విఘ్నేశ్వర శతనామావళి

Filed under:

విఘ్నేశ్వర శతనామావళి

శుక్లాంబరరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయే త్సర్వ విఘ్నోపశాంతయే
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేక దంతం భక్తానాం ఏకదంత ముపాస్మహే


అథ అష్టోత్తర శతనామ పూజ


ఓం గజాననాయ నమః
ఓం గణాధ్యక్షయ నమః
ఓం విఘ్నరాజాయ నమః
ఓం వినాయకాయ నమః
ఓం ద్వైమాతురాయ నమః
ఓం ద్విముఖాయ నమః
ఓం ప్రముఖాయ నమః
ఓం సుముఖాయన నమః
ఓం కృతినే నమః
ఓం సుప్రదీపాయ నమః
ఓం సుఖవిధయే నమః
ఓం సురాధ్యక్ష్యాయ నమః
ఓం సురారిఘ్నాయ నమః
ఓం మహగణపతయే నమః
ఓం మాన్యాయ నమః
ఓం మహాకాలాయ నమః
ఓం మహాబలాయ నమః
ఓం హేరంబాయ నమః
ఓం లంబజఠరాయ నమః
ఓం హ్రాస్వ గ్రీవాయ నమః
ఓం మంగళస్వరూపాయ నమః
ఓం ప్రమదాయ నమః
ఓం ప్రధమాయ నమః
ఓం ప్రాజ్ఞాయ నమః
ఓం విఘ్నకర్త్రే నమః
ఓం విఘ్నహంత్రే నమః
ఓం విశ్వనేత్రే నమః
ఓం విరాట్పతయే నమః
ఓం శ్రీపతయే నమః
ఓం శృంగారిణే నమః
ఓం అశ్రితవత్సలాయ నమః
ఓం శివప్రియాయ నమః
ఓం శీఘ్రకారిణే నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం భవాయ నమః
ఓం బలోత్తితాయ నమః
ఓం భవాత్మజాయ నమః
ఓం పురాణపురుషాయ నమః
ఓం పూష్ణే నమః
ఓం మంత్రకృతే నమః
ఓం చామీకర ప్రభాయ నమః
ఓం సర్వాయ నమః
ఓం సర్వోపాసాయ నమః
ఓం సర్వకర్త్రే నమః
ఓం సర్వనేత్రే నమః
ఓం సర్వసిద్ధి ప్రదాయ నమః
ఓం సర్వసిద్ధయే నమః
ఓం పార్వతీనందనాయ నమః
ఓం ప్రభవే నమః
ఓం కుమార గురవే నమః
ఓం అక్షరోభ్యాయ నమః
ఓం కుంజరాసురభంజనా నమః
ఓం ప్రమోదాయ నమః
ఓం మోదక ప్రియాయె నమః
ఓం కాంతిమతే నమః
ఓం ధృతిమతే నమః
ఓం కామినే నమః
ఓం కపిత్థపనసప్రియాయ నమః
ఓం మహోదరాయ నమః
ఓం మదోత్కటాయ నమః
ఓం మహావీరాయ నమః
ఓం మంత్రిణే నమః
ఓం విష్ణు ప్రియాయ నమః
ఓం భక్త జీవితాయ నమః
ఓం జితమన్మదాయ నమః
ఓం ఐశ్వర్యకారాణాయ నమః
ఓం జయినే నమః
ఓం యక్షకిన్నెర సేవితాయ నమః
ఓం గంగాసుతాయ నమః
ఓం గణాధీశాయ నమః
ఓం గంభీరనినదాయ నమః
ఓం వటవే నమః
ఓం అభీష్ట వరదాయినే నమః
ఓం జ్యోతిషే నమః
ఓం పుష్కరోక్షిప్తవారిణే నమః
ఓం అగ్రగణ్యాయ నమః
ఓం అగ్రగామినే నమః
ఓం అగ్రపూజ్యాయ నమః
ఓం అగ్రగామినే నమః
ఓం భక్త విధయే నమః
ఓం భావగమ్యాయ నమః
ఓం మంగళ ప్రదాయ నమః
ఓం అప్రాకృతపరాక్రమాయ నమః
ఓం సత్యధర్మణే నమః
ఓం సఖ్యై నమః
ఓం సరసాంబునిధయే నమః
ఓం మహేశాయ నమః
ఓం దివ్యాంగాయ నమః
ఓం మణికింకిణి మేఖలాయ నమః
ఓం సమస్తదేవతామూర్తయే నమః
ఓం బ్రహ్మచారిణే నమః
ఓం బ్రహ్మరూపిణే నమః
ఓం బ్రహ్మవిద్యాధి దానభావే నమః
ఓం జిష్ణవే నమః
ఓం సహిష్ణవే నమః
ఓం సతతోత్థితాయ నమః
ఓం విఘాతకారిణే నమః
ఓం విశ్వదృశే నమః
ఓం విశ్వరక్షాకృతే నమః
ఓం కళ్యాణగురవే నమః
ఓం ఉన్మత్త వేషాయ నమః
ఓం పరజితే నమః
ఓం సమస్తజగదాధారాయ నమః
ఓం సర్వైశ్వర్య ప్రదాయ నమః
ఓం ఆక్ట్రాంత చిదచిత్రభషే నమః
ఓం అయ్యప్ప అగ్రజాయ నమః
ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః

