చెప్పలేదంటనక పొయ్యేరు
Filed under: బ్రహ్మంగారి కాలజ్ఞానం Author: జ్యోతి
చెప్పలేదంటనక పొయ్యేరు .. నరులార గురుని
చేరి మొక్కితే బతుక నేర్చేరూ ...
చెప్పలేదంటనక పొయ్యేరు
తప్పదిదిగో గురుని వాక్యము
తప్పుదోవల బోవు వారల
చప్పరించి మింగు శక్తుల
మోప్పెతనమున మోసపొయ్యేరు.. అదిగాక కొందరు
గొప్పతనమున గోసు మీరేరు
ఇప్పు డప్పు డనగ రాదు
ఎప్పుడో ఎ వేలనో మరి
గుప్పు గుప్పున దాటిపోఎడు
గుర్ర పడుగులు ఏరుపదును...
తాకుతప్పులు తలచకున్నారు తార్కాణమైతే
తక్కు వెక్కువ తెలియనేర్తూరు
జోక తోడుత తల్లి పిల్లలు
జోడు బాసి అడవులందు
కాకి శోకము చేసే ప్రజలు
కాయ కసురులు నమిలి చత్తురు
కేక వేసియు ప్రాణ మిడిచేరు .. రాకాసి మూకలు
కాకబట్టి కలవరించేరు
ఆకసమ్మది ఎర్రబారును
ఆరు మతములు ఒక్కటౌను
లోకమండలి జనము లందరూ
నీరు నిప్పున మునిగి పోదురు ...
ఆగలు విడిచి పొగలు చాటేరు .. అదిగాక పట్టా
పగలు చుక్కలు చూసి భ్రమసేరు
భుగులు భుగులు ధ్వనులు మింటను
పుట్టిఎగిన పిమ్మతాను
దిగులు పడుచు ప్రజలు చాలా
దిక్కులేని పక్షులోదురు ...
పాట కూలు పదట కలిసేరు .. పరిపూత చరితులు
సాధువులూ సంతసించేరు
భూతలంబున నిట్టి వింతలు
పుట్టియణగిన పిమ్మటాను
నీతి కృతయుగ ధర్మ మప్పుడు
నిజము నిలకడ మీద తెలియును
ఏమొ ఏమొ ఎరుగకున్నారు.. ఎందెందు జూచిన
యముని పురికే నడవమన్నారు
భూమి మీదన ధూము ధాములు
పుట్టి పెరిగిన పిమ్మటాను
రామా రామా యననివారలు
రాలిపోదురు కాలిపోదురు
ముందు వెనుకలు గానకున్నారు .. మూర్ఖాళి భువిలో
ముందు గతినే యెరుగకున్నారు
కందువతో పిన్న పెద్దల
కన్ను గానక గర్వములచే
మందె మేలము లాడువారిని
బందు బందుగ గోతురక్కడ
కీడె యైనను కూడదందురు .. ఒనగూడినప్పుడు
యేడ జూచిన వాడు కొందురు
వేడుకతో పోతులూరి వీరభోగ వసంతరాయలు
ఏడు దీవులు ఏకచక్రము
ఏలును బ్రహ్మాండమంతా...
చేరి మొక్కితే బతుక నేర్చేరూ ...
చెప్పలేదంటనక పొయ్యేరు
తప్పదిదిగో గురుని వాక్యము
తప్పుదోవల బోవు వారల
చప్పరించి మింగు శక్తుల
మోప్పెతనమున మోసపొయ్యేరు.. అదిగాక కొందరు
గొప్పతనమున గోసు మీరేరు
ఇప్పు డప్పు డనగ రాదు
ఎప్పుడో ఎ వేలనో మరి
గుప్పు గుప్పున దాటిపోఎడు
గుర్ర పడుగులు ఏరుపదును...
తాకుతప్పులు తలచకున్నారు తార్కాణమైతే
తక్కు వెక్కువ తెలియనేర్తూరు
జోక తోడుత తల్లి పిల్లలు
జోడు బాసి అడవులందు
కాకి శోకము చేసే ప్రజలు
కాయ కసురులు నమిలి చత్తురు
కేక వేసియు ప్రాణ మిడిచేరు .. రాకాసి మూకలు
కాకబట్టి కలవరించేరు
ఆకసమ్మది ఎర్రబారును
ఆరు మతములు ఒక్కటౌను
లోకమండలి జనము లందరూ
నీరు నిప్పున మునిగి పోదురు ...
ఆగలు విడిచి పొగలు చాటేరు .. అదిగాక పట్టా
పగలు చుక్కలు చూసి భ్రమసేరు
భుగులు భుగులు ధ్వనులు మింటను
పుట్టిఎగిన పిమ్మతాను
దిగులు పడుచు ప్రజలు చాలా
దిక్కులేని పక్షులోదురు ...
పాట కూలు పదట కలిసేరు .. పరిపూత చరితులు
సాధువులూ సంతసించేరు
భూతలంబున నిట్టి వింతలు
పుట్టియణగిన పిమ్మటాను
నీతి కృతయుగ ధర్మ మప్పుడు
నిజము నిలకడ మీద తెలియును
ఏమొ ఏమొ ఎరుగకున్నారు.. ఎందెందు జూచిన
యముని పురికే నడవమన్నారు
భూమి మీదన ధూము ధాములు
పుట్టి పెరిగిన పిమ్మటాను
రామా రామా యననివారలు
రాలిపోదురు కాలిపోదురు
ముందు వెనుకలు గానకున్నారు .. మూర్ఖాళి భువిలో
ముందు గతినే యెరుగకున్నారు
కందువతో పిన్న పెద్దల
కన్ను గానక గర్వములచే
మందె మేలము లాడువారిని
బందు బందుగ గోతురక్కడ
కీడె యైనను కూడదందురు .. ఒనగూడినప్పుడు
యేడ జూచిన వాడు కొందురు
వేడుకతో పోతులూరి వీరభోగ వసంతరాయలు
ఏడు దీవులు ఏకచక్రము
ఏలును బ్రహ్మాండమంతా...
మేష రాశి
Filed under: రాశి ఫలాలు Author: జ్యోతి
అశ్వని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం
ఆదాయం:2, వ్యయం:8, రాజపూజ్యం:1, అవమానం:7
ఈ రశివారికి నవంబరు 15 వరకు చతుర్ధము నందు కేతువు, రాజ్యమునందు రాహువు, ఆ తదుపరి అంతా తృతీయమునందు కేతువు. భాగ్యమునందు రాహువు. ఈ సంవత్సరం సెప్టెంబరు వరకు పంచమమునందు శని, ఆ తదుపరి అంతా షష్టమమునందు, ఈ సంవత్సరం మే 1 వరకు రాజ్యమునందు బృహస్పతి,
ఆ తదుపరి లాభమునందు, జులై 30 నుంచి వక్రగతిన మకరమునందు తిరిగి డిశంబరు నుంచి లాభమునందు సంచరిస్తారు.
