వృశ్చిక రాశి
Filed under: రాశి ఫలాలు Author: జ్యోతివిశాఖ 4 వ పాదం, అనూరాధ 1, 2, 3 పాదాలు, జ్యేష్ట 1, 2, 3 పాదాలు
ఆదాయం: 2, వ్యయం: 8, రాజపూజ్యం:1, అవమానం: 2
ఈ రాశివారికి మే 1 వరకు తృతీయమునందు గురువు, ఆ తదుపరి చతుర్ధమునందు, జులై 30 నుంచి తృతీయమునందు, డిశంబరు 19 నుంచి చతుర్ధమునందు, ఈ సంవత్సరము నవంబరు 15 వరకు తృతీయమునందు రాహువు, భాగ్యమునందు కేతువు, ఆ తదుపరి అంతా ద్వితీయమునందు రాహువు, అష్టమమునందు కేతువు. ఈ సంవత్సరము సెప్టెంబరు 9 వరకు రాజ్యమునందు శని, ఆ తదుపరి అంతా లాభమునందు సంచరిస్తాడు.
ఈ సంవత్సరము ' సిరిదా పోయిన పోవును ' .ఖర్చులు బాగా అధికంగా అవడం వల్ల ఆందోళనకు గురి అవుతారు. మీరు శ్రీరామ అన్నా అపార్ధంగా భావించేవారు ఎక్కువవుతారు. ప్రేమికులకు ఆవగాహన లోపం, ఆరోగ్యంలో జాగ్రత్త వహించండి. విధ్యార్థులకు మొదటి భాగంలో జయం చేకూరగలదు. నరాలు, ఎముకలు, మెదడుకు సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు. కుటుంబీకుల విషయంలో సంతృప్తి కానరాదు. కోర్టు వ్యవహారాలను వాయిదా వేయడం మంచిది. ఇతరుల కారణంగా మీ కార్యక్రమాలలో అంతరాయం ఏర్పడగలదు. ఉపాధ్యాయులకు మతిమరపు పెరగడం వల్ల ఆందోళనకు గురి అవుతారు. తొందరపడి వాగ్ధానాలు చేయడం వల్ల సమస్యలు ఎదుర్కొనక తప్పదు. మీ విరోధులు చేసే పధకాలు మీకు ఆందోళన కలిగిస్తాయి. అయితే చివరికి జయం మిమ్మల్నే వరిస్తుంది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించండి. అధికారులతో సంభాషించేటప్పుడు మెళకువ వహించండి. ప్రయివేటు సంస్థలలో వారు మార్పులకై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వాణిజ్య రంగాలలో వారు ఇన్‌కంటాక్స్ వంటి సమస్యలు ఎదుర్కొనక తప్పదు. పారిశ్రామిక రంగాలలో వారికి నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. నిరుద్యోగులకు సత్కాలం అని చెప్పవచ్చు. దూర ప్రయాణాలకై చేయు ప్రయత్నాలు అనుకూలించగలవు. లాయర్లకు పురోభివృద్ధి, వైద్యులకు ఒడిదుడుకులు, ఆడిటర్లకు అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు. స్పెక్యులేషన్ చేయువారు మెళకువ పాటించండి. మీ వ్యక్తిగత విషయాలను బయటకు తెలియపరచుట మంచిది కాదు. ఉత్తర, ప్రత్యుత్తరాలు సంతృప్తి నిస్తాయి. ఊహించని ఖర్చులు మీ అంచనాలను దాటటం వల్ల ఆందోళన పడతారని చెప్పవచ్చు.
ఈ రాశివారు గజలక్ష్మి అమ్మవారిని, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేసిన శుభం, జయం చేకూరుతుంది. నవంబర్ నుండి కుటుంబ స్థానమునందు రాహు సంచారం వల్ల అష్టమ స్థానమునందుకేతు సంచారము వల్ల రాహు, కేతువుల పూజ చేయించిన కుటుంబ సౌఖ్యం అభివృద్ధి కానవ్స్తుంది. విశాఖ నక్షత్రం వారు వైక్రాంతమణి, అనూరాధ నక్షత్రం వారు పుష్యనీలం, జ్యేష్టా నక్షత్రంవారు గరుడ పచ్చ ధరించిన అభివృద్ధి కానవస్తుంది.
SADASIVARAO
March 7, 2010 at 3:59 PM