సందేహాలకు శ్రీ మల్లాది చంద్రశేఖరశాస్త్రిగారి సమాధానాలు..


1. వాల్మీకి రామాయణంలో 'పుంసాం మోహన రూపాయ ' పురుషులను రాముడు మోహింపచేసినట్లు,
ఋషులు కూడా మోహించినట్లున్నదా? మరి స్త్రీలను కూడా స్త్రీలు మోహించేటట్లున్న స్త్రీ ఉన్నదా?

జ. 'పుంసాం మోహనరూపాయ ' అనే మాటకు శ్రీరాముడు పరబ్రహ్మం అని, ప్రైష్టం, శ్రేష్టము అయినది
పరబ్రహ్మస్వరూపమని, సర్వాకర్షకం అని కాని, ఈ స్త్రీపురుష భేధం పరబ్రహ్మయందు సర్వమూ
ఆకర్షించబడుతుంది అని కాని ఇది అందాలపోటీ కాదు.

2. పుత్రసంతానం లేనివారు (దౌహితులు కూడా లేనివారు) స్వయంగా జీవితకాలంలో చేసుకునే శ్రాద్ధ
ప్రక్రియ వుందా? ఎవ్వరూ లేనివారి గతి ఏమిటి?

జ. తనకు తానుగా మరణించకముందు కర్మకాండలు చేసుకునే విధానం లేదు. పుత్రులు లేని
శ్రీశుకునకున్ వాటిల్లెనే దుర్గతులు అన్నాడు ధూర్జటి. కనుక సత్పాత్రములలో భవత్ప్రీతిగా దానం
చేయడం, క్షేత్రదర్శనం, పరసహాయం చేయడం భవిష్యత్తులో సర్వశ్రేయస్సులను కలిగిస్తుంది.


3. వయస్సులో పెద్దవారైనప్పటికీ అల్లుడు మామగారి కాళ్ళకు నమస్కారం చేయకూడదు అంటారు.
పెళ్ళిలో మాత్రం మామగారు అల్లుడి కాళ్ళు కడిగి ఆ నీళ్ళు తలపై చల్లుకుంటాడు. ఎవరైనా మన
కాళ్ళను త్రాకి నమస్కారం చేస్తే వారి పాపాలు మనకు అంటుతాయి అంటారు. నిజమేనా?

జ వివాహ సమయములో మామగారు అల్లుడి కాళ్లు కడిగి నీళ్లు తన తలపై చల్లుకుంటాడు.ఎందుకంటే
కన్యాదాన సమయంలో అల్లుడిని నారాయణుడిగా భావించడంవల్ల. కాని ఇతరత్రా ఏ సన్నివేశంలో
నయినా అల్లుండే మామగారికి నమస్కారం చేయాలి. ఎదుటివారు నమస్కారం చేసినప్ప్పుడు మన
పుణ్యం ఖర్చు అవుతుంది. నమస్కరించినప్పుడు చిన్నవారైతే ఆశీర్వాదం ఇవ్వాలి. పెద్దవారికి
ప్రతినమస్కారం చేయాలి.