ్య గంధై ః
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం
ఉన్మీల్య నేత్రయుగ ముత్తమ పంజరస్థా ః
పాత్రా వశిష్ట కదళీ ఫల పాయసాని
భుక్త్వా సలీల మథ కేళి శుకా ః పఠంతి
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం
తంత్రీ ప్రకర్ష మధుర స్వనయా విపంచ్యా
గాయత్యనంత చరితం తవ నారదోపి
భాషా సమగ్రమ సకృత్ కర సార రమ్యం
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం
భృంగావళీచ మకరంద రసాను విద్ధ
ఝంకార గీత నినదై స్సహ సేవనాయా
నిర్యాత్యుపాంత సరసీ కమలోదరేభ్య ః
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం
యోషా గణేన వర దధ్ని విమథ్య మానే
ఘోషాలయేషు దధి మంథన తీవ్రఘోషా ః
రోషాత్కలిం విదధతే కకుభశ్చ కుంభాః
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం
పద్మేశ మిత్ర శతపత్ర గతాళి వర్గా ః
హర్తుం శ్రియం కువలయస్య నిజాంగ లక్ష్మ్యా
భేరీ నినాద మివ బిభ్రతి తీవ్ర నాదం
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం
శ్రీమన్నభీష్ట వరదాఖిల లోక బంధో
శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో
శ్రీ దేవతాగృహ భుజాంతర దివ్య మూర్తే
శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం
శ్రీ స్వామి పుష్కరిణికాప్లవ నిర్మలాంగాః
శ్రేయోర్థినో హర విరించి సనంద నాద్యా ః
ద్వారే వసంతి వర వేత్ర హతోత్తమాంగాః
శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం
శ్రీ శేషశైల గరుడాచల వేంకటాద్రి
నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం
ఆఖ్యాం త్వదీయ వసతే రనిశం వదంతి
శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం
సేవాపరా శివ సురేశ కృశాను ధర్మ
రక్షోంబు నాథ పవమాన ధనాది నాథాః
బద్ధాంజలి ప్రవిలస న్నిజ శీర్ష దేశాః
శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం
ధాటీషుతే విహగరాజ మృగాధిరాజ
నాగాధిరాజ గజరాజ హయాధిరాజాః
స్వస్వాధికార మహిమాదిక మర్థయంతే
శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం
సూర్యేందు భౌమ బుధ వాక్పతి కావ్య శూరి
స్వర్భాను కేతు దివిషత్ పరిషత్ ప్రధానాః
త్వద్దాస దాస చరమావధి దాస దాసా ః
శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం
త్వత్పాద ధూళి భరిత స్ఫురితోత్తమాంగాః
స్వర్గాప వర్గ నిరపేక్ష నిజాంతరంగాః
కల్పాగమా కలనయా కులతాం లభంతే
శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం
త్వద్గోపురాగ్ర శిఖరాణి నిరీక్షమాణాః
స్వర్గాపవర్గ పదవీం పరమాం శ్రయంతః
మర్త్యా మ్నుష్య భువనే మతి మాశ్రయంతే
శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం
శ్రీ భూమి నాయక దయాది గుణామృతాబ్ధే
దేవాది దేవ జగదేక శరణ్య మూర్తే
శ్రీమన్ననంత గరుడాదిభి రర్చితాంఘ్రే
శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం
శ్రీ పద్మనాభ పురుషోత్తమ వాసుదేవ
వైకుంఠ మాధవ జనార్దన చక్రపాణే
శ్రీ వత్స చిహ్న శరణాగత పారిజాత
శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం
కందర్ప దర్ప హర సుందర దివ్య మూర్తే
కాంతా కుచాంబురుహ కుట్మల లోల దృష్టే
కల్యాణ నిర్మల గుణాకర దివ్య కీర్తే
శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం
మీనాకృతే కమఠ కోల నృసింహ వర్ణిన్
స్వామిన్ పరశ్వథ తపోధన రామచంద్ర
శేషాంశ రామ యదునందన కల్కి రూప
శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం
ఏలా లవంగ ఘన సార సుగంధి తీర్థం
దివ్యం వియత్ సరితి హేమ ఘటేషు పూర్ణం
ధృత్వాద్య వైదిక శిఖామణయః ప్రహృష్టా ః
తిష్టంతి వేంకటపతే! తవ సుప్రభాతం
భాస్వానుదేతి వికచాని సరోరుహాణి
సంపూరయంతి నినదైః కకుభో విహంగాః
శ్రీ వైష్ణవ స్సతత మర్థిత మంగళాస్తే
ధామాశ్రయంతి తవ వేంకట! సుప్రభాతం
బ్రహ్మాదయ స్సురవర స్సమహర్షయస్తే
సంత స్సనందన ముఖా స్త్వథ యోగి వర్యా ః
ధామాంతికే తవహి మంగళ వస్తు హస్తా ః
శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం
లక్ష్మీ నివాస నిరవద్య గుణైక సింధోః
సంసార సాగర సముత్తరణైక సేతో
వేదాంత వేద్య నిజ వైభవ భక్త భోగ్య
శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం
ఇత్థం వృషాచల పతే రిహ సుప్రభాతం
యే మానవాః ప్రతి దినం పఠితుం ప్రవృత్తా ః
తేషాం ప్రభాత సమయే స్మృతి రంగ భాజాం
ప్రజ్ఞాం పరార్థ సులభాం పరమాం ప్రసూతే!


