ప్ర. "వారిజాక్షులందు వైవాహికములందు అసత్యమాడవచ్చు" అన్నారు. మరి అసత్యం
ఎప్పుడు ఆడరాదు?

జ. ఎవరు అసత్యమాడినా "ప్రాణ, విత్తమాన భంగమందేనా" కనుక పలకని సమయం
ఏది అనిపిస్తుంది. అలా కాదు. నిష్కారణంగా తనకు ఆపద కలిగితే ఆపద్ధర్మంగా
హింసను తగ్గించడానికి చెప్పవచ్చును. దానిని పైకి తిప్పి చూస్తే ఇతరులు మానవిత్త
భంగములకై అసత్యం పలుకకూడదు. తరచూ అక్కడే పలుకుతాం.


ప్ర. పుంజికస్థల అనే అప్సరస శాపకారణంగా హనుమంతుడి తల్లి అంజన అయ్యిందని
అంటారు.నిజమేనా?

జ. పుంజికస్థల హనుమంతుడి తల్లిగా పుట్టడం నిజం. బ్రహ్మ ఆదేశం మేరకు శ్రీ రామ
సహాయార్ధం దేవతలు వానరులుగా అవతరించగా అందులో ఈ పుంజికస్థల
అంజనీదేవిగా అవతరించింది. ఇందులో శాపం ఏమీలేదు.ప్ర. రాముడు దేవుడని అందరికి తెలుసు. రామేశ్వరంలో శివలింగం స్థాపించి,పూజించాడు
అని అంటారే? ఇది ఎలా నిజం? ఒక దేవుడు మరొక దేవుడిని పూజించడం ఏమిటీ?

జ. శ్రీరాముడు దేవుడని మన భావన. కాని ఆయన దృష్టిలో తాను మానవుడననే
ఆయన భావం. కాన శివప్రతిష్ట చేయడంలో తప్పు లేదు. భగవంతుడు కూడా
అవతరించేటప్పుడు మనకుఅఆదర్శంగా వుండటానికి భగవదర్చన చేస్తాడు.ప్ర. భగవద్గీతలో ఆత్మకు పుట్టుక లేదు. చావులేదు అని వుంది . మరి ఆత్మహత్యలు
ఎందుకు పాపం అంటారు?

జ. ఆత్మకు చావు లేదు నిజమే! హత్య ఎలా చేయ్యడం? కనుక హత్య చేయబడేది
శరీరం కాని ఆత్మ కాదు. ఆ శరీరం కాలం తీరేవరకు వుండాలి. కాని చంపకూడదు.
కాలం తీరేవరకు వుండాలి. కని చంపకూడదు. కావున ఆత్మహత్య దోషమని అన్నారు.