ఊర్ద్వ పుండ్రాలు

Filed under:

శ్రీ మహావిష్ణువు ధరించి, మానవుడు తన ఉజ్జీవనానికి ఇలా ధరించాలని చెప్పినదే ఊర్ద్వ పుండ్రం. "పూడి - ఖండనే " అనే సంస్కృత దాతువునుఅనుసరించి అజ్ఞానాన్ని, కర్మపాశాన్ని ఖండించేది పుండ్రం. సత్వగుణం మనిషిని ఉన్నతమైన మార్గంలో, ఉత్తమ లక్ష్యం వైపు నడుపుతుంది. తెల్ల నామాలు సత్వగునాన్ని, దానివల్ల కలిగే ఉద్రేకరహిత స్థితిని తెలియజేస్తాయి. అది పునాదిగా ఉండాలని క్రింద పాదపీతం ఉంటుంది. సత్వగుణం మనల్ని ఉన్నతికి తీసుకు వెడుతుందని సూచించేదే నిలువు బొట్టు. సత్వగుణానికి అధిష్టాన దేవత శ్రీ మహావిష్ణువు కనుక రెండు తెల్లని ఊర్ద్వ పుండ్రాలు ఆయన పాదాలుగా శిరసావహిస్తారు. ఇక విశ్వమంతటా వ్యాపించిన అనురాగానికి ప్రతీక లేత ఎరుపు రంగు . అనురాగానికి, ప్రేమకు మూలం లక్ష్మీ దేవి. శుభకరమైన ఆ లక్ష్మీ స్వరూపానికి చిహ్నంగా నిలువు పుండ్రాల మధ్య మంగళకరమైన శ్రీ చూర్ణం ధరిస్తారు.

రామకోటి రాయడానికి నియమాలు

Filed under:



రామకోటి రాయడానికి పూనుకోవడం ఒక సత్కార్యం. ఈ కార్యానికి కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది.

* రామకోటి రాయాలన్న మీ సంకల్పాన్ని ముందు దేవుడి దగ్గర మానసికంగా సంకల్పం చేసుకోండి.

* శ్రీరామ అని రాసే వీలున్న కోటి గళ్ళు ఉన్నా పుస్తకం తెచ్చుకోండి. లేదా మీరే ఒక తెల్లకాగితాలతో పుస్తకం తయారుచేసుకోండి.

* మంచి రోజు చూసుకుని పుస్తకానికి పసుపు, కుంకుమ రాసి దేవుని సన్నిధిలో ఉంచి పుష్పాలతో, శ్రీ రామ అష్టోత్తరశతనామావళి తో పూజించండి. తరవాత పుస్తకం కళ్ళకద్దుకుని రాయడంప్రారంభించండి.

* రామకోటి రాసేటప్పుడు ఇతర వ్యాపకాలు, ఆలోచనలు పెట్టుకోకుండా స్థితిమితంగా శ్రీరామ అనుకుంటూ మనసును కేంద్రీకరించి రాయండి.

* అనుకోకుండా మంధ్యలో ఏదైనా పని మీద వెళ్ళవలసి వస్తే ఒక సరి సంఖ్యలో రాయడం ఆపి పుస్తకంమూసి నమస్కరించి వెళ్ళండి. పని అయిపోయిన తర్వాత కాళ్ళు , చేతులు కడుక్కొని శుచిగా మళ్ళీ రాయడం మొదలుపెట్టండి.

* రామకోటి రాసే పుస్తకం జాగ్రత్తగా భద్రపరచండి. అందులో ఇతర విషయాలు ఏవీ రాయకూడదు. దానికి ఉపయోగించేకలాన్ని కూడా విడిగా ఉంచుకోవడం శ్రేయస్కరం.

* రామకోటి రాయడానికి ప్రత్యేకమైన సమయం అంటూ ఏదీ లేదు. కాని శుచి, శుభ్రత, పవిత్రత, ప్రశాంతత మాత్రం తప్పక పాటించాలి. ఒకవేళ ఎప్పుడైనా నిద్రవస్తుంది అనుకుంటే బలవంతంగారాయకుండా ఆపేయాలి.

