రాముడైనా నేనే కృష్ణుడైనా నేనే
సర్వంబు నేనని తెలియండయా
వాడ భేదములేల శ్రీ వేంకటేశుడై
ధరణిలో వెలసినది నేనేనయా..


అంతటి కృష్ణుడు అందగాయుందియూ
పాండవులు పడరాని కష్టాలు పడ్డారయా
రాజది రాజులై భిక్షమెత్తారు దైవలీలలు
కనగ ఎవ్వరికీ తరమౌను ...

నన్ను తలచిన యెడల నా దర్సనంబిత్తు
సత్యమ్బు నా మాట నమ్మందయా
మాయ శక్తులు చేయు ప్రళయంబులెన్నైన
మ్మిమంటబోవని తెలియండయా ...

నన్ను తలచిన వారు నామయ యటంచు
ఐశ్వర్యవంతులుగా నుండేరయా
ఎట్టి ఆపదలైనా ఎన్ని కష్టములైన
నేనుండి తొలగింతు నమ్మండయా ...

మనిషికి తెలియని మర్మమేది లేదు
తానెవరో మాత్రము తెలియలేదు
బయటి విషయముల తెలియు తననుండి తెలియదు
తన్ను తానేరుగుతకు తీరికేయుండదు. ...

సూర్యుని తేజస్సు క్రమముగా తగ్గెను
జీవరాశులు ఎన్నో నశియించి పోయెను
శాస్త్రవేత్తలకడి గోచరము కాకుండా
దైవమే గతియని ప్రార్ధనలు చేసేరు....

బాహ్య విషయములకై పరుగెత్తినావంటే
ఏడ్పించి నీ పై స్వారీ జేసెను
పరమాత్మ వైపున మనస్సు నిలిపావంటే
ప్రకృతే నీ పాద సేవ జేసెను...

మంచితనమునకు మించు శక్తేది బలమేది
ఉజ్వల మైనట్టి సుగుణంబురా
మంచి వాని మంచి సుఖ సౌఖ్యములనిచ్చు
చెడు సర్వనాశనం జేసేనురా ...

భ్రమలు తిప్పగా లేక బానిసగా బ్రతికేరు
సత్యంబు అన్నది తెలియండయా
మానవ జన్మము దొరికేది దుర్లభము
దేవతలు దీనికి వగచేరయా...

కన్నా యోనులయండు పుట్టి గిట్టుచునుండా
కడగండ్లు ఏనాడు తీరేదయ
ఖర్మలే జన్మలకు మూలమని తెలుసుకుని
కడతేరు మార్గంబు వెతకండయా ...

వ్రతములు పూజలు తీర్ధ యాత్రలు జేసి
జఘనుల మనుచు విర్రవీగెరయ
కపట కల్మషము కడుపులో నుండగా
అవిఎల్ల దండగే తెలియండయా ...

వేదాన్తులమనుచు విర్రవీగుచు జనులు
వెర్రివెర్రిగా ఏదో పలికేరాయ
మనసు నిలుపగాలేరు మోక్షమందగాలేరు
మండభాగ్యులకెల ఈ గొడవయ ......