ధర్మసందేహాలు
Filed under: పురాణ విజ్ఞానం Author: జ్యోతి
దశరథుడు శ్రీరాముని అరణ్యానికి వెళ్ళమంటే సీత కూడా వెంట వెళ్ళినది కదా! లక్ష్మణుని వెంట ఊర్మిళ ఎందుకు వెళ్ళలేదు?
వెళ్ళవలసినవాడు శ్రీరాముడు.సేవార్ధమై వెళ్ళినవాడు లక్ష్మణుడు. సీతకు రాముని అనుజ్ఞ చాలుకాని లక్ష్మణునికి అరణ్యానికి వెళ్ళడానికి ఆజ్ఞయే కష్టమైనది. కాక సేవించడానికి వెళ్ళే లక్ష్మణుని వెంట ఊర్మిళ వెళ్ళడం అప్రస్తుతం.
భారతంలో శ్రీకృష్ణుడు గోపికల వస్త్రాలు అపహరించాడు. దుశ్శాసనుడు భారతంలొ వస్త్రాపహరణం చేశాడు. శ్రీకృష్ణుడు భగవంతుడెలా అయ్యాడు? దుశ్శాసనుడు దుర్మార్గుడెలా అయ్యాడు?
ఈ రెండింటికి సంబంధం లేదు. తనను కోరి సంకీర్తించి, తపించు గోపకన్యల దేహాభిమానం తొలగించి, అహంకారాన్ని తీసివేసి అనుగ్రహించటం శ్రీకృష్ణుడు చేసి వస్త్రాపహరణం. వారే నిత్యానందాన్ని పొంది పరమేశ్వరుని సేవించారు. దుష్ట, చతుష్టయ క్రౌర్యంతో ప్రణాళికాపూర్వకంగా ఒక కులస్త్రీని, అన్న భార్యను,, ఏకవస్త్రను సభారంగంలో పరాభవించడం దుర్మార్గం కదా!
శ్రీరాముని వంటివారు భార్యను అనుమానిస్తే అది చదివిన సామాన్యుని స్థితి ఏమిటి?
శ్రీరాముడు భార్యను అనుమానించాడని, నమ్మకం లేనివాడని తెలుసుకుంటూ రామయణం చదువుతుంటే అది ఏమీ ఫలమివ్వదు. కాన అర్ధగ్రంథాలు సందేహాలు పోయేటట్లు చదివి, లేదా తెలుసుకోవాలి. శ్రీరామునికి భార్యయందు సంశయం లేదు. రాజధర్మము యొక్క కాఠిన్యం చూపించాడు. కాబట్టే అశ్వమేధంలొ సీత ప్రతిమనే పెట్టుకొన్నాడు.
శివుని లింగ రూపంలో ఎందుకు పూజిస్తున్నారు? ఆకారంలో పూజింపకూడదా?
శివునికి రెండు రూపాలు చెప్పింది శివ పురాణం. నిర్గుణం, సగుణం... నిర్గుణ రూపమే లింగం. సగుణరూపం పంచముఖం, అభిషేకం శివునికి ప్రశస్తం గాన నిర్గుణమైన లింగాన్ని పూజించుటయే శ్రేష్టం. సగుణమైన సాకారం ధ్యానించుటలో ముఖ్యం.
కామదాహం అధికంగా గల ఇంద్రుడు సజ్జనులైన దేవతలకు ప్రభువెలా అయ్యాడు? ఇంద్రుడు పదవి పేరా? వ్యక్తి పేరా?
ఇంద్ర పదవి కొంత పుణ్యంతో సంపాదించే మహోన్నత స్థానం. అది ఒక పదవి పేరు. అంత పరమస్థానం పొందినా తప్పులు చేయటం ఉపాధి లక్ష్మణం అని, ఎంతవారు చేసినా తప్పునకు శిక్ష తప్పదనీ ఆ కథలు చెప్తున్నాయి.