నానవిధ పరిమళపత్ర పుష్పాక్షతైః పూజాం సమర్పయామి.

సర్వమత తత్వం

Filed under:




"ఏకం సత్ విప్రాః బహుధా వదంతి" ..

భగవంతుడు ఒక్కడే అని అందరూ అంటారు కాని మతాలు ఎన్నో. తమ మతమే గొప్పది అంటూ ఇతరుల మతాన్ని విమర్శిస్తారు. ఒక్కోసారి ద్వేషిస్తారు. పరమాత్మ ఒక్కడే కాని పండితులు ఆయనను అనేక పేర్లతో పిలుస్తారు. అసలు మతం అంటే అర్ధం అభిప్రాయం అని. లోకో భిన్న రుచిః అంటే లోకంలోని వ్యక్తులు భిన్నమైన రుచులు కలిగి ఉంటారు. ఆలోచన, వివేచన, శోధన మనిషికి దేవుడిచ్చిన వరాలు . ఈ మూడింటి విషయంలో ఏ వ్యక్తి మరొ వ్యక్తిని పోలి ఉండడు. ఎవరి వ్యక్తిత్వం, వారిదే. అనాదినుండి ఈ జగత్తు ఉనికిని తెలుసుకోవడానికి , మనుష్య జీవన గమ్యం పరమార్ధం తెలుసుకుని చేరుకోవాలని ఎంతోమంది జ్ఞానులు, శాస్త్రవేత్తలు, మునులు ప్రయత్నించారు. ప్రకృతికి , సర్వ జీవరాశికి అతీతమైన శక్తి ఏదో ఉందని అందరూ అంగీకరించారు. ఎవరెవరి తపస్సు, అన్వేషణ, పరిశోధనను బట్టి తమ తమ మతాలను (అభిప్రాయాలను) వెలిబుచ్చారు. ఆయా మతాల ఆచరణకు ప్రత్యేకమైన కట్టుబాట్లు ఏర్పరిచారు. అలా ఒకదాని తర్వాత మరోటి అనేక మతాలు ఏర్పడ్డాయి.

ఏ మతమైనా చెప్పేది ఒక్కటే. ధర్మాన్ని, నీతిని పాటించు. నిజాయితీగా జీవించు. సాటివారిని ప్రేమించి ఆదరించు. సాయం చేయి. నీవు చేసే పనిలోనే దైవాన్ని దర్శించి తరించు అని చెబుతాయి. ఎవరి మతంలో వారు భద్రత ఉందని భావిస్తారు. ఈ విలువలు, విశ్వాసాలే అన్ని మతాలకు ఆధారం. కాని ఈ అభిమానం శృతిమించి దురభిమానంగా మారుతుంది. బలవంతపు మత మార్పిడులు, అనవసరపు మత విద్వేషాలు చెలరేగుతున్నాయి. దీనికి రాజకీయ నాయకులు మతాభిమానాన్ని తమ స్వప్రయోజనాలకు వాడుకుంటున్నారు. శాసిస్తున్నారు. ఎవరి మతాలు వారికి ఉన్నతమైనవే కాని పరమతాన్ని కూడా గౌరవించాలి.

సర్వే జనా సుఖినోభవంతు..

పంచాంగం..

అనుసరించంఢి..

మీ రాశిఫలాలు చూసుకోంఢి