* ప్రతి లక్ష నామాలకు ప్రత్యెక పూజ,నివేదన చేసి ప్రసాదాన్ని పంచాలి.

* రామకోటి రాయడం పూర్తీ అయిన తర్వాత శక్తి అనుసారంగా పూజ,నివేదనలు సమర్పించి ఆరాధన చేయడం మంచిది.

* పూర్తయిన రామకోటి పుస్తకాన్ని పసుపు బట్టలో కట్టి భద్రాచలంలోని రామచంద్రుడికి సమర్పించాలి. లేదా ఏదైనారాముని గుడిలో ,ఆధ్యాత్మిక సంష్తకు అప్పగించాలి. అదీ వీలుకాకుంటే నదిలో వదలాలి.

గోవింద నామాలు

Filed under:



శ్రీ శ్రీనివాస గోవిందా
శ్రీ వేంకటేశా గోవిందా
భక్తవత్సలా గోవిందా
భాగవతప్రియ గోవిందా
నిత్యనిర్మలా గోవిందా
నీలమేఘశ్యామ గోవిందా
పురాణపురుష గోవిందా
పుండరీకాక్ష గోవిందా
గోవిందా హరి గోవిందా
వేంకటరమణా గోవిందా


నందనందనా గోవిందా
నవనీత చోర గోవిందా
పశుపాలక గోవిందా
పాపవిమోచన గోవిందా
దుష్టసంహార గోవిందా
దురిత నివారణ గోవిందా
శిష్టపరిపాలక గోవిందా
కష్టనివారణ గోవిందా
గోవిందా హరి గోవిందా
వేంకటరమణా గోవిందా



వజ్రమకుటధర గోవిందా
వరాహమూర్తివి గోవిందా
గోపీజనలోల గోవిందా
గోవర్ధనోద్ధార గోవిందా
దశరధనందన గోవిందా
దశముఖ మర్దన గోవిందా
పక్షివాహన గోవిందా
పాండవప్రియ గోవిందా
గోవిందా హరి గోవిందా
వేంకటరమణా గోవిందా



మత్స్యకూర్మా గోవిందా
మధుసూదన హరి గోవిందా
వరాహ నరసింహ గోవిందా
వామన భృగురామ గోవిందా
బలరామానుజ గోవిందా
బౌద్ధకల్కిధర గోవిందా
వేణుగాన ప్రియ గోవిందా
వేంకటరమణా గోవిందా
గోవిందా హరి గోవిందా
వేంకటరమణా గోవిందా


సీతానాయక గోవిందా
శ్రితపరిపాలక గోవిందా
దరిద్రజనపోషకా గోవిందా
ధర్మసంస్థాపక గోవిందా
అనాధ రక్షక గోవిందా
ఆపద్భాందవ గోవిందా
శరణాగతవత్సల గోవిందా
కరుణాసాగర గోవిందా
గోవిందా హరి గోవిందా
వేంకటరమణా గోవిందా



కమలదళాక్ష గోవిందా
కామితఫలదాతా గోవిందా
పాపవినాశక గోవిందా
పాహిమురారే గోవిందా
శ్రీ ముద్రాంకిత గోవిందా
శ్రీవత్సాంకిత గోవిందా
ధరణీనాయక గోవిందా
గోవిందా హరి గోవిందా
వేంకటరమణా గోవిందా



పద్మావతీప్రియ గోవిందా
ప్రసన్నమూర్తీ గోవిందా
అభయహస్త ప్రదర్శన గోవిందా
మర్త్యావతారా గోవిందా
శంఖచక్రధర గోవిందా
శార్జగదాధర గోవిందా
విరజాతీర్ధస గోవిందా
విరోధిమర్దన గోవిందా
గోవిందా హరి గోవిందా
వేంకటరమణా గోవిందా