ఈ సంవత్సరం 'కూరిమి విరసంబైనను' అన్నట్టుగా మీ సహాయం పొంది మిమ్మల్ని తక్కువ అంచనా చేసేవారు అధికం అవుతారు. మీ మిత్రులలో మార్పు మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ప్రతి విషయంలో ఓర్పు అవసరమని గమనించండి. తల పెట్టిన పనులలొ కొన్ని అవరోధాలు ఎదుర్కొనక తప్పదు. తోటలు, వ్యవసాయ రంగంలోని వారికి చికాకులు తప్పవు. బంధువుల రాకపోకలు పెరుగుతాయి. ప్రియతముల కోసం,ముఖ్యుల కోసం ధనం బాగా వెచ్చిస్తారు. అధికారులతో సంభాసించేటప్పుడు మెళకువ వహించండి. నూతన వ్యాపారం పట్ల ఆసక్తి పెరుగగలదు. కాంట్రాక్టర్లకు రావలసిన బకాయిలు సకాలంలో రావడం వలన ఆర్ధిక ఇబ్బందులు ఉండవు. బంగారు వెండి, వస్త్ర వ్యాపారులకు శుభదాయకం, పారిశ్రామిక రంగంలోని వారికి క్రమంగా మార్పులు రాగలవు. అవివాహితులకు అనుకూలమైన కాలం, వాణిజ్య రంగాలలోని వారికి నెమ్మదిగా మార్పులు కానవస్తాయి. ముఖ్యులలో ఒకరికి వీడ్కోలు పలుకుతారు. మీ కళత్ర మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. మీ నూతన పథకాలు ఆచరణలో పెట్టి జయం పొందుతారు. మీ పట్టుదల వలన ముఖ్యమైన విషయాలలో విజయం చేకూరుతుంది.
అశ్వని నక్షత్రం వారు కృష్ణవైడూర్యం, భరణి నక్షత్రం వారు వజ్రం, కృత్తికా నక్షత్రం వారు పచ్చ, కెంపు అనే రాయిని ధరించిన శుభం చేకూరుతుంది. ఈ రాశివారు లలితా సహస్రనామం, విష్ణుసహస్రనామం పారాయణ చేసిన ఆరోగ్యం, శుభం చేకూరుతాయి.
వృషభ రాశి
Filed under: రాశి ఫలాలు Author: జ్యోతి
కృత్తిక 2, 3, 4, పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదలు
ఆదాయం: 11, వ్యయం:14, రాజపూజ్యం:4, అవమానం:7
ఈ సంవత్సరం సెప్టెంబరు వరకు తృతీయమునందు కేతువు, భాగ్యమునందు రాహువు, ఆ తదుపరి అంతా ద్వితీయమునందు కేతువు, అష్టమమునందు రాహువు, మే 1 వరకు భాగ్యమునందు బృహస్పతి, ఆ తదుపరి అంతా రాజ్యమునందు, జులై 30 నుంచి వక్రి గతిన మకరమందు, డిశంబరు 19వ తేదీనుంచి తిరిగి రాజ్యమునందు, సెప్టెంబరువరకు అర్ధాష్టమ శని, ఆ తదుపరి అంతా పంచమమునందు సంచరిస్తారు.
ఈ సంవత్సరం 'పాలసునకై ఆపద' అన్నట్టుగా ప్రతి విషయంలోనూ ప్రశంతత వహించుట వలన అన్నివిధాలుగా సంతృప్తి కానరాగలదు. దైవ కార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొంతమందిమిమ్మల్ని ఉద్రేకపరచి లబ్ది పొందడానికి ప్రయత్నిస్తారు. ఆర్ధిక ఒడిదుడుకులు తలెత్తినా మిత్రుల సహకారం వలన సమసిపోతాయి. జీవిత భాగస్వామి వలన లాభం పొందుతారు.నూతన వ్యాపారాలు కలసి వస్తాయి. భాగస్వామ్యం పనికి రాదు. శుభకార్యాల మూలకంగా అధికంగా ధనం ఖర్చు చేస్తారు. విద్యార్థుల మొదటి భాగంలో జయం చేకూరుతుంది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలవసరం. నూతన ఎగ్రిమెంట్ల పట్ల ఆసక్తి పెరుగుతుంది వ్యాపారంలో నూతనంగా తయారు చేయు వస్తువుల అమ్మకాలు పెరుగుతాయి. చిన్న తరహా పరిశ్రమల వారికి శ్రమానంతరం విజయం చేకూరగలదు. తొందరపాటు నిర్ణయాల వలన సమస్యలు ఎదుర్కొనక తప్పదని తమనించండి. మీ వ్యక్తిగత విషయాలు ఇతరులకు తెలియపర్చుట మంచిది కాదు. మీ లక్ష్య సాధనకు నిరంతర కృషి అవసరమని గమనించండి. ఉత్తర ప్రత్యుత్తరాలు కలసి వస్తాయి. శుభాకాంక్షలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. రైతులు ఆందోళనకు గురి అవుతారు. వాతావరణంలో మార్పులు ఇబ్బంది పెడతాయి. ప్రయాణాలలొ మెళకువ వహించండి. అనుకోని ఖర్చులు మీ అంచనాలను దాటటం వలన ఆందోళన పడతారని చెప్పవచ్చు. ఉద్యోగస్థులు ప్రమోషన్లకై చేయు ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఇప్పటివార్కు విరోధులుగా ఉన్నవారు మీ సహాయం అర్ధిస్తారు. సాంఘిక కార్యక్రమాలలో పాల్గొంటారు. క్రీడల పట్ల అసక్తి పెరుగుతుంది. ముఖ్యమైన విషయాలు గోప్యంగా ఉంచండి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలవారికి అనుకూలం. హామీలు ఉండడం మంచిది కాదని గమనించండి. సినిమా, విద్య, సాంస్కృతిక రంగాల పట్ల ఉత్సాహం కనబరుస్తారు. ఊహించని శుభవార్త మీకు ఆశ్చర్యానందాలను కలిగిస్తుంది.స్థిర, చరస్థుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. భూముల గురించి చర్చలు జరుగుతాయి. కంప్యూటర్, ఎలక్ట్రానిక్ రంగాలలో వారికి మిశ్రమ ఫలితం. ఎస్టేట్ వ్యాపారస్థులకు, బ్రోకర్లకు శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. కూరగాయలు, పండ్లు, పూల వ్యాపారస్థులకు లాభదాయకంగా ఉంటుంది.