శ్రీ వేంకటేశ స్తోత్రం

కమలా కుచ చూచుక కుంకుమతో
నియతారుణి తాతుల నీల తనో
కమలాయత లోచన లోకపతే
విజయీ భవ వేంకట శైలపతే

సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ
ప్రముఖాఖిల దైవత మౌళిమణే
శరణాగత వత్సల సార నిధే
పరిపాలయ మాం వృష శైలపతే

అతి వేలతయా తవ దుర్విషహై
రనువేల కృతై రపరాధ శతైః
పరితం త్వరితం వృష శైలపతే
పరయా కృపయా పరిపాహి హరే

అధి వేంకట శైల ముదార మతేర్
జనతాభిమతాధి కదా నర తాత్
పర దేవతయా గదితాన్నిగమైః
కమలా దయితాన్న పరం కలయే

కలవేణు రవా వశ గోప వధూ
శతకోటి వృతాత్ స్మర కోటి సమాత్
ప్రతి వల్లవికాభిమతాత్ సుఖదాత్
వసెదేవ సుతాన్న పరం కలయే

అభిరామ గుణాకర దాశరథే
జగదేక ధనుర్ధర ధీర మతే
రఘునాయక రామ రమేశ విభో
వరదో భవ దేవ దయా జలధే

అవనీ తనయా కమనీయ కరం
రజనీకర చారు ముఖాంబురుహం
రజనీ చర రాజ తమో మిహిరం
మహనీయ మహం రఘు రామ మయే

సుముఖం సుహృదం సులభం సుఖదం
స్వనుజం చ సుకాయ మమోఘ శరం
అపహాయ రఘూద్వహ మన్యమహం
న కథం చ న కంచన జాతు భజే

వినా వేంకటేశం న నాథో న నాథః
సదా వేంకటేశం స్మరామి స్మరామి
హరే వేంకటేశ ప్రసీద ద్రసీద
ప్రియం వేంకటేశం ప్రయచ్ఛ ప్రయచ్ఛ

అహం దూర తస్తే పదాంభోజ యుగ్మ
ప్రణామేచ్ఛయా గత్య సేవాం కరోమి
సకృత్సేవయా నిత్య సేవా ఫలం త్వం
ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వేంకటేశ

అజ్ఞానినా మయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే
క్షమస్వ త్వం క్షమస్వ త్వం శేష శైల శిఖామణే