భక్తీ మార్గము - ముక్తి మార్గము -3
Filed under: బ్రహ్మంగారి కాలజ్ఞానం Author: జ్యోతి
దైవ ధ్యానముకన్న మించినది లేదయా
అనంత శక్తులు అందులో ఉన్నాయి
అష్ట కష్టంబులకు,కఠిన రోగంబులకు
దివ్యౌశాధంబని నమ్మండయ!
దైవ స్వరూపుడవు నీవేనురా
కోర్కెలతో మనిషివి పోయావురా
కొరగాని కోర్కెలను కట్టి పెట్టిన నీవు
కోదండ రాముడి వెలిసేవురా !
ఈత తెల్సిసినఎదల నీరేమి చేయును
తెలియకున్నా మునిగి సచ్చేరయ
బ్రహ్మవిద్యను ఈత నేర్వనట్టివారు
సంసారమున మునిగి సచ్చేరయ !
అన్యాయమును జేసి ఆత్జించిన డబ్బు
కొద్దికాలమువరకు వుందేనయ
చేసిన మోసాలు చెడు కీర్తి యిలలోన
శాశ్వతంబుగా నిలిచి పోయేనయ !
వల్లకాటికి పోవు ఒళ్ళు వస్త్రాలను
బహు శుచిగా కాపాడుకొనియెరయ
తమ వెంట వచ్చేది మనస్సు బుద్ధనుమాట
యోచింపకుండానే బ్రతికేరయ !
ఆకలి తీరని ఆశాపిశాచిని
నమ్మినా నిను మ్రింగిపోయేనురా
ఆశకు దాసుడు అందరికి దాసుడే
ఆశ లేనివాడే మహానీయుడురా !
పరిమిత ప్రజ్ఞగల అల్ప మనస్సునకు
దైవ రహస్యములు అర్ధమే కావయ
తన్ను తానూ వశము చేసుకోగలిగితే
సర్వమును తెలియును నమ్మండయా !
అనంతమైనట్టి నిఘూఢమైనట్టి
సృష్టి రహస్యములు తెలిసింది యెవరయ
సృష్టినే తెలియక సృష్టికర్త నువాడు
లేడనుచు సులువుగా చెప్పెరయ !
సకల సంపదలుండి సరి లేని భార్యున్న
అంతకన్నా నరకమేముందిరా
ఆలి మంచిది యైన ఆస్తులెందుకు నీకు
అంతకన్నా స్వర్గ మేముందిరా !
ఆస్థి పాస్తుల కొరకు ఆలుబిడ్డల కొరకు
యేడ్చేటి, అజ్ఞానులున్నారయ
దైవంబు తలుచుకుని యేడ్చేటి జ్ఞానులు
ధన్యులై నరకంబు దాటేరయ !
స్త్రీలు పూజింపబడు దేశమే దేశము
దేవతలు సంతుష్టి చెందేరయ
శీలమును కాపాడు స్త్రీలున్న దేశమే
మహాలక్ష్మి నిలయమని తెలియండయా !
పూర్వ జన్మములోన చేసిన పాపాలే
రోగమై పీడించు ఈ జన్మలో
అనుభవించనులేక అన్ని సంపదలుండు
యింత కన్నా శిక్ష యేముందిరా !
అనంత శక్తులు అందులో ఉన్నాయి
అష్ట కష్టంబులకు,కఠిన రోగంబులకు
దివ్యౌశాధంబని నమ్మండయ!
దైవ స్వరూపుడవు నీవేనురా
కోర్కెలతో మనిషివి పోయావురా
కొరగాని కోర్కెలను కట్టి పెట్టిన నీవు
కోదండ రాముడి వెలిసేవురా !
ఈత తెల్సిసినఎదల నీరేమి చేయును
తెలియకున్నా మునిగి సచ్చేరయ
బ్రహ్మవిద్యను ఈత నేర్వనట్టివారు
సంసారమున మునిగి సచ్చేరయ !
అన్యాయమును జేసి ఆత్జించిన డబ్బు
కొద్దికాలమువరకు వుందేనయ
చేసిన మోసాలు చెడు కీర్తి యిలలోన
శాశ్వతంబుగా నిలిచి పోయేనయ !
వల్లకాటికి పోవు ఒళ్ళు వస్త్రాలను
బహు శుచిగా కాపాడుకొనియెరయ
తమ వెంట వచ్చేది మనస్సు బుద్ధనుమాట
యోచింపకుండానే బ్రతికేరయ !
ఆకలి తీరని ఆశాపిశాచిని
నమ్మినా నిను మ్రింగిపోయేనురా
ఆశకు దాసుడు అందరికి దాసుడే
ఆశ లేనివాడే మహానీయుడురా !
పరిమిత ప్రజ్ఞగల అల్ప మనస్సునకు
దైవ రహస్యములు అర్ధమే కావయ
తన్ను తానూ వశము చేసుకోగలిగితే
సర్వమును తెలియును నమ్మండయా !
అనంతమైనట్టి నిఘూఢమైనట్టి
సృష్టి రహస్యములు తెలిసింది యెవరయ
సృష్టినే తెలియక సృష్టికర్త నువాడు
లేడనుచు సులువుగా చెప్పెరయ !
సకల సంపదలుండి సరి లేని భార్యున్న
అంతకన్నా నరకమేముందిరా
ఆలి మంచిది యైన ఆస్తులెందుకు నీకు
అంతకన్నా స్వర్గ మేముందిరా !
ఆస్థి పాస్తుల కొరకు ఆలుబిడ్డల కొరకు
యేడ్చేటి, అజ్ఞానులున్నారయ
దైవంబు తలుచుకుని యేడ్చేటి జ్ఞానులు
ధన్యులై నరకంబు దాటేరయ !
స్త్రీలు పూజింపబడు దేశమే దేశము
దేవతలు సంతుష్టి చెందేరయ
శీలమును కాపాడు స్త్రీలున్న దేశమే
మహాలక్ష్మి నిలయమని తెలియండయా !
పూర్వ జన్మములోన చేసిన పాపాలే
రోగమై పీడించు ఈ జన్మలో
అనుభవించనులేక అన్ని సంపదలుండు
యింత కన్నా శిక్ష యేముందిరా !
No response to "భక్తీ మార్గము - ముక్తి మార్గము -3"
Post a Comment