కృత్తిక నక్షత్రం వారు జాతి కెంపు, రోహిణీ నక్షత్రం వారు స్పందన ముత్యం, మృగశిర వారు జాతి పగడం ధరించిన శుభం. జయం చేకూరగలదు. ఈ రాశివారు 2009 సెప్టెంబరు వరకు శనికి తైలాభిషేకం చేయిస్తూ, వేంకటేశ్వర స్వామి ఆరాధన చేస్తే శుభం, జయం, అభివృద్ధి చేకూరగలదు.
మిథున రాశి
Filed under: రాశి ఫలాలు Author: జ్యోతి
మృగశిర 3,4 పదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పదాలు.
ఆదాయం: 14, వ్యయం: 11, రాజపూజ్యం: 14, వ్యయం: 11
ఈ రాశివారికి సెప్టెంబరు 9వ తేదీ వరకు తృతీయమునందు శని, ఆ తదుపరి అంతా అర్ధాష్టమ శని, మే 1 వరకు అష్టమమునందు బృహస్పతి, ఆ తదుపరి భాగ్యమునందు, జులై 30 నుంచి వక్రగతిన అష్టమమునందు, డిశంబరు 19 నుంచి భాగ్యము నందు, ఈ సంవత్సరం నవంబరు 15 వరకు ద్వితీయమునందు కేతువు, అష్టమమునందు రాహువు, ఆ తదుపరి జన్మమునందు కేతువు, సప్తమమునందు రాహువు సంచరిస్తారు.
ఈ సంవత్సరము 'నాదసుమీ అప్పిచ్చుట' అన్నట్టుగా మీరు ఎవరికన్నా ధన సహాయం చేసినా సమస్యలు, మాట పడక తప్పదు. మెళకువ వహించండి. ఉద్యోగాభివృద్ధికై చేయు ప్రయత్నాలు అనుకూలించగలవు. సంఘంలో మీ స్థాయి పెరుగుతుంది. బంధుమిత్రుల రాకపోకలు పెరుగగలవు. ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగంలోనికి వారికి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. విద్యార్థులు ఏకాగ్రత వహిస్తే గణనీయమైన పురోభివృద్ధి పొందుతారు. కోర్టు వ్యవహారాలలో ఆటంకాలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. గృహాది రంగాలలొ ఒత్తిడి, చికాకులు ఎదుర్కొనక తప్పదు. నూతన పెట్టుబడులు పెట్టినప్పుడు ఆచితూచి వ్యవహరించండి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించినవాటిని సద్వినియోగ పరుచుకోగలుగుతారు. వ్యాపారస్థులకు అనుకూలమైన కాలం, నూతన వస్తువులు అమ్మకానికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. వైద్యులకు సదవకాశాలు లభించగలవు. దూర ప్రయాణాలకై చేయు ప్రయత్నాలలో జయం చేకూరుతుంది. భాగస్వామ్య వ్యాపారం చేయగోరువారు అతి జాగ్రత్తగా మీ భాగస్వాములకు శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. యాక్టర్లకు, సినిమా రంగాలలో వారికి సంతృప్తికరంగా ఉండదు. మందులు, ఎరువులు, రసాయనిక, సుగంధ ద్రవ్య వ్యాపారం చేయువారు మంచి అభివృద్ధిని సాధిస్తారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలలొ వారికి ఒత్తిడి, చికాకులు తప్పవు. బంగారం, వెండి, వస్త్ర, లోహ వ్యాపారం చేయువారుఈ సంవత్సరం మంచి లాభాలు గడించగలుగుతారు. ఇంతవరకు విరోధులుగా ఉన్నవారు మీ స్నేహాన్ని కోరుకుంటారు. స్త్రీల వాక్ చాతుర్యానికి, సమయస్ఫూర్తికి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తాయి.
ఈ రాశివారు అష్టభుజ గణపతి స్తోత్రం పఠించిన శుభం కలుగుతుంది. మృగశిర నక్షత్రం వారు జాతి పగడం, ఆరుద్ర నక్షత్రం వారు ఎర్ర గోమేధికం, పునర్వసు నక్షత్రం వారు వైక్రాంతమణి లేక కనక పుష్యరాగం ధరించిన ఆరొగ్యం, అభివృద్ధి పొందుతారు.
కర్కాటక రాశి
Filed under: రాశి ఫలాలు Author: జ్యోతి
పునర్వసు 4 వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పదాలు
ఆదాయం: 8, వ్యయం:11, రాజపూజ్యం:3, అవమానం:3
ఈ రాశివారికి నవంబరు 15 వరకు జన్మమునందు కేతువు, సప్తమమునందు రాహువు, ఆ తదుపరి అంతా వ్యయమునందు కేతువు. షష్టమమునందు రాహువు, ఈ సంవత్సరం సెప్టెంబరు వరకు ద్వితీయమునందు శని, ఆ తదుపరి అంతా తృతీయమునందు, మే 1 వరకు సప్తమమునందు బృహస్పతి, ఆ తదుపరి జులై 30 వరకు అష్టమమునందు, ఆ తదుపరి డిశెంబరు 19 వరకు సప్తమము నందు తదుపరి అష్టమమునందు సంచరిస్తారు.
ఈ సంవత్సరం 'ధనం మూలమ్ ఇదం జగత్' అన్నట్లుగా మీరు మీ ధనమును ఖర్చుపెట్టడంలో తగు జాగ్రత్తలు పాటించాలి. ఈ సంవత్సరం బద్ధకం వదిలి బాగా కష్టపడిన మంచి ఫలితాలు పొందగలరు. రవాణా రంగంలోని వారికి లాభదాయకం, రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు, బ్రోకర్లకు, ఎక్స్‌పోర్టు వ్యాపారస్థులకు వారి వారి రంగాలలో విజయం చేకూరగలదు.నిరుద్యొగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మీ కుటుంబమ్ళో ప్రేమానుబంధలౌ బలపడతాయి. వైద్యరంగంలో వారికి పురోభివృద్ధి. శుభకార్యాలకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇసుక, ఇటుక, తాపీ పనివారికి కలిసి వచ్చే కాలం, దైవ కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. బంధుమిత్రుల రాకపొకలు పెరుగుతాయి. నూతన వ్యాపారాల్ అపట్ల ఆసక్తి పెరుగుతుంది.వ్యవసాయదారులకు ఆందోళన తప్పదు. ఆంతరంగిక సమస్యలకు పరిషకార మార్గం కానవస్తుంది. చిన్న చిన్న విషయాలకు ఉద్రేకం మాని తెలివితేటలతో అనుకున్న పని సాధించండి. అధిక ఉష్ణం వలన కుటుంబ పెద్దల పట్ల ఆందోళన చెందుతారు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఎక్స్‌పోర్టు వ్యాపారస్థులకు లభదాయకం. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగి జయం పొందండి.