మల్లాది చంద్రశేఖరశాస్త్రి

Anonymous
August 27, 2008 at 4:02 PM
RG
August 27, 2008 at 7:16 PM
మరైతే అష్టదిక్పాలకుల్లో ఇంద్రుడూ ఒకడు కదా, మరి వరుణుడూ, అగ్నీ, యముడూ ఈ పేర్లు కూడా పదవులేనా? మరి వాటిగురించి ఎక్కడా కనిపించదెందుకు? ఒకవేళ మిగతా దిక్పాలకులు పదవులుకాక వ్యక్తులే అయితే, కేవలం ఇంద్రపదవి మాత్రమే Open-to-contestation ఆ??
ఇవి సందేహాలు మాత్రమే, నేనేదో వితండవాదం చేస్తున్నాననుకోవద్దు ప్లీజ్ !!!
Kathi Mahesh Kumar
August 27, 2008 at 9:34 PM
2.మొదటిది అంగీకారపూర్వకమైన సరసం. రెండవది బలాత్కారం. ఇందులో ఏడౌటూ లేదు.కాకపోతే ఇప్పుడు ఏదిచేసినా శ్రీకృష్ణ జన్మస్థానమే!
3.రాముడు అనుమానించినా లేక కేవలం రాజ్యధర్మాన్ని పాటించినా అడవిపాలయ్యింది సీతేకదా! అయినా ఇది ఏపాటి రాజ్యధర్మం? ప్రజలలో ఒక్కడు చెప్పినంతమాత్రానా ‘రాణి’ని ‘రాజు’ త్యజించే రాజధర్మం నిజంగా వుందంటారా?
4.శివలింగాన్ని ఆడామగా కలయికకు చిహ్నంగా భావిస్తే తప్పుందా? ప్రకృతి శక్తిల్ని పూజించేనాటినుండీ వున్న పశుపతినాధుడ్ని లింగాకారంలో,తన పీఠాన్ని యోని రూపంలో మానవజన్మ రహస్యాన్ని పూజ్యనీయం చేసేలా భావిస్తారనుకొంటే అభ్యంతరముందా?
5.ఇంద్రపదవి "కొంతపుణ్యంతొ" సంపాదించేదయితే, "సజ్జనులైన" దేవతల బదులు స్త్రీలోలుడైన ఇంద్రుడికెందుకు దక్కింది? ఇంద్రుడనుభవించిన కష్టాలేమిటి? ఎప్పుడు కష్టాలలోవున్నా,త్రిమూర్తులు ఎప్పుడూ కాపాడ్డానికి వచ్చేసేవారుగా!!!
Anonymous
August 28, 2008 at 12:02 AM
1. అడవుల్లో నక్సలైట్లని పలకరించడానికి వెళ్ళే గ్రే హౌండ్సు పెళ్ళాల్ని ఎందుకు వెంటేసుకుని వెళ్ళకూడదు?
3. సీపీఐ నారాయణగారు గాంధీ జయంతి నాడు చికెన్ తిన్నాడు. ఎవడో పత్రిక వాడు ఏదో కూశాడని ఒక యేడాది పాటు ఆయన చికెన్ తినడం మానేశాడు. ఎవళ్ళని ఉద్ధరించడానికిట? ఆయనవల్ల regular గా ఆయన చికెన్ కొనుక్కునే కొట్టువాడికి నష్టం రాలేదూ? ఇదేం రాజధర్మం??
4. ఎంతమాత్రమూ తప్పు లేదు. శివలింగం మీద వేసే ఆకుల్ని కూడా మీరు ఏవో అనుకుని భావించుకుని ఆనందపడినా ఎవళ్ళకీ వచ్చిన నష్టం లేదు. మీ మనసులో ఉన్నది అదే అయితే ఎవడు తప్పనగలడు? నీకది ఇష్టమైతే ఎవడిక్కావాలి?
