రామకోటి రాయడానికి నియమాలు
Filed under: ఆధ్యాత్మికం Author: జ్యోతిరామకోటి రాయడానికి పూనుకోవడం ఒక సత్కార్యం. ఈ కార్యానికి కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది.
* రామకోటి రాయాలన్న మీ సంకల్పాన్ని ముందు దేవుడి దగ్గర మానసికంగా సంకల్పం చేసుకోండి.
* శ్రీరామ అని రాసే వీలున్న కోటి గళ్ళు ఉన్నా పుస్తకం తెచ్చుకోండి. లేదా మీరే ఒక తెల్లకాగితాలతో పుస్తకం తయారుచేసుకోండి.
* మంచి రోజు చూసుకుని పుస్తకానికి పసుపు, కుంకుమ రాసి దేవుని సన్నిధిలో ఉంచి పుష్పాలతో, శ్రీ రామ అష్టోత్తరశతనామావళి తో పూజించండి. తరవాత పుస్తకం కళ్ళకద్దుకుని రాయడంప్రారంభించండి.
* రామకోటి రాసేటప్పుడు ఇతర వ్యాపకాలు, ఆలోచనలు పెట్టుకోకుండా స్థితిమితంగా శ్రీరామ అనుకుంటూ మనసును కేంద్రీకరించి రాయండి.
* అనుకోకుండా మంధ్యలో ఏదైనా పని మీద వెళ్ళవలసి వస్తే ఒక సరి సంఖ్యలో రాయడం ఆపి పుస్తకంమూసి నమస్కరించి వెళ్ళండి. పని అయిపోయిన తర్వాత కాళ్ళు , చేతులు కడుక్కొని శుచిగా మళ్ళీ రాయడం మొదలుపెట్టండి.
* రామకోటి రాసే పుస్తకం జాగ్రత్తగా భద్రపరచండి. అందులో ఇతర విషయాలు ఏవీ రాయకూడదు. దానికి ఉపయోగించేకలాన్ని కూడా విడిగా ఉంచుకోవడం శ్రేయస్కరం.
* రామకోటి రాయడానికి ప్రత్యేకమైన సమయం అంటూ ఏదీ లేదు. కాని శుచి, శుభ్రత, పవిత్రత, ప్రశాంతత మాత్రం తప్పక పాటించాలి. ఒకవేళ ఎప్పుడైనా నిద్రవస్తుంది అనుకుంటే బలవంతంగారాయకుండా ఆపేయాలి.
* ప్రతి లక్ష నామాలకు ప్రత్యెక పూజ,నివేదన చేసి ప్రసాదాన్ని పంచాలి.
* రామకోటి రాయడం పూర్తీ అయిన తర్వాత శక్తి అనుసారంగా పూజ,నివేదనలు సమర్పించి ఆరాధన చేయడం మంచిది.
* పూర్తయిన రామకోటి పుస్తకాన్ని పసుపు బట్టలో కట్టి భద్రాచలంలోని రామచంద్రుడికి సమర్పించాలి. లేదా ఏదైనారాముని గుడిలో ,ఆధ్యాత్మిక సంష్తకు అప్పగించాలి. అదీ వీలుకాకుంటే నదిలో వదలాలి.
సుజాత వేల్పూరి
October 21, 2009 at 5:18 PM
ఇలా "కోటి"నామాలు రాసేవారిని కొంతమందిని చూశాను. ఒక పక్క రాస్తూనే మరో పక్క లోకాభిరామాయణం అంతా మాట్లాడుతూ ఉంటారు. మా వూళ్ళో ఒక షావుకారుండేవాడు. అన్నానికి లేక ఏడుస్తున్నవారి దగ్గర కూడా వడ్డీ పైసా తగ్గించకుండా తోలు వల్చి వసూలు చేస్తూ కొట్లో కూచుని రామకోటి మాత్రం రాస్తుండేవాడు. ఇది అతన్ని రక్షిస్తుందా? శ్రీరామ చంద్రుడు అతన్ని చేరతీస్తాడా?
టైము ఎక్కువ ఉంటే దాన్ని మరో రకంగా భవద్భక్తులు లోకోపచారానికి వినియోగిస్తే మంచిదనిపిస్తుంది నాకు ఈ కోటి నామాలు రాయడం కంటే!తిండి లేక మరణించే దశలో అనేక గోవులు ఏడుస్తున్నాయి. ఈ పుస్తకాల ఖర్చుతో వాటికింత దాణా ఏర్పాటు చేస్తే ఎన్నో జీవులను కాపాడినవారవుతారు.
ఇది నా వ్యక్తిగతాభిప్రాయం!
Icanoclast
October 21, 2009 at 6:29 PM
ఇవన్నీ compensations అనుకుంటా. ఎలాగూ రాముడు చూపించిన మార్గంలో నడవడం క(న)ష్టం కాబట్టి ఇలాంటి relative గా సులభమైన భక్తిప్రకటిత కార్యక్రమాలు చేపట్టి తమ egoని తృప్తి పరచుకోవచ్చు. కానీ ఇదెంతలా పాకి పోయిందంటే సత్సాధకులు కూడా పనులు మానుకొని ఈ పనులు నెత్తికి చుట్టుకొనే వరకూ.... anyhow అది వాళ్ళ ఆత్మ సంతృప్తికి సంబంధించిన విషయం.
ఈ రామకోటి సాంప్రదాయపు పుట్టుపూర్వోత్తరాలు తెలిసినవారెవరైనా చెప్పగలరా?