సాలగ్రామధర గోవిందా
సహస్రనామా గోవిందా
లక్ష్మీవల్లభ గోవిందా
లక్ష్మణాగ్రజ గోవిందా
కస్తూరితిలక గోవిందా
కాంచనాంబరధర గోవిందా
గరుడవాహన గోవిందా
గనరాజరక్షక గోవిందా
గోవిందా హరి గోవిందా
వేంకటరమణా గోవిందా



వానరసేవిత గోవిందా
వారధిబంధన గోవిందా
ఏడుకొండలవాడ గోవిందా
ఏకస్వరూపా గోవిందా
శ్రీరామకృష్ణా గోవిందా
రఘుకులనందన గోవిందా
ప్రత్యక్షదేవా గోవిందా
పరమదయాకర గోవిందా
గోవిందా హరి గోవిందా
వేంకటరమణా గోవిందా


వజ్రకవచధర గోవిందా
వైజయంతిమాల గోవిందా
వడ్డికాలుసవాడ గోవిందా
వసుదేవతనయా గోవిందా
బిల్వపత్రార్చిత గోవిందా
భిక్షుక సంస్థుత గోవిందా
స్త్రీపుంరూపా గోవిందా
శివకేశవమూర్తి గోవిందా
బ్రహ్మాండరూపా గోవిందా
భక్త రక్షక గోవిందా
గోవిందా హరి గోవిందా
వేంకటరమణా గోవిందా



నిత్యకళ్యాణ గోవిందా
నీరజనాభ గోవిందా
హాతీరామప్రియ గోవిందా
హరిసర్వోత్తమ గోవిందా
జనార్ధనమూర్తి గోవిందా
జగత్సాక్షిరూప గోవిందా
అభిషేకప్రియ గోవిందా
ఆపన్నివారణ గోవిందా
గోవిందా హరి గోవిందా
వేంకటరమణా గోవిందా



రత్నకిరీటా గోవిందా
రామానుజనుత గోవిందా
స్వయంప్రకాశ గోవిందా
ఆశ్రితపక్ష గోవిందా
నిత్యశుభప్రద గోవిందా
నిఖిలలోకేశా గోవిందా
ఆనందరూప గోవిందా
ఆద్యంతరహితా గోవిందా
గోవిందా హరి గోవిందా
వేంకటరమణా గోవిందా




ఇహపరదాయక గోవిందా
ఇభరాజరక్షక గోవిందా
పరమదయాళో గోవిందా
పద్మనాభ హరి గోవిందా
తిరుమలవాసా గోవిందా
శేషాద్రినిలయ గోవిందా
శేషా శాయిని గోవిందా
శ్రీ శ్రీనివాస గోవిందా
శ్రీ వేంకటేశా గోవిందా

రుద్రపారాయణం ...నమకం .. చమకం

Filed under:
మహా శివుడిని అర్చించడం లో రుద్రం కి చాల ప్రాధాన్యత ఉంది. యజుర్వేదంలో ఒక భాగం, లేదా అధ్యాయం . రుద్రం నమకం, చమకం అని రెండు భాగాలుగా ఉంది. యజుర్వేదం 16వ అధ్యాయాన్ని నమకం అంటారు. "నమో" అనే పదం ఎక్కువగా ఉపయోగించారు కాబట్టి నమకం గా పిలవటం జరిగింది. యజుర్వేదం 18వ అధ్యాయాన్ని చమకం అంటారు. ఇక్కడ "చమే" అనే పదం ఎక్కువగా ఉపయోగించారు. రుద్రం ని 11 అనువకాలు(విభాగాలు) గా విభజించారు

నమకం,చమకం

తెలుగులో


ఇంగ్లీషులో


శ్రవ్యకం. 1

శ్రవ్యకం.2



ఆడియో డౌన్లోడ్

సాహిత్యం డౌన్లోడ్

పంచాంగం..

అనుసరించంఢి..

మీ రాశిఫలాలు చూసుకోంఢి