ఈ రాశివారికి 2009 వరకు ఏలినాటి శని దోషం ఉన్నందువల్ల శనికి 3 నెలలకోసారి తైలాభిషేకం చేయించిన కలిసి రాగలదు.నవగ్రహస్తోత్ర పారాయణం, దుర్గాపూజ చేయడం వలన ఆరోగ్యం, ఆర్ధికాభివృద్ధి చేకూరుతాయి. పునర్వసు నక్షత్రం వారు కనక పుష్యరాగం లేక వైక్రాంతమణి, పుష్యమి నక్షత్రం వారు సౌగంధికా నీలం, ఆశ్లేషా నక్షత్రం వారు మయూరి మరకతం ధరించిన శుభం చేకూరగలదు.
సింహ రాశి
Filed under: రాశి ఫలాలు Author: జ్యోతి
మఘ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం
ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 6, అవమానం 3
ఈ రాశివారికి సెప్టెంబరు 9 వరకు జన్మమునందు శని సంచారం, ఆ తదుపరి అంతా ద్వితీయమునందు, నవంబరు 15 వరకు షష్టమమునందు రాహువు, వ్యయమునందు కేతువు, ఆ తదుపరి అంతా పంచమమునందు రాహువు, లాభమునందు కేతువు, మే 1 వరకు ఆరింట గురువు, ఆ తదుపరి ఏడింట, జులై 30 నుంచి షష్టమమునందు బృహస్పతి డిశంబరు 19వరకు, ఆ తదుపపరి సప్తమమునందు సంచరిస్తారు.
ఈ సంవత్సరము ' సిరిదా వచ్చిన వచ్చును ' అన్నట్లుగా ఊహించిన ధనం సమయానికి సమకూరడం వలన ఆర్ధిక ఇబ్బంది ఉండదు. ఉద్యోగాభివృద్ధికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులు చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన భాగస్వామ్య వ్యాపారాలు చేయువారు ఆచి తూచి వ్యవహరించండి. మిమ్మల్ని చూసి ఈర్ష్య పడేవారు అధికమవుతున్నారని గమనించండి. స్పెక్యులేషన్ వ్యవహారాలు కొంతవరకు అనుకూలిస్తాయి. షేర్స్ వంటి వాటిలో పెట్టుబడి విషయంలో సరైన నిర్ణయం తీసుకోండి. కుటుంబం ప్రేమానురాగాలు బలపడతాయి. సోదరుల మధ్య సరైన ఆవగాహన ఉండదు. ఆరోగ్య విషయంలో సమస్యలు తలెత్తినా సమసిపోగలవు. తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. స్త్రీల సృజనాత్మకతకు, సమయస్పూర్థికి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తాయి. వ్యవసాయదారులకు సంతృప్తి లభిస్తుంది. ఒకే కాలంలో అనేక పనులు చేపట్టడం వలన కాంట్రాక్టర్లకు ఒత్తిడి పెరుగుతుంది. స్త్రీ మనోవాంచ నెరవేరే సమయం ఆసన్నమయినదని గమనించండి. ఇచ్చి, పుచ్చుకునే వ్యవహారాలలొ జాగ్రత్త వహించండి. తల, పొట్టకు సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు. నూతన ఎగ్రిమెంట్లకు శ్రీకారం చుట్టండి. స్త్రీల నేర్పు, ఓర్పునకు పరీక్షా సమయం అని గమనించండి. విద్యా, సాంస్కృతిక, సాంఘిక కార్యక్రమాలలో పాల్గొంటారు. డాక్యుమెంట్లు, విలువైన వస్తువులను ఖరీదు చేస్తారు. పట్టుదలతో ముందుకు సాగి అన్ని పనులు పూర్తి చేస్తారు.
ఈ రాశివారు ఆదిత్య హృదయం, విష్ణుసహస్రనామం, లలితా సహస్రనామం పారాయణ చేసిన శుభం, లాభం చేకూరుతుంది. మఘ నక్షత్రం వారు వైఢూర్యం, పుబ్బ నక్షత్రం వారు వజ్రం, ఉత్తరా నక్షత్రం వారు కెంపు ధరించిన మంచి అభివృద్ధి పొందుతారు.
కన్యా రాశి
Filed under: రాశి ఫలాలు Author: జ్యోతి
ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు
ఆదాయం: 14, వ్యయం: 11, రాజపూజ్యం: 2, అవమానం:6
ఈ రాశివారికి మే 1 వరకు పంచమమునందు బృహస్పతి, ఆ తదుపరి షష్టమమునందు జులై 30 వరకు, ఆ తదుపరి పంచమమునందు, డిశంబరు 9 నుంచి షష్టమమునందు, నవంబరు 15 వరకు పంచమమునందు రాహువు, లాభమునందు కేతువు, ఆ తదుపరి అంతా చతుర్ధమునందు రాహువు, లాభమునందు కేతువు, ఈ సంవత్సరము సెప్టెంబరు 9 వరకు వ్యయమునందు శని, ఆ తదుపరి అంతా జన్మమునందు సంచరిస్తాడు.
