ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు

ఆదాయం: 14, వ్యయం: 11, రాజపూజ్యం: 2, అవమానం:6

ఈ రాశివారికి మే 1 వరకు పంచమమునందు బృహస్పతి, ఆ తదుపరి షష్టమమునందు జులై 30 వరకు, ఆ తదుపరి పంచమమునందు, డిశంబరు 9 నుంచి షష్టమమునందు, నవంబరు 15 వరకు పంచమమునందు రాహువు, లాభమునందు కేతువు, ఆ తదుపరి అంతా చతుర్ధమునందు రాహువు, లాభమునందు కేతువు, ఈ సంవత్సరము సెప్టెంబరు 9 వరకు వ్యయమునందు శని, ఆ తదుపరి అంతా జన్మమునందు సంచరిస్తాడు.

ఈ సంవత్సరము ' భాగ్యం ఫలతి సర్వత్ర ' అన్నట్లుగా ఆర్ధిక విషయాలలో ఒకడుగు ముందుకు వెళతారు. ఈ సంవత్సరం మీ గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అన్ని విషయాలలో శుభం, లాభం చేకూరతాయి. బద్ధకం వదిలి అధిక కృషి చేసిన లాభం పొందగలుగుతారు. వాణిజ్య ఒప్పందాలకు శ్రీకారం చుట్టండి. మీ సహాయం పొందిన వారు మిమ్మల్ని తక్కువ అంచనా వేసినా ఆశ్చర్యపడనక్కరలేదు. ఉద్యోగస్థులకు అధిక శ్రమ, చికాకు తప్పకపోయినా గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఎరువులు, కిరాణా, ఫ్యాన్సీ రంగాలలో వారికి కలిసి వచ్చే కాలం, ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఈ రాశివారికి ఏలినాటి శని దోషం ఉన్నా శని మీకు హానికారి కాదు. పౌరోహితులకు, వృత్తులలో వారికి ఒత్తిడి పెరుగుతుంది. ఇవాల్టి పనులు రేపటికి వాయిదా వేయక చేపట్టిన పనిలో జయం పొందండి. అంతరంగిక సమస్యలకు పరిష్కార మార్గం కానరాగలదు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలలో వారికి కలిసి వచ్చే కాలం, శుభకార్యాలకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. స్త్రీలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఊహించిన చికాకులు తలెత్తిన తెలివితో పరిష్కరిస్తారు. ఖాదీ, కలంకారీ రంగాలలో వారికి లాభదాయకం, వ్యాపారస్థులకు ఇన్‌కమ్ టాక్స్ వారి నుండి ఒత్తిడులు ఏర్పడతాయి. వైద్య, ఇంజనీరింగ్ రంగాలలో వారికి అనుకూలత, అనవసరపు వాగ్ధానాలు చేసి సమస్యలు కొని తెచ్చుకోకండి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి జయం పొందండి. మీ సమస్యలకు తగిన పరిష్కారం లభిస్తుంది. ఎక్స్ పోర్ట్ వ్యాపారస్థులకు లాభదాయకం. పెద్దలతో ఆవగాహన లోపం, అందరితో కలిసి విందులు, వినోదాలలో పాల్గొంటారు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడడం మంచిది. ముఖ్యుల సలహాని పాటించండి. ఋణ ప్రయత్నం ఫలిస్తుంది.

ఆరోగ్యం బాగుపడేందుకు, అన్ని విధాలా కలిసి వచ్చేందుకు 3 నెలలలకు ఒకసారి శనికి తైలాభిషేకం చేయించండి. శ్రీమన్నారాయణుడిని ఆరాధించడం వల్ల శుభం చేకూరుతుంది. ఉత్తర నక్షత్రంవారు కెంపు, హస్త నక్షత్రంవారు స్పందన ముత్యం, చిత్త నక్షత్రంవారు జాతి పగడం ధరించిన శుభం కలుగుతుంది.