సన్యాసుల చేతిలో కర్ర ఎందుకు?

Filed under:



జీయర్ స్వాములు మరికొందరు స్వాముల చేతిలో పొడవాటి కర్రలు ఉంటాయి గమనించారా? ఎళ్లవేళలా అవి వారి చేతిలో ఉంటాయి. ఊతకోసమా అంటేకాదు. మరి వాటిని ఎప్పుడు చేత పట్టుకోవడానికి గల కారణం గురించి తెలుసుకుందాం. వైరాగ్యానికి, తాత్వికతకు, ద్వైత, అద్వైత భావానికి గుర్తుగా ఈ పొడవైన కర్ర పట్టుకుంటారు సన్యాసులు (యతులు).

ఈ కర్రలు వివిధ ఆకారాలలో ఉంటాయి. ప్రతీదానికి ఓ అర్ధం ఉంది. ' Y' ఆకారంగల యోగదండాన్ని, కమడలాన్ని పట్టుకొని ఉండేవారిని 'తాపసులు' లేదా 'ఋషులు' అని అంటారు. గాలి,నీరు, భూమి, అగ్ని, ఆకాశం అనే పంచభూతాల సమ్మేళనమే మనిషి కాబట్టి ఐదడుగుల కర్రను కూడా ధరిస్తారు. ఇందులో ఏకదండి, ద్విదండి, త్రిదండి అనే మూడు విధాలు ఉన్నాయి. ఒకే ఒక కర్రను ధరించి ఉండేవారు అద్వైత సిద్ధాంతాన్ని నమ్మేవారు, బోధించేవారు. అద్వైతం అనగా జీవుడు, దేవుడు ఒక్కటేననే సిద్ధాంతం (శ్రీ శంకరాచార్య మతం) మనిషిలోనే దేవుడిని చూడమని. స్వర్గం, నరకం రెండూ ఇక్కడే ఉన్నాయి. అంతరాత్మకు విరుద్ధంగా అక్రమ మార్గాన, అన్యాయంగా సంచరించినా, ప్రవర్తించినా ఆ పాపఫలితాన్ని ఏదో ఒక రూపంలో ఇక్కడే తప్పకుండా అనుభవించక తప్పదు. ఈ అద్వైత సిద్దాంతాన్ని బోధించేవారి చేతిలో జ్ఞానానికి సంకేతమైన రావిచెట్టునుండి సేకరించిన ఒకే కర్ర ఉంటుంది.

రెండు కర్రలు కలిపి ఒక్కటిగాకట్టి ధరించి బోధనలు చేసేవారు ద్వైత సిద్ధాంతం కలవారు. వీరిని 'ద్విదండి ' స్వాములు అంటారు. వీరు జీవుడు, దేవుడు వేర్వేరు (రామానుజాచార్యుల మతం) అని బోధిస్తారు ద్వైత సిద్ధాంతానికి ఉన్న ప్రాచుర్యం అద్వైతానికి లేదు. ఈ మతానికి చెందినవారిని 'జీయరు'లని అంటారు.

మూడు కర్రలను ఒకే కట్టగా కట్టి భుజాన పెట్టుకునేవారు కూడా ఉన్నారు. వాళ్లు జీవాత్మ, పరమాత్మ, ప్రకృతి ఒకటే అనే నారాయణ తత్వాన్ని బోధిస్తూ ఉంతారు. పొడవైన ఈ దండాలతో దుష్టప్రాణులనుండి రక్షణ కొరకు, ఫలఫుష్పాల సేకరణ చేసుకుంటూ భగవధ్యానం చేసుకుంటారు.

ఋషుల చేతిలో ఉండే 18 అంగులాల యోగదండం జపం చేయదానికి, ఆత్మరక్షణకు ఉపయోగపడుతుంది. యోగులు రుద్రాక్షమాల నేలపైబడకుండా 'Y' ఆకారంలో ఉన్న యోగదండంపై చేతినిపెట్టి జపమాల తిప్పుతుంటారు..

భక్తి మార్గము - ముక్తి మార్గము - 5

Filed under:


వేషాలు ధరియించి పంటలే జూపించి
దేవుడే నేననుచు పలికేరయ
మాయగాండ్రేగాని మహానీయులుగారు
పొట్టకొరకు పగటి వేషాలయ!


భూతప్రేతంబులు కోలాహలంబుగా
వాడవాడలా తిరిగి ఆడేనయా
దయ్యాల పాపన్న మంత్రాలు పారవు
పాపులను దిగమ్రింగి పోయేనయా!