5. మనల్ని పాలించే రాజకీయ నాయకులు స్త్రీ లోలురైతే నీకు వచ్చే నష్టం ఏమిటి? వాళ్లకి అక్కర్లేదనే నీతి ఇంద్రుడికి లేదని అంత బాధ పడిపోతున్నావు ఎందుకు? రాజకీయ నాయకులు ప్రజలకి సేవ చేయడం, వాళ్ళ నమ్మకం సంపాదించుకోవడం అన్న పుణ్యాన్ని బట్టే కదా వాళ్ళకి పదవి వచ్చింది? వాళ్లమీద నక్సలైట్లు దాడి చేస్తే పోలీస్ ప్రొటెక్షన్ ఎందుకు? మరి అటువంటి ప్రొటెక్షన్ ఇంద్రుడికి ఎవరో ఇస్తే నీకేంటి బాధ?
రవి
August 29, 2008 at 9:59 PM
సీత రాముని రాజ్యంలో పౌరురాలే కదా? ఓ పౌరురాలిగా ఆమెకే న్యాయం జరిగింది? బయట ఎవరో ఏదో అన్నారని, తన రాజ్యంలో ఓ పౌరురాలిని, ఆ తరువాత తన భార్యను, అందునా గర్భిణీ స్త్రీ ని, అదీ ఓ సారి అగ్ని పరీక్షలో పాల్గొని తన 'స్వచ్చత ' (నాకు ఈ పదం వాడ్డమే ఇబ్బంది గా ఉంది) ను నిరూపించుకున్న మహిళను అడవులకు పంపడం మానవతా కారణాల దృష్ట్యా నాకు సబబుగా కనిపించలేదు. రాముడు ఆ కాలపు విలువల దృష్ట్యా గొప్ప వాడవచ్చు, కానీ ఓ బుద్ధుడు, జీసస్, వీరిలా మహనీయుడు కాడు. ఓ సారి సీత స్థానంలో తమ అక్కనో, అమ్మనో ఊహించుకుంటే, గుండె భగ్గుమంటుంది.
కామేశ్వరరావు
August 29, 2008 at 11:43 PM
మన పురాణాలలో ఉన్న విషయాలన్నిటినీ ఇప్పుడు మనం త్రాసులో తూచడం అవివేకం అని నేననుకొంటాను. అలానే వాటిలో విషయాలని మొత్తం నెత్తికెత్తుకోవడమూ, పూర్తిగా నిరసించడమూ రెండూ నిరుపయోగం ఒకోసారి హానికరం కూడానూ. రాముడు సీతకి అగ్నిపరీక్ష పెట్టడం కానీ అడవులకి పంపించడం కానీ ధర్మమేనా కాదా అన్న ప్రశ్న అనవసరం.
రాముడు సీతని అనుమానించి అడవికి పంపించాడు కాబట్టి అతన్ని ఆదర్శంగా తీసుకొని నేనూ మా ఆవిడని అనుమానించి వదిలేస్తాననడం బుద్ధిలేనివాళ్ళు అనే మాటా, చేసే పని. అలాంటి వాళ్ళకి, "లేదు రాముడు ఫలానా పరిస్థితుల్లో అలా చేసా"డంటూ వివరించబూనడం అంతకన్నా బుఱ్ఱలేని పని. ఆ చెంపా ఈ చెంపా బాగా వాయించి (సదరు భార్యే) "ఓరేయ్! నువ్వంటున్నది బుఱ్ఱతక్కువ మాట. మరో సారి ఆలోచించుకో" అని వార్ణింగివ్వడమో, వినకపోతే చట్టాన్ని ఆశ్రయించడమో చెయ్యడం ఉత్తమం.
అలానే రాముడలా చెయ్యడం దుర్మార్గం దాన్ని మనమిప్పుడు తీవ్రంగా ఖండించాలి, అతన్ని దేవుడని ఎలా అంటాం, అసలతను మనిషేనా ఇత్యాదిగా దండెత్తడం కూడా బుద్ధితక్కువ పనే. ఇప్పుడు మన కళ్ళముందు ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే ఏవీ చెయ్యలేక ఎప్పుడో పురాణాల్లోని రాముణ్ణి నిందిస్తే ఏవిటి ఖండిస్తే ఏవిటి?