ఈ సంవత్సరము ' భాగ్యం ఫలతి సర్వత్ర ' అన్నట్లుగా ఆర్ధిక విషయాలలో ఒకడుగు ముందుకు వెళతారు. ఈ సంవత్సరం మీ గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అన్ని విషయాలలో శుభం, లాభం చేకూరతాయి. బద్ధకం వదిలి అధిక కృషి చేసిన లాభం పొందగలుగుతారు. వాణిజ్య ఒప్పందాలకు శ్రీకారం చుట్టండి. మీ సహాయం పొందిన వారు మిమ్మల్ని తక్కువ అంచనా వేసినా ఆశ్చర్యపడనక్కరలేదు. ఉద్యోగస్థులకు అధిక శ్రమ, చికాకు తప్పకపోయినా గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఎరువులు, కిరాణా, ఫ్యాన్సీ రంగాలలో వారికి కలిసి వచ్చే కాలం, ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఈ రాశివారికి ఏలినాటి శని దోషం ఉన్నా శని మీకు హానికారి కాదు. పౌరోహితులకు, వృత్తులలో వారికి ఒత్తిడి పెరుగుతుంది. ఇవాల్టి పనులు రేపటికి వాయిదా వేయక చేపట్టిన పనిలో జయం పొందండి. అంతరంగిక సమస్యలకు పరిష్కార మార్గం కానరాగలదు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలలో వారికి కలిసి వచ్చే కాలం, శుభకార్యాలకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. స్త్రీలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఊహించిన చికాకులు తలెత్తిన తెలివితో పరిష్కరిస్తారు. ఖాదీ, కలంకారీ రంగాలలో వారికి లాభదాయకం, వ్యాపారస్థులకు ఇన్‌కమ్ టాక్స్ వారి నుండి ఒత్తిడులు ఏర్పడతాయి. వైద్య, ఇంజనీరింగ్ రంగాలలో వారికి అనుకూలత, అనవసరపు వాగ్ధానాలు చేసి సమస్యలు కొని తెచ్చుకోకండి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి జయం పొందండి. మీ సమస్యలకు తగిన పరిష్కారం లభిస్తుంది. ఎక్స్ పోర్ట్ వ్యాపారస్థులకు లాభదాయకం. పెద్దలతో ఆవగాహన లోపం, అందరితో కలిసి విందులు, వినోదాలలో పాల్గొంటారు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడడం మంచిది. ముఖ్యుల సలహాని పాటించండి. ఋణ ప్రయత్నం ఫలిస్తుంది.
ఆరోగ్యం బాగుపడేందుకు, అన్ని విధాలా కలిసి వచ్చేందుకు 3 నెలలలకు ఒకసారి శనికి తైలాభిషేకం చేయించండి. శ్రీమన్నారాయణుడిని ఆరాధించడం వల్ల శుభం చేకూరుతుంది. ఉత్తర నక్షత్రంవారు కెంపు, హస్త నక్షత్రంవారు స్పందన ముత్యం, చిత్త నక్షత్రంవారు జాతి పగడం ధరించిన శుభం కలుగుతుంది.
తుల రాశి
Filed under: రాశి ఫలాలు Author: జ్యోతివృశ్చిక రాశి
Filed under: రాశి ఫలాలు Author: జ్యోతి
విశాఖ 4 వ పాదం, అనూరాధ 1, 2, 3 పాదాలు, జ్యేష్ట 1, 2, 3 పాదాలు
ఆదాయం: 2, వ్యయం: 8, రాజపూజ్యం:1, అవమానం: 2
ఈ రాశివారికి మే 1 వరకు తృతీయమునందు గురువు, ఆ తదుపరి చతుర్ధమునందు, జులై 30 నుంచి తృతీయమునందు, డిశంబరు 19 నుంచి చతుర్ధమునందు, ఈ సంవత్సరము నవంబరు 15 వరకు తృతీయమునందు రాహువు, భాగ్యమునందు కేతువు, ఆ తదుపరి అంతా ద్వితీయమునందు రాహువు, అష్టమమునందు కేతువు. ఈ సంవత్సరము సెప్టెంబరు 9 వరకు రాజ్యమునందు శని, ఆ తదుపరి అంతా లాభమునందు సంచరిస్తాడు.
ఈ సంవత్సరము ' సిరిదా పోయిన పోవును ' .ఖర్చులు బాగా అధికంగా అవడం వల్ల ఆందోళనకు గురి అవుతారు. మీరు శ్రీరామ అన్నా అపార్ధంగా భావించేవారు ఎక్కువవుతారు. ప్రేమికులకు ఆవగాహన లోపం, ఆరోగ్యంలో జాగ్రత్త వహించండి. విధ్యార్థులకు మొదటి భాగంలో జయం చేకూరగలదు. నరాలు, ఎముకలు, మెదడుకు సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు. కుటుంబీకుల విషయంలో సంతృప్తి కానరాదు. కోర్టు వ్యవహారాలను వాయిదా వేయడం మంచిది. ఇతరుల కారణంగా మీ కార్యక్రమాలలో అంతరాయం ఏర్పడగలదు. ఉపాధ్యాయులకు మతిమరపు పెరగడం వల్ల ఆందోళనకు గురి అవుతారు. తొందరపడి వాగ్ధానాలు చేయడం వల్ల సమస్యలు ఎదుర్కొనక తప్పదు. మీ విరోధులు చేసే పధకాలు మీకు ఆందోళన కలిగిస్తాయి. అయితే చివరికి జయం మిమ్మల్నే వరిస్తుంది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించండి. అధికారులతో సంభాషించేటప్పుడు మెళకువ వహించండి. ప్రయివేటు సంస్థలలో వారు మార్పులకై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వాణిజ్య రంగాలలో వారు ఇన్‌కంటాక్స్ వంటి సమస్యలు ఎదుర్కొనక తప్పదు. పారిశ్రామిక రంగాలలో వారికి నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. నిరుద్యోగులకు సత్కాలం అని చెప్పవచ్చు. దూర ప్రయాణాలకై చేయు ప్రయత్నాలు అనుకూలించగలవు. లాయర్లకు పురోభివృద్ధి, వైద్యులకు ఒడిదుడుకులు, ఆడిటర్లకు అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు. స్పెక్యులేషన్ చేయువారు మెళకువ పాటించండి. మీ వ్యక్తిగత విషయాలను బయటకు తెలియపరచుట మంచిది కాదు. ఉత్తర, ప్రత్యుత్తరాలు సంతృప్తి నిస్తాయి. ఊహించని ఖర్చులు మీ అంచనాలను దాటటం వల్ల ఆందోళన పడతారని చెప్పవచ్చు.
ఈ రాశివారు గజలక్ష్మి అమ్మవారిని, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేసిన శుభం, జయం చేకూరుతుంది. నవంబర్ నుండి కుటుంబ స్థానమునందు రాహు సంచారం వల్ల అష్టమ స్థానమునందుకేతు సంచారము వల్ల రాహు, కేతువుల పూజ చేయించిన కుటుంబ సౌఖ్యం అభివృద్ధి కానవ్స్తుంది. విశాఖ నక్షత్రం వారు వైక్రాంతమణి, అనూరాధ నక్షత్రం వారు పుష్యనీలం, జ్యేష్టా నక్షత్రంవారు గరుడ పచ్చ ధరించిన అభివృద్ధి కానవస్తుంది.
ధనూ రాశి
Filed under: రాశి ఫలాలు Author: జ్యోతి
మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పదాలు, ఉత్తరాషాఢ 1 వ పాదం.