ధనము బలము ముందు న్యాయంబు చెల్లదు
ధర్మదేవతయేడ్చి కుమిలేనయా!
నీతి నియమము లేని కామందులనుజూచి
శీలవంతులకు చింత పుట్టేనయ!


శక్తిస్వరూపిణిని శ్రీ వెంకటేశుడని
లోకంబు కొనియాడు తెలియండయా
ఆశక్తి మహాలక్ష్మి ఆకర్షణే గలది
అన్ని దిక్కులా ధనము గుంజేనయ!


చీకటి వ్యాపార శక్తులదికంబౌను
పేదసాదలబట్టి మ్రింగేరయ
దోపిడీగాండ్రకు దొరతనంబొచ్చేను
దొడ్డవారినెల్ల మ్రింగేరయ!


సత్యమన్నమాట మచ్చుకైనను లేక
తప్పుడు సాక్షాలు పలికేరయా
దైవభీతి లేక దైవసాక్షి పెట్టు
యీ పురుగులెన్నాళ్ళు బ్రతికేరయ!


పాపాలు పెరిగెను పంటలే తగ్గును
అంతు తెలియని ధరలు ఆకాశామంటేను
ప్రబలిపోయిన ప్రజలు పస్తులకు బలి అయి
బంక మట్టిని తిని బ్రతికేరయ!


బనగాని పల్లెలో మేకపోతు యొకటి
మేకవోలె పాలు యిచ్చేనయ
నల్ల ముఖము కోతులా వూరి వాకిట
గుమిగూడి యేడ్చేను తెలియండయా !


భార్యలను హింసించు భర్తలే వచ్చేరు
పతిని అవమానించు భార్యలే వచ్చేరు
సుతుల అవమానించు తండ్రులే వచ్చేరు
తల్లిదండ్రుల తన్ను బిడ్డలే పుట్టేరు!


ఏడేండ్ల నాగయ్య వేదములు చదివేను
ఆరేండ్ల అంకమ్మ అమడబిడ్డల కనును
వెంపల చెట్లకు దోట్లు వేసేరండి
చీమరంధ్రములోన దొంగలే దాగేరు !


కృతయుగంబందున రేణుకా యను శక్తి
త్రేతాయుగంబున సీతయను శక్తి
ద్వాపరయుగంబున ద్రౌపది యను శక్తి
కలియుగంబున పుట్టు యింటింటికొక శక్తి!


ధనము స్త్రీల కొరకు తపియించుచుందురు
కలిమాయ పురుషులు నమ్మండయా
జీవుని కడతేర్చ దేవుడొక్కడేగాని
మూన్నాళ్ళ బ్రతుకని తెలియండయా!

64 కళలు

Filed under:
ఇతిహాసాములు
ఆగమములు
కావ్యములు
అలంకారములు
నాటకములు
గానం
కవిత్వం
కామశాస్త్రం
దురోదరం
దేశభాష విజ్ఞానం
లిపి కర్మ
వాచకము
సర్వ విధ అవధానములు
స్వర శాస్త్రము
శకున శాస్త్రము
సాముద్రికము
రత్న శాస్త్రము
రథ కౌశలము
అశ్వ కౌశలము
గజ కౌశలము
మల్ల శాస్త్రము
సూద కర్మ
దోహదము
గంధవాదము
ధాతు వాదము
ఖని వాదము
రస వాదము
జల వాదము
అగ్ని స్తంభనం
ఖడ్గ స్తంభనం
జల స్తంభనం
వాక్ స్తంభనం
వయః స్తంభనం
వశీకరణం
ఆకర్షణము
మోహనము
విద్వేశము
ఉచ్చాటనము
మారణము
కాల వంచనము
పరకాయ ప్రవేశము
పాదుకా సిద్ధి
వాక్సిద్ది
ఇంద్ర జాలము
అంజనము
పర దృష్టి వంచనము
పర వంచనము
మణీ మంత్రౌశాధ సిద్దులు
చొర కర్మం
చిత్ర కర్మ
లోహ క్రియ
అస్మ క్రియ
మృత క్రియ
దారు క్రియ
వేణు క్రియ
చర్మ క్రియ
అంబర క్రియ
అదృశ్య కరణం
దండ కరణం
వాణిజ్యము
పాశుపల్యము
కృషి
ఆసవ కర్మ
లావకుక్కుట మేషాది యుద్ధ కారక కౌశలము

పంచాంగం..

అనుసరించంఢి..

మీ రాశిఫలాలు చూసుకోంఢి