ఒక్క మంచి పని మాత్రం చెయ్యవచ్చు. రాముడు చేసిన పనికి వెనక అసలు కారణం ఒక రాజుగా తన కర్తవ్యానికి కట్టుబడడం అని భావించవచ్చు. అధికార నిర్వహణలో స్వలాభేక్షమాని కర్తవ్య దీక్ష వహించాలి అన్న మంచిని గ్రహించవచ్చు. దాన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని ఆచరించవచ్చు. అలా ఆచరించక స్వార్థపరులైన వాళ్ళని నిలదీసే శక్తిని తెచ్చుకోవచ్చు.
పురాణాల్లోనే కాదు, దేనిలోనైనా మంచిని గ్రహించగలగడం ఉత్తమం. అందులో చెడుని(ఇప్పటి కాలం దృష్ట్యా) ఆదర్శంగా తీసుకొని దుర్మార్గంగా ప్రవర్తించే వాళ్ళని ఎండగట్టాలి. అంతేకాని పురాణాలని ఎండగట్టి ప్రయోజనం ఏముంది? అందులో కనిపించే చెడుని ఏదో రకంగా సమర్ధించి ప్రయోజనం ఏముంది?
పైని అనానిమస్సు వ్యాఖ్య నాకు అభ్యంతరకరంగా అసభ్యంగా అనిపిస్తోంది. దాన్ని తొలగిస్తే మంచిది.
Anonymous
August 30, 2008 at 8:29 AM
మీరు చెప్పినట్టు మంచిని మాత్రమే గ్రహించాలి. ఎందుకంటే, మిగిలిన వాటిని గురించి మాట్లాడి ప్రయోజనం లేదు కాబట్టి. అయితే, ఈ 'మంచి 'ని గ్రహించడం వెనుక మన దృష్టి 'మంచి ' ని గ్రహించడం అనే సదాశయమా, లేదూ, రాముడు దేవుడు కాబట్టి తనని ఏమన్నా తప్పు, పాపం వస్తుంది, అందుకే తనలో మంచిని గ్రహిస్తాను అనడం మన పాక్షిక దృష్టి ని సూచిస్తుంది. ఇలాంటి విషయాలపై రియాక్షన్ ఎంత అనసరమో, 'గౌరవం ' (రామాయణం హిందూ సంస్కృతి లో భాగం కాబట్టి) కూడా అంతే అనవసరం అని నేను అనుకుంటున్నాను.
కామేశ్వరరావు
August 30, 2008 at 10:50 AM
Kathi Mahesh Kumar
September 5, 2008 at 10:13 PM
కొత్త పాళీ
September 6, 2008 at 3:42 AM
రవి గారికి ఒక సూచన. రామాయణ కావ్యాన్ని (నేపథ్యాన్నీ, పాత్రల్నీ, సంఘటనల్నీ) భక్తి గౌరవం అన్న ప్రస్తావనే ళేకుండా పూర్తిగా మార్క్సిస్టు గతితార్కిక భౌతిక వాద దృష్టితో విశ్లేషించిన రామాయణ విషవృక్షం చదవొచ్చు, మీకు ఓపికా టైమూ ఉంటే. చదవాల్సిన పుస్తకమే. మీ సందేహాలేమైనా నివృత్తి అవుతాయేమో! అందులో ఐనా సీతని అడవికి పంపడం ఉండదు, అది ఉత్తరరామాయణం. కానీ మిగతా ధర్మ సందేహాలన్నీ ఉన్నాయి.
రాముడు ఒక ఆదర్శ పురుషుడు. ఎటొచ్చీ ఆయన ఎందుకు ఆదర్శపురుషుడైనాడు అని రామాయణ కావ్యం చెప్పే సంఘటనలు మనకిప్పుడు రుచించవు. అంచేత ఆ ఋజువుల్ని బట్టి ఆయన నాకు ఆదర్శం కాదు అనుకోవచ్చు, లేదా ఆదర్శం అనేదే ఒక ప్రతీక అని అంగీకరించ వచ్చు.
భగవంతునిగా పూజింపబడే రాముడు ఇలాగే ఇంకో ప్రతీక.