చదువు, డబ్బు, అధికారం, సెక్స్ లాంటి వాటివల్ల కలిగే సుఖాలు, సంతోషాలు అన్న సచ్చిదానం దానికి కేవలం మచ్చుతునకల్లాంటివి. కాని మనం ఆ చిన్న చిన్న సుఖాలనే ఆనందంగా పొరబడుతున్నాం. ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతుడు కూడా "ఇంకా" కావాలనే పరుగుపెడుతున్నాడు.నిజానికి మనిషి తనకు తెలియకుండానే, వేసే ప్రతి అడుగు తన నిజతత్వమైన సచ్చిదానందాన్ని చేరడానికే. కాని దాన్ని బాహ్య ప్రపంచంలో వెదకడమే అసలు పొరబాటు. ఎంత జ్ఞానం సంపాదించినా అన్నింటికన్నా అత్యధిక జ్ఞానం మన గురించి మనం తెలుసుకోవడమే. అత్యధికమైన సంపద మన ఆత్మసంపదే. అత్యధికమైన శక్తి మన ఆత్మశక్తే. అత్యధికమైన ఆనందం సచ్చిదానందమే.
బుద్ధుడు, మహావీరుడు ఎన్ని రాజభోగాలు అనుభవించినా, ఐన్స్టీన్ ఎంత జ్ఞానం సంపాదించినా, అలెగ్జాండర్ ప్రపంచాన్నే జయించినా, వేమన అన్ని సుఖాలూ అనుభవించినా చివరికి వాటిలో ఏమీ లేదని అనుభవపూర్వకంగా చవిచూశారు. దుఃఖానికి, సుఖానికి కారణం మన మనస్సేనని, సచ్చిదానందం మనలోనే ఉందని తెలుసుకున్నారు. అది మన అనుభవం కావాలి. అప్పుడే ఈ గందరగోళానికి, దుఃఖానికి ముగింపు.
స్వామి మైత్రేయ
డబ్బు, ఐహిక సుఖాలు తుచ్చమైనవని కొందరు చెప్తుంటారు కదా. వీటిని అనుభవించకుండానే తుచ్చమైనవని ఎలా చెప్పగలరు?. ఒకవేళ చెప్పినా ఎక్కడో విన్నది, చదివి నది చెప్తారే గాని అనుభవపూర్వకంగా చెప్పలేరు. కొందరు బాగా విషయజ్ఞానం ఉన్నవాళ్లు ఐహిక సుఖాలన్నీ అనవసరమైనవని, ఇదంతా మాయ అని కోరికల్ని లోపలే దాచుకున్నారు. దుఖానికి కారణం ఈ బాహ్య విషయాలేనని పొరబడ్డారు. దానివల్ల ఆ తీరని కోరికలు మైండ్లో దాక్కుని దుఖాన్ని కలిగిస్తున్నాయి. అలాగని వాటి వెంట పరిగెత్తడం కూడా సరైన పద్ధతి కాదు.మనం డబ్బు, అధికారం, జ్ఞానం లాంటివి ఎంతవున్నా ఇంకా ఇంకా అని పరిగెత్తుతూనే ఉన్నాం. ప్రతి విషయంలో "అత్యధికం", "అత్యున్నతం" అనేదాని వైపే మన పరుగు.కారణం అత్యధికమైన దాంట్లో అత్యంత ఆనందం ఉందని పొరబడడమే. కాని ఆ అత్యధికం అన్నదాన్ని ఎప్పటికీ చేరుకోలేము. అడుగుభాగంలేని పాత్రను ఎల నింపలేమో మైండ్ని ఎన్నటికి సంతృప్తి పరచలేం. అన్నింటికన్నా అత్యున్నతం దేవుడే. ఇంట్లో సూది పోగొట్టుకుని వీధిలో వెతికితే దొరుకుతుందా?.. అలాగే మనం ఆనందాన్ని లేని చోట వెతుకుతున్నాం. అదే మన సమస్య.మనకున్న వాటిని ఆత్మతో సంపూర్ణంగా అనుబవిస్తే ఆనందం అక్కడే అనుభవమవుతుంది. కోరికలే మనల్ని వదిలేస్తాయి.
krishna rao jallipalli
January 9, 2009 at 8:51 PM
యోగి
January 10, 2009 at 1:30 AM