మేష రాశి ఫలితములు ...
Filed under: రాశి ఫలాలు Author: జ్యోతిఅశ్వని 1, 2, 3, 4 పాదములు, భరణి 1,2,3,4 పాదములు, కృత్తిక 1 వ పాదముల యందు జన్మించిన వారు
ఆదాయం - 14 , వ్యయం -2 , గౌరవం - 4, అగౌరవం - 5 .
ఈ రాశి వారికి ఈ సంవత్స్రరం ఎక్కువగా అనుకూల ఫలితాలు సూచిస్తున్నాయి. పంచమ స్థానంలో ఉన్న శని, నవమ,దశమ స్థానాలలో సంచరించు గురువు, రాహుకేతువుల సంచారం ప్రధాన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా నూతన అవకాశాలు కలిసి వస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు విదేశీ యానం ముఖ్యమైన కొనుగోళ్ళ అమ్మకాలు, కలిసి వచ్చే పరిస్థితి సంభవం. సంతాన విషయంలో కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమంది స్నేహితులను, బంధువులను దూరంగా ఉంచుతారు, కొంతమంది వ్యక్తులతో కలవడం ఇష్టం లేక కొన్ని ప్రయోజనాలను కూడా వదులుకుంటారు. పోటీ పరీక్షలలొ విజయం సాధిస్తారు. అయితే మీరు ఆశించిన స్థానం రావడానికి కొంత సమయం పడుతుంది. మీ ద్వారా సహాయం పొంది ఉన్నత స్థానాలలో ఉన్నవారు కీలక సమయంలో నిరాశకు గురి చేస్తారు. చేతిలో ఉన్న సహాయం కూడా చేయరు. కోర్టు వ్యవహారాలు, వివాదంలో ఉన్న భూమి సంబంధమైన వ్యవహారాలు మే తదుపరి మీకు అనుకూలంగా మలుపు తిరుగుతాయి. కోర్టు తీర్పుపై అప్పీలు కోరడం వల్ల కొంత ఉపశమనం లభిస్తుంది. కారణం లేని తగాదాలు కొంతకాలం చికాకు కలిగిస్తాయి. అవసరమైన సమయంలో విదేశాలలో ఉన్న మీవారి ద్వారా సహాయ సహకారాలు అందుతాయి.. వాహనాలు నడిపేటప్పుడు తగు జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. రవి చంద్రులకు గ్రహణాలు, గురుశుక్రులకు మౌడ్యమి సంప్రాప్తించినప్పుడు ప్రతికూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కనుక ఆయా సమయాలలో తగిన శాంతి క్రతువులు, జాగ్రత్తలు పాటించడం చెప్పదగిన సూచన. మహోన్నతమైన ఆశయాలు కలిగిన వ్యక్తులతో కలిసి పనిచేస్తారు. సమాజంలో ఉన్నత స్థానాలలో ఉన్నవారికి మీరు అంతరంగికులు అవుతారు. సమాజంలో పరపతి పెంచుకోవాలనుకునే మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. లీజులు, కాంట్రాక్టులు, ఆక్షన్ వంటివి లాభిస్తాయి. పలుకుబడి ఉపయోగించి మీ వైరివర్గానికి రావలసిన ప్రయోజనాలను మీరు దక్కించుకుంటారు.
సాధారణమైనటువంటి శ్రమతో అసాధారణమైనటువంటి కార్యక్రమాలను విజయవంతం చేయగలుగుతారు. ఆత్మీయుల మధ్య,భార్యాభర్తల మధ్య వివాదాలు, విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. మీ మనోభావాలు ఇతరులకు అర్ధం కాకుండా ప్రవర్తిస్తారు. వ్యక్తిగతమైనటువంటి సంస్థాగతమైనటువంటి రహస్యాలను అతి కష్టం మీద పదిలపరచుకోగలుగుతారు. వాహన సంబంధమైన విషయాలలొ జాగ్రత్తగా ఉండండి. నష్టపోయే అవకాశం ఉంది. మధ్యే మార్గంగా ఎవరికి ఇబ్బంది లేకుండా మీ ప్రవర్తన ఉన్నప్పటికీ మీరు ఏదో ఒక వర్గానికి చెందిన వారిగా మీపై ముద్ర పడుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది. చేస్తున్న వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి కనబడుతుంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎక్కువ ధనాన్ని పెట్టుబడి పెడతారు. స్థిరాస్థి వృద్ధి చేస్తారు. చేస్తున్న కృషికి దైవానుగ్రహం లభిస్తుంది. దూరప్రాంత ప్రయాణాలు విదేశీయానం సంభవం. ఆత్మీయుల మధ్య విభేదాలు పరిష్కరించవలసిన సంక్లిష్టమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక ప్రతిష్టాకరమైన పదవికి మీ పేరు సిఫార్సు చేయబడుతుంది. అంతర్గతమైన రాజకీయాలు, నిష్కారణమైన విరోధాలు, అసూయ కొన్ని ఇబ్బందులకు కారణం అవుతుంది. కళాసాహిత్య రంగాలకు సంబంధించి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. 2008 మే తదుపరి కుటుంబంలో అంతర్గత విభేదాలు అశాంతికి గురి చేస్తాయి. శుభకార్యాలకు సంబంధించి శారీరకంగా, మానసికంగా ఎక్కువగా కృషి చేస్తారు. వ్యవహారాలు ఎన్ని మలుపులు తిరిగినా చివరకు మీరనుకున్నదే అవుతుంది. బరువు బాధ్యతలని తీర్చుకోగలుగుతారు. వ్యవసాయసంబంధమైన , జల సంబంధమైన విషయాలు అనుకూలిస్తాయి. ఎన్ని జాగ్రత్త్రలు వహించినా, సహచరవర్గము, అనుచరవర్గము, సహోదర వర్గము వలన కొన్ని చీకాకులు , ఇబ్బందులు తప్పవు. ఎవరిని నమ్మాలో ఎవరితో కలిసి కార్యక్రమాలు ప్రారంభించాలో నిర్ణయించుకోవడమే అత్యంత కష్టతరమవుతుంది. స్వల్పకాల పరిచితులను నమ్మి అపరిమితమైన అనుకూల ఫలితాలు సాధిస్తారు.కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు అమలు చేయబోయే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.
