వ్యాసభగవానుడి పద్దెనిమిధి పురాణాలలో ఒకటి గరుడపురాణం. నరకం గురించి పాపుల శిక్ష గురించి గరుత్మంతుడు అడిగిన ప్రశ్నలకు విష్ణువు చెప్పిన సమాధానాలు ఇందులో ఉన్నాయి. అలాగే చనిపోయాక పాపులు దాటవలసిన వైతరణీ నది గురించి ఉంటుంది. అది నూరు యోజనాల వెడల్పు ఉంటుంది. చీమూ,నెత్తురు ప్రవహిస్తుంటాయి. అందు పాపులు మానవ జన్మలో చేసిన పాపాలను మననం చేసుకుంటూ ఆక్రందనలు చేస్తుంటారు. అంతే కాక మరణానంతర క్రియలు, యమలోక వివరణ, నరకలోకం, బలవన్మరణము, వివిధ దానములు, జనన మరణాదికము, యమలోక బాధలు మొదలైన విషయాలు వివరించబడ్డాయి. అవి చదివితే భయపడడం సహజమే. అందుకే గరుడపురాణం ఇంట్లో పెట్టుకోకూడదు అంటారు. కాని అన్ని పురాణాల్లా దీన్ని కూడా ఇంట్లో ఉంచుకోవచ్చు. ఎవరికైనా ఇవ్వాలంటే హంస ప్రతిమతో కలిపి ఇవ్వాలి.