కాలజ్ఞానం - 2
Filed under: బ్రహ్మంగారి కాలజ్ఞానం Author: జ్యోతిసముద్రాలు పొంగేట్టు గాలులే కదిలేట్టు
చేసే మహా శక్టి మనిషిలో ను ఉంది
నీలోని శక్తిని భక్తితో ధ్యానింప
ఆదైవ దర్శనము కలిగేనయా!
ఎన్ని విద్యలు నేర్చి ఎంత చదివినగాని
ప్రతిక్షణం చావుతో పోట్లాటయా
చావులేని చదువు నేర్వంగ జాలరు
ఇది యేమి కర్మమో తెలియండయా!
దానంబు చేయకే దరిద్రులయ్యేరు
దైవమును నిందింప ఫలమేమయ
పదుగురికి ధర్మంబు చేసిన పుణ్యమే
జన్మ జన్మకువెంట వచ్చేనయా!
మీరేది చల్లెదరో అదియే పండును గాని
లేని దానికి ఏల యేడ్చేరయా
కర్మలకు దేవునికి సంబంధమే లేదు
ప్రకృతియే దీనికి మూలంబయా!
ఆత్మలో న మార్పు కలిగినప్పుడేగాని
తత్వంబు మారునని తెలియండయా
వేషభాషలు పెంచి వేయి విద్యలు
నేర్వ వెతలెట్లు పోవునో తెలియండయా
మతముల పేరిట మత్సరంబులు పెరిగి
మదియించి కొట్టుకొని సచ్చేరయా
మనువు వంశము నుండి మనుషులందరు పుట్టు
మతం లెన్నుండునో తెలియండయా!
రాముడైనా నేనె కృష్ణుడైనా నేనె
సర్వంబు నేనని తెలియండయా
వాద భేదములేల శ్రీ వెంకటేశుడై
ధరణిలో వెలసినది నేనేనయా !
అంతటి కృష్ణుడు అండగాయుండియూ
పాండవులు పడరాని కష్టాలు పడ్డారయా
రాజాది రాజులే భిక్షమెత్తారు దైవలీలలు
కనగ యెవ్వరికి తరమౌను !
నన్ను తలచిన యెడల నా దర్శనంబిత్తు
సత్యంబు నా మాట నమ్మండయా
మాయ శక్తులు చేయు ప్రళయంబులెన్నైన
మ్మిమంటబొవని తెలియండయా!
నన్ను తలచిన వారు నా మాయ యటంచు
ఐశ్వర్యవంతులుగా నుండేరయా
యెట్టి ఆపదలైన యెన్ని కష్టములైన
నేనుండి తొలగింతు నమ్మండయా!
మనిషికి తెలియని మర్మమేది లేదు
తానెవరో మాత్రము తెలియలేదు
బయటి విషయముల తెలియు తననుండి తెలియదు
తన్ను తానెరుగుటకు తీరికేయుండదు!
సూర్యుని తేజస్సు క్రమముగా తగ్గెను
జీవరాశులు ఎన్నో నశియించి పోయేను
శాస్త్రవేత్తలకది గోచరము కాకుండ
దైవమే గతియని ప్రార్ధనలు జేసేరు.
Rajendra Devarapalli
September 5, 2008 at 10:50 PM
చిలమకూరు విజయమోహన్
September 6, 2008 at 6:21 AM
సుజాత వేల్పూరి
September 6, 2008 at 7:27 AM
మొత్తం కాలజ్ఞానాన్ని భాగాలు గా ప్రచురించ గలరా? బ్లాగర్ల కోసం?
జ్యోతి
September 6, 2008 at 12:25 PM
తప్పకుండా రాస్తాను క్రమం తప్పకుండా..
Bolloju Baba
September 6, 2008 at 1:42 PM
మంచి ప్రయత్నం
మీకు దైవం మంచి సంకల్పాన్నిచ్చాడు.
అభినందనలు
బొల్లోజు బాబా
durgeswara
September 6, 2008 at 8:13 PM