ఋషులు, యోగులు, మునులు, సామాన్యులు, పాపభూయిష్టమైన ఈ ప్రాపంచికము నుండి ముక్తులయి, శాశ్వతమైన బ్రహ్మ పదమును పొందుటకు అనేక విధములయైన ప్రయత్నములు చేయుచున్నారు. ఆ బ్రహ్మపదమును అనుగ్రహించు విద్య :గాయత్రీ మహావిద్య"

" న గాయత్ర్యా: పర: మంత్ర: న మాతు: పరా దేవతా "


గాయత్రీ కంటే గొప్ప మంత్రము, తల్లికంటే గొప్పదేవత సృష్టిలో లేదు.

ఓం భూర్భువస్సువః
తత్సవితుః వరేణియం
భర్గో దేవస్య ధీమహి
ధియో యోనః ప్రచోదయాత్

ఈ గాయత్రీ మంత్రమున ఇరవైనాలుగు అక్షరములతో పాటు ఇరవైనాలుగు దేవతమూర్తుల శక్తి అంతర్హితమై వుంటుందని గాయత్రీ మంత్రోపాసకులు ఈ మంత్రాన్ని త్రికరణ శుద్ధిగా జపించటం వలన ఆ ఇరవైనాలుగు దేవతల ఆశీస్సులు,శక్తియుక్తులు చేకూరుతాయని తాంత్రిక గ్రంధాలు అభివర్ణిస్తున్నాయి.


ఇరవై నాలుగు గాయత్రీమూర్తులకు చతుర్వింశతి గాయత్రీ అని పేరు.

ఇరవైనాలుగు అక్షరములు - దేవతలు

1. తత్ - గణేశ్వరుడు
2. స - నృసింహ భగవానుడు
3. వి - విష్ణుదేవుడు
4. తుః - శివదేవుడు
5. వ - కృష్ణ భగవానుడు
6. దే - రాథా దేవి
7. ణ్యం - లక్ష్మీదేవి
8. భ - అగ్నిదేవుడు
9. ర్గః - ఇంద్రదేవుడు
10. దే - సరస్వతి
11. వ - దుర్గాదేవి
12. స్య - హనుమంతుడు
13. ధీ - పృధ్వీదేవి
14. మ - సూర్యదేవుడు
15. హి - శ్రీరాముడు
16. ధి - సీతామాత
17. యో - చంద్రదేవుడు
18. యో - యమదేవుడు
19. నః - బ్రహ్మదేవుడు
20. ప్ర - వరుణదేవుడు
21. చో - నారాయణుడు
22. ద - హయగ్రీవ భగవానుడు
23. యా - హంసదేవత
24. త్ - తులసీదేవి




ఇంతటి మహిమాన్వితం, దివ్యశక్తి గల ఈ మంత్రాన్ని ఉచ్చరించటంలో స్వర, వర్ణ, లోపం ఉండిన హాని కలుగుతుంది.

బ్రహ్మ పదమును పొందదలచినవారు "కాలనియమమును విధిగా పాటించవలయును. ప్రాతః(సూర్యోదయమునకు ముందు), మధ్యాహ్నికము, సాయంసంధ్యా(సూర్యుడు అస్తమించక ముందు)

ఈ త్రికాలములందు అశ్రద్ధ వహించక గురువు చెప్పిన ప్రకారం "త్రిసంథ్యా"యందు సంధ్యా వందనము, గాయత్రీ మంత్ర జపం చేసిన మనుజుడు బ్రహ్మపదమును సులభముగా పొందగలడు.

నేడు ఫలానా విద్యాభ్యాసం చేతను, వృత్తి, వ్యాపార బాధ్యతల చేతను, గురువు సమీపమున బహుకాలము గడుపక నియమ-నిష్ఠలను కాల రాస్తున్నారు. మరికొందరిలో నియమం వున్నా నిష్ఠలేదు. నిష్ఠ వున్నా నియమం లేదు. మానవుడు బ్రహ్మపదమును పొందాలంటే నియమ-నిష్ఠలు రెండూ ఉండాలి.


Get this widget | Share | Track details