ఆదాయం: 5 , వ్యయం:14, రాజపూజ్యం:4, వ్యయం:2
ఈ రాశివారికి మే 1 వరకు ద్వితీయమునందు గురువు, ఆ తదుపరి తృతీయమునందు, జులై 30 నుంచి వక్రగతిన ద్వితీయమునందు, డిశంబరు 9 నుంచి తిరిగి తృతీయమునందు, ఈ సంవత్సరము నవంబరు వరకు ద్వితీయమునందు రాహువు. అష్టమమునందు కేతువు, ఆ తదుపరి అంతా జన్మమునందు రాహువు, సప్తమమునందు కేతువు, సెప్టెంబరు 9 వరకు భాగ్యమునందు శని, ఆ తదుపరి అంతా రాజ్యమునందు సంచరిస్తారు.
ఈ సంవత్సరము ' చింతింపకు గడచిన పని ' అన్నట్లుగా గడచిన దాని గురించి ఆలోచిస్తూ కాలం వ్యర్ధం చేయక సత్కాలం సద్వినియోగం చేసుకోండి. ఎంత వస్తువున్నప్పటికీ కూడా ఊహించని ఖర్చులు మీ అంచనాలను దాటుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలొ పాల్గొంటారు. అవివాహితులకు అనుకూలమైన కాలం. ఉపాధ్యాయులకు మార్పునకై చేయు ప్రయత్నాలు ఫలించగలవు. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి, విద్యార్థులకు మొదటి భాగంలో చాలా సంతృప్తి, అభివృద్ధి కానవస్తాయి. మీ ధైర్యసాహసాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. దూరప్రయాణాలకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. వాణిజ్య రంగంలోనివారికి సంతృప్తి, అభివృద్ధి కానవస్తుంది. ఉద్యోగస్థులు అనవసర ప్రసంగాల వలన అధికారులతో మాట పడవలసి వస్తుంది. ముఖ్యుల గురించి ఆందోళన పడతారు. తోటలు, వ్యవసాయ రంగంలోని వారికి పురోభివృద్ధి. నూతన పెట్టుబడులకు అనుకూలమైన కాలం, తల, కాళ్లు, నరాలకు సంబంధిన చికాకులు ఎదుర్కొనక తప్పదు. లాయర్లకు గుర్తింపు, రాణింపు లభించగలదు. సిమెంటు, కలప, ఇసుక, ఇనుము వ్యాపారస్థులకు పురోభివృద్ధి. ఉత్తర ప్రత్యుత్తరాలు మీకు ఎంతో సంతృప్తి నిస్తాయి. స్త్రీలకు అనుకూలత, రైతులకు వాతావరణంలో మార్పు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన బకాయిలు వాయిదా పడడం వల్ల ఆందోళనకు గురవుతారు. గృహంలో మార్పులు, చేర్పులు చేస్తారు.
ఈ రాశివారు హనుమాన్ చాలీసా చదువుతూ లేక వింటూ కుటుంబ సౌఖ్యానికి ఆరోగ్యాభివృద్ధికి రాహు, కేతువులకు శ్రీకాళహస్తిలొ పూజ చేయించిన అభివృద్ధి కానవస్తుంది. మూల నక్షత్రంవారు కృష్ణవైడూర్యం, పూర్వాషాఢ నక్షత్రం వారు జాతి వజ్రం, ఉత్తరాషాఢ నక్షత్రం వారు కెంపు ధరించిన పురోభివృద్ధి పొందుతారు.
మకర రాశి
Filed under: రాశి ఫలాలు Author: జ్యోతి
ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 అప్దాలు, ధనిష్ట 1, 2 పాదాలు
ఆదాయం: 8, వ్యయం:8, రాజపూజ్యం:7, అవమానం:2
ఈ రాశివారికి మే 1 వరకు జన్మమునందు బృహస్పతి, ఆ తదుపరి ద్వితీయమునందు, జులై 30నుంచి వక్ర గతిన జన్మమునందు, డిశంబరు 9 నుంచి ద్వితీయమునందు, ఈ సంవత్సరము నవంబరు 15వరకు జన్మమునందు రాహువు, సప్తమమునందు కేతువు, ఆ తదుపరి అంతా వ్యయమునందు రాహువు, షష్టమమునందు కేతువు. ఈ సంవత్సరము సెప్టెంబరు 9 వరకు అష్టమ శని, ఆ తదుపరి అంతా భాగ్యము నందు సంచరిస్తారు.
ఈ సంవత్సరము ' అపకారికి ఉపకారము 'అన్నట్లుగా అందరికీ సహాయ సహకారములు అందించడం వల్ల మీకు గుర్తింపు, రాణింపు లభిస్తాయి. అష్టమ శని దోషం మీకు హానికారం కాదు. ఆహార వ్యవహారాలలో జాగ్రత్త. ఆరోగ్యంలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ నెమ్మదిగా సమసిపోగలవు. స్థిరమైన మనసుతో స్థిరమైన పనులు చేపట్టి లాభం పొందండి. ఖాదీ, కలంకారీ, చేతి పరిశ్రమ రంగాలలో వారికి గుర్తింపు లభిస్తుంది. కాంట్రాక్టర్లకు ఊహించని సమస్యలు తలెత్తినా పరిష్కరించుకోగలుగుతారు. కార్మికులకు తాపీపని వారికి ఆర్ధిక విషయాలలో అభివృద్ధి కానవచ్చినా ధనం మాత్రం నిల్వ చేయలేరు. మీ ఆలోచనలను క్రియారూపంలో పెట్టి జయం పొందండి. నూనే, ఎరువులు, మందులు, రసాయనిక, సుగంధ ద్రవ్య, ఫ్యాన్సీ, కిరాణా వ్యాపారస్థులకు శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొన్నా ఏకాగ్రత వహించలేరు. అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. నూతన పెట్టుబడులకు శ్రీకారం చుట్టండి. ప్రెమికుల మధ్య ఆవగాహన లోపం, నిరమణ పధకాలలో పనివారితో సమస్యలు తలెత్తినా తెలివితో పరిష్కరిస్తారు. ఉద్యోగాభివృద్ధికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి.అతిథి మర్యాదలు బాగా నిర్వహిస్తారు. ఇతర దేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఉన్నట్టుంది మీలో ఆకస్మిక వేదాంత ధోరణి కనిపిస్తుంది. రైతులు, తోటలు రంగాలలోవారికి కలిసి రాగలదు. శాస్త్రజ్ఞులకు, పరిశోధకులకు, సాస్త్రరంగాలలో వారికి గుర్తింపు లభిస్తుంది. భూమి కొనుగోలుకై చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారస్థులకు కలిసి రాగలదు. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలో వారికి గుర్తింపు లభిస్తుంది. ట్రాన్స్ పోర్ట్, ఆటోమొబైల్ రంగాలలో వారికి అభిమాన బృందాలు అధికమవుతాయి. కుటుంబీకులలో ఒకరి ధోరణి మీకు చికాకు కలిగిస్తుంది. వైద్యులకు, న్యాయవాద రంగంలో వారికి పురోభివృద్ధి కానవచ్చిన మీ సహాయం పొంది మిమ్మల్ని తక్కువ అంచనా వేసేవారు ఎక్కువ అవుతారు. మీ మనోభావాలకు మంచి స్ఫురణ లభించగలదు. పాత విషయాలు ఒక కొలిక్కి రాగలవు. ఋణ ప్రయత్నం వాయిదా పడుతుంది. కొత్త వ్యక్తుల పరిచయం వల్ల కొత్త అనుభూతికి లోనవుతారు. స్త్రీ మూలక సమస్యలు ఎదురవుతాయి. సాహిత్య సదస్సులలో పాల్గొంటారు. అనవసరం సంభాషణలు చేయడం వల్ల ముఖ్యులలో ఆకస్మిక అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి.