వివాహ ప్రయత్నాలు, ప్రేమ వివాహాలు అనుకూలిస్తాయి. కాకతాళీయంగా మీరు పరిచయం చేసిన వ్యక్తులు మీ పేరు అడ్డం పెట్టుకుని అడ్డ దారిలో ధనసంపాదన చేస్తారు. ఈ విషయం మీకు ఆలస్యంగా తెలిసి, మీ నిజాయితీని నిరూపించుకోవలసి వస్తుంది. డాక్యుమెంట్స్, అప్లికేషన్స్, ఇంటర్వ్యూ కార్డులు, పాస్‍పోర్టులు మొదలైన విషయాలను అతి జాగ్రత్తగా పరిశీలించాలి. కాగితాలు, డాక్యుమెంట్స్ పరిశీలించకుండా సంతకం చేయవద్దు. నవమ స్థానంలో ఉన్న గురు గ్రహకారణం చేత విలువైన వస్తువుల పట్ల జాగ్రత్త వహించాలి. స్పెక్యులేషన్‍కి దూరంగా ఉండటం మంచిది. స్త్రీలకు సంబంధించిన వివాదాలలో మీ పేరు లాగబడుతుంది. విద్యారంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సంవత్సర ద్వితీయార్ధంలో అప్పు చేస్తారు.అప్పు చేసింది తక్కువైనా ఎక్కువగా మనోభీతి చెందుతారు. జ్యేష్ట సంతానం వల్ల కొంత ఆందోళన కలుగుతుంది. వాళ్ళ పద్ధతులలొ ప్రవర్తనలో మార్పు కోసం మీరు శ్రమించ వలసి వస్తుంది. మీరు కల్పించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేని వ్యక్తుల పట్ల కోపం పెంచుకుంటారు. సంవత్సర ద్వితీయార్ధంలో ఉద్యోగంలో స్థాన చలనం, వృత్తి మార్పులు మానసిక అశాంతికి గురి చేస్తాయి. బాల్య స్నేహితులు చిరకాల పరిచితుల సలహాలను అమలు చేసే ముందు నిపుణుల సూచనలు తీసుకోండి. డాక్యుమెంట్స్, లిఖితపూర్వక వ్యవహారముల యందు జాగ్రత్త వహించాలి. ఉద్యోగపరంగా స్థానచలనానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీకు వ్యతిరేకంగా ఇతరులు చేసే దుష్ప్రయత్నాలు మీకు అనుకూలంగా మారతాయి.
మీమనస్సులోని ఆలోచనా వ్యూహం ఇతరులకు తెలియనివ్వరు. మీ ప్రత్యర్ధివర్గములోనికి మీ అనుచరులను చేర్చుటలో విజయం సాధిస్తారు. మత ప్రభోదకులు మీకు సన్నిహితులుగా మారతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ముఖ్యపాత్ర పోషిస్తారు. మీ మాట మంచితనం వల్ల చాలా మందికి మీరు దగ్గరవుతారు. వృద్ధి చెందుతున్న మీ స్థాయిని చూసి కొంతమంది అసూయపడతారు. మీ పరోక్షంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోబడతాయి. సన్నిహిత వర్గం అభివృద్ధి సంతోషం కలిగిస్తుంది. అవసరం సమయంలో మిమ్మల్ని ఆదుకుంటారు.
ములుగు రామలింగేశ్వర వర ప్రసాదు సిద్ధాంతి
No response to "మేష రాశి ఫలితములు ..."
Post a Comment