లింగాష్టకం

Filed under:



బ్రహ్మ మురారి సురార్చిత లింగం
నిర్మల భాసిత శోభిత లింగం
జన్మజదుఃఖ వినాశక లింగం
తత్ప్రణమామి సదాశివలింగం


దేవముని ప్రవరార్చిత లింగం
కామదహన కరుణాకర లింగం
రావణ దర్ప వినాశక లింగం
తత్ప్రణమామి సదాశివలింగం


సర్వసుగంధ సులేపిత లింగం
బుద్ధివివర్ధన కారణ లింగం
సిద్ధసురాసుర వందిత లింగం
తత్ప్రణమామి సదాశివలింగం


కనక మహామణి భూషిత లింగం
ఫణి పతివేష్టిత శోభిత లింగం
దక్షసుయజ్ఞ వినాశన లింగం
తత్ప్రణమామి సదాశివలింగం


కుంకుమ చందన లేపిత లింగం
పంకజహార సుశోభిత లింగం
సంచిత పాపవినాశన లింగం
తత్ప్రణమామి సదాశివలింగం


దేవగణార్చిత సేవిత లింగం
భావైర్భక్తిభిరేవచ లింగం
దినకరకోటి ప్రభాకర లింగం
తత్ప్రణమామి సదాశివలింగం


అష్టదళోపరివేష్టిత లింగం
సర్వసముద్భవ కారణ లింగం
అష్టదరిద్ర వినాశన లింగం
తత్ప్రణమామి సదాశివలింగం


సురగురు సురవర పూజిత లింగం
సురవన పుష్ప సదార్చిత లింగం
పరమపదం పరమాత్మక లింగం
తత్ప్రణమామి సదాశివలింగం


లింగాష్టకమిదం పుణ్యం
యఃపఠేత్ శివసన్నిధౌ
శివలోక మహాప్నోతి
శివేన సహమోదతే.

విష్ణుసహస్రనామ విశిష్టత

Filed under:








కురుక్షేత్ర యుద్ధం తరువాత,, అంపశయ్యపై ఉన్న భీష్మ పితామహుని ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ పాండవులకు ఉపదేశం చేయించిందే శ్రీవిష్ణు సహస్రనామం. భగవద్గీత కంటే ఈ స్తోత్రం వల్లనే సులభంగా లోకం తరించగలదని శ్రీకృష్ణుడు భావించాడు. " ఏ జీవి ఐనా ఈ సంసార చక్రం నుండి బయటపడాలంటే తెలియవలసిన తత్వమేది అని ధర్మరాజు భీష్ముడిని ప్రశ్నించగా " సర్వజగత్కారణమైన, లోఖేశ్వరుడైన ఆ పుండరీకాక్షుని అర్చించడమే ధర్మాలలో శ్రేష్టమైన ధర్మం" అని భీష్మ పితామాహుడు ఉపదేశిస్తాడు. అంతే కాదు విష్ణు నామాలు కీర్తిస్తే సకల పాపాలు పోతాయి. పవిత్రులవుతారు. కోరినవన్నీ లభిస్తాయి. వేయి నామాలు గల విష్ణు సహస్రనామ స్తోత్రానికి మించిన గొప్ప మంత్రం మరొకటి లేదు. శ్రీమన్నారాయణుని కల్యాణ గుణములను అనుభవించిన ఋషులు వారి అనుభవసారంగా ఒక్కో నామాన్ని దర్శించి గానం చేసినవే ఈ సహస్రనామాలు " అని అంటాడు భీష్ముడు. ప్రతిదినం ఉదయం కాని, సాయంత్రం కాని శ్రీలక్ష్మీ శతనామ స్తోత్రాన్ని ముందుగా పఠించి, తర్వాత విష్ణుహస్రనామ స్తోత్రాన్ని పఠించిన సత్ఫలితాలు తప్పక కలుగుతాయి.

విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఇక్కడ వినండి ..

యుగాలు - సంవత్సరాలు

Filed under:
* సృష్టాది నుంచి గడచిన సంవత్సరాలు - 195 కోట్ల, 58 లక్షల, 85 వేల, 106 సంవత్సరాలు.

* స్వయంభువు మన్వంతరం నుండి ఆరు మన్వంతరాలు గడిచిపోగా ఏడవదైన వైవస్వతమన్వంతరంలో ఉన్నాం.

* 27 మహా యుగాలు గడిచి 28వ మహాయుగంలో ఉన్నాం.

* ఈ మహాయుగంలో కృత, త్రేతా, ద్వాపర యుగాలు గడిచి కలియుగంలో 5106 ఏళ్లు గడిచాయి.

* శాలివాహన శకంలో 1927 ఏళ్లు గడిచాయి.

* ఆదిశంకరాచార్యులు అవతరించి 1216 ఏళ్లయింది.

* శ్రీరామానుజాచార్యులు అవతరించి 988 ఏళ్లయింది.

* శ్రీమధ్వాచార్యులు అవతరించి 886 ఏళ్లయింది.

* హిజరీ శకంలో 1422 ఏళ్లయింది.

* హూణ శకంలో 2009 ఏళ్లు గడిచి 2010 లో ఉన్నాం.

పంచాంగం..

అనుసరించంఢి..

మీ రాశిఫలాలు చూసుకోంఢి