ఈ రాశివారు శ్రీరామ పట్టాభిషేకం, ఉమా మహేశ్వర స్తోత్రం చదివినా, లేక విన్నా శుభం కలుగుతుంది. ఈ సంవత్సరం సెప్టెంబరు వరకు అష్టమ శనిదోషము ఉన్నందువల్ల నెలకు ఒక శనివారమునాడు శనికి తైలాభిషేకం చేయించిన కలిసి రాగలదు. శ్రవణ నక్షత్రం వారు స్పందన ముత్యం, ధనిష్టా నక్షత్రం వారు జాతి పగడం ధరించిన కలిసిరాగలదు.
కుంభ రాశి
Filed under: రాశి ఫలాలు Author: జ్యోతి
ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు
ఆదాయం: 8, వ్యయం:8, రాజపూజ్యం: 3 అవమానం: 5
ఈ రాశివారికి మే 1 వరకు వ్యయమునందు బృహస్పతి, ఆ తదుపరి అంతా జన్మమునందు, జులై 30 నుంచి వక్రగతిన వ్యయమునందు, డీశంబరు 19 నుంచి తిరిగి జన్మమునందు. ఈ నవంబరు 15 వరకు వ్యయము నందు రాహువు, షష్టమము నందు కేతువు, ఆ తదుపరి అంతా లాభము నందు రాహువు, పంచమము నందు కేతువు. ఈ సంవత్సరము సెప్టెంబరు 9 వరకు సప్తమము నందు శని, ఆ తదుపరి అంతా అష్టమ శని సంచరిస్తాడు.
ఈ సంవత్సరం 'తన కోపమె తన శత్రువు ' అన్నట్లుగా కోపతాపాలను అదుపులొ ఉంచుకోవడం మంచిదని గమనించండి. సహకార సంగహాలలొ వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. స్త్రీలకు ఆరోగ్యంలో చికాకులు తలెత్తినా సమసిపొగలవు. నిరుద్యోగులు సదవకాశాలు జారవిడుచుకుణ్టారు. ఆర్ధిక వత్తిడి ఎదుర్కొనక తప్పదు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఏకాగ్రత వహిస్తారు. వ్యవసాయ రంగంలోని వారికి సత్కాలం. నూతన వ్యాపారానికి శ్రీకారం చుట్టండి. కార్మికులకు సంతృప్తి, అభివృద్ధి కానవస్తుంది. వస్త్ర, బంగారు, వెండి వ్యాపారస్థులకు లాభదాయకం. సిమెంటు, ఐరన్, కలప వ్యాపారస్థులకు శుభం. హోటల్స్, తినుబండారాల వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంటుంది. ఇసుక, ఇటుక, తాపీపనివారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇప్పటివరకు వాయిదా పడుతున్న పన్లు పునఁ ప్రారంభమవుతాయి. కాంట్రాక్టర్లకు సదవకాశాలు లభించినా ఆర్ధిక ఒత్తిడి ఎదుర్కొనక తప్పదు. ఉద్యోగస్థులు మార్పునకై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మీ అభిప్రాయాలను బయటకు వ్యక్తం చేయటం వల్ల సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది.
అపరాల, ధాన్య వ్యాపారస్థులకు అభివృద్ధి కానవస్తుంది. భాగస్వామ్య వ్యాపారస్థులకు చికాకులు తప్పవు. హామీలు ఉండడం మంచిది కాదని గమనించండి. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగగలవు. నూనె, ఎండుమిర్చి, చింతపండు, బెల్లం, పసుపు, ధనియాలు వ్యాపారస్థులకు కలిసి రాగలదు. ఇతర దేశాలకు వెళ్లడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు ప్రధమ కన్నా ద్వితీయ భాగంలో ఆశించిన ఫలితాలు పొందగలరు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలలో మెళకువ వహించండి. ముఖ్యమైన వ్యవహారాలు పరిష్కార దిశలో సాగుతాయి. బంధు,మిత్రుల రాకపోకలు పెరుగుతాయి. ఇతరుల ఆంతరంగిక విషయాలలో జోక్యం కలిగించుకోకండి. స్వల్ప విషయాలలో మీ చుట్టుపక్కలవారితో సమస్యలు తలెత్తినా సమసిపోగలవు.
సంతానం విషయంలో సంతృప్తి కానరాదు. ఇష్టాగోష్టీలో పాల్గొంటారు. స్త్రీల తెలివితేటలకు, మంచితనానికి గుర్తింపు లభిస్తుంది. ఎదుటివారి ప్రభావానికి లోనవుతారు. ఉద్యోగస్థులకు బరువు, బాధ్యతలు పెరుగుతాయి. ఒక ముఖ్యమైన వ్యవహారం మిమ్మల్ని ఎంతో తికమకపెడుతుంది. మీ మనోవాంచ నెరవేరే సమయం ఆసన్నమైనదని గమనించండి. కుటుంబీకుల గురించి నూతన పధకాలు వేస్తారు.
మీకు ఈ సంవత్సరం సెప్టెంబరు నుంచి అష్టమ శనిదోషం ఏర్పడుతున్నందువల్ల శనికి మీ పేరుతో 3 నెలలకు ఒకసారి తైలాభిషేకం చేయిస్తూ, శ్రీ జ్ఞానప్రసూనాంబను ఆరాధన చేస్తూ, ఈశ్వరునికి అభిషేకం చేయించిన కలిసి వస్తుంది. ధనిష్ట నక్షత్రం వారు జాతి పగడం, శతభిషా నక్షత్రం వారు గోమేధికం, పూర్వాభాద్ర నక్షత్రం వారు, పుష్యరాగం లేకా వైక్రాంతమణి ధరించిన శుభం, జయం చేకూరుతుంది.
మీన రాశి
Filed under: రాశి ఫలాలు Author: జ్యోతి
పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు
ఆదాయం: 5, వ్యయం: 14, రాజపూజ్యం: 6, అవమానం:5
ఈ రాశివారికి నవంబరు 15 వరకు పంచమము నందు కేతువు, లాభమునందు రాహువు, ఆ తదుపరి అంతా చతుర్ధము నందు కేతువు, రాజ్యమునందు రాహువు, ఈ సెప్టెంబరు 9 వరకు షష్టమమునందు శని, ఆ తదుపరి అంతా సప్తమమునందు, మే 1 వరకు లాభమునందు బృహస్పతి, ఆ తదుపరి వ్యయము నందు, జులై 30 నుంచి మరలా వక్రగతిన లాభమునందు, డిశంబరు 19 నుంచి వ్యయము నందు సంచరిస్తారు.
ఈ సంవత్సరం ' పాలాసునకై ఆపద ' అన్నట్లుగా ఈ సంవత్సరం ప్రతి విషయంలోనూ ప్రశాంతత వహించడం వల్ల అన్ని విధాలుగా సంతృప్తి కానరాగలదు. కళాకారులు ఆందోళనకు గురవుతారు. శుభకార్యాలకై చేసే ప్రయత్నాలు అనుకూలించగలవు. ఫైనాన్స్, చిట్ ఫండ్ రంగాలలొ వారికి ఒడిదుడుకులు తప్పవు. రాజకీయాలలోని వారు ఆచితూచి వ్యవహరించాలి. వాణిజ్య రంగాలలోని వారు ఇన్‌కమ్ టాక్స్ వంటి సమస్యలు ఎదుర్కోక తప్పదు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. తొందరపడి వాగ్ధానాలు చేయడం వల్ల సమస్యలు ఎదుర్కొనక తప్పదు. కుటుంబీకుల విషయంలో సంతృప్తి కానరాదు. ప్రయివేటు సంస్థల వారు మార్పులకై చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ కళత్ర ఆరొగ్యం మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. నరాలు, మెడ, మోకాళ్లు, ఎముకలు, తలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు. మీ విరోధులు మీరు తలపెట్టిన పనిలొ అంతరాయం కలిగించడానికి ప్రయత్నిస్తారు. పనివారితో ఆవగాహనా లోపం ఏర్పడుతుంది. జాగ్రత్త వహించండి. దైవకార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వాహనం కొనుగోలు చేసె ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ పెద్దల ఆరొగ్యం విషయాలలో జాగ్రత్త వహించండి. మీ పిల్లల కోసం, ప్రియతముల కోసం ధనం బాగా ఖర్చు చేస్తారు. జాగ్రత్త వహించండి. ఊహించని ఖర్చులు అంచనాలు దాటడం వల్ల ఆందోళన పడతారని చెప్పవచ్చు. కోర్టు వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది. చిన్న చిన్న విషయాలకు ఆందోళన పడతారు. సదస్సులలో పాల్గొంటారు. తీర్ధయాత్రలకు ధనం వెచ్చిస్తారు.
గృహానికి మరమ్మతులు చేయించగలుగుతారు. ఇంట, బయట సమస్యలు తలెత్తినా తెలివితేటలతో పరిష్కరించుకోగలుగుతారు. అవివాహితులకు అనుకూలమైన కాలం. విద్యా సంస్థలలో వారికి అనుకూలంగా ఉండగలదు. కొంతమంది మీ మీద నిందారోపణ చేయడం వల్ల ఆందోళన అధికం అవుతుంది.
మీరు లక్ష్మీనారసింహుడిని పూజిస్తూ, ఎర్రని పూలతో కామెశ్వరీ దేవిని ఆరాధన చేసిన ఏ దోషాలు ఉన్నా తొలగిపోతాయి. పూర్వాభాద్ర నక్షత్రంవారు కనక పుష్యరాగం లేక వైక్రాంతమణి, ఉత్తరాభాద్ర నక్షత్రంవారు సౌగంధికానీలం, రేవతి నక్షత్రం వారు మయూరి మరకతం ధరించిన పురోభివృద్ధి పొందుతారు.
మైలకాలంలో పూజలు చేయరాదంటారు. పోనీ దైవ స్తోత్రాలు చదవచ్చా??
Filed under: తెలుసుకుందామా Author: జ్యోతి
సనాతన ధర్మశాస్త్రాలను స్మృతులు అంటారు. వాటిలో ఈ విషయాలన్నీ నిర్ణయించారు. పురుడుని జాతాశౌచం అంటారు. జాత అశౌచాన్ని దేవాలయ అర్చకులు తప్ప మిగతావారు పెద్దగా పట్టించుకోరు. కొంతమంది పురుడు కలిపేసుకుంటె శుభమని అసలు అశౌచాన్నే పాటించరు. కాని గృహంలో జరుపుకునే ఆరాధనలు ఆ సమయంలో పదోరోజు వరకు పనికిరావు.
తల్లిదండ్రులు మరణిస్తే మృత అశౌచం తీరిపోయాక ఇంట్లో పూజలు మామూలుగానే చేసుకోవాలి. కొందరు ఏడాది దాకా దీపం కూడా పెట్టరాదంటారు. అది తప్పు. దీపారాధన మైల సమయంలో తప్ప ఎప్పుడూ ఆపకూడదు. మామూలుగా ఆలయాలలో దైవదర్శనం దోషం కాదు. అయితే ఉత్సవాలు నిర్వహించడం పనికిరాదు. ఒక వ్యక్తి తన తండ్రితో కలిపి మూడు తరాలవరకు పితృకార్యాలు చేయాలి తాను ఉన్నంతవరకు చేస్తాడు. ఆ తర్వాత మొదటి తరం పోయి ఇతనితో కలిపి మూడుతరాలకు అతని కొడుకు చేస్తాడు.
వివాహం, గృహప్రవేశం ఇతర శుభకార్యాల తరవాత ఆరునెలల దాకా అదే గృహంలో పితృకార్యాలు చేయవచ్చు. అలాగే కర్మకాండలు జరిగిన గృహంలో వివాహాలు జరగవచ్చు. చనిపోయినవారి కొడుకులకు సంవత్సరం వరకు వివాహం చెయరు. కూతుళ్లకు మాత్రం చనిపోయినవారికి కన్యదాన ఫలం దక్కేందుకు గాను అదే సంవత్సరం వీలైతే వివాహం చేస్తారు. బ్రహ్మచారులకు మైలకాలం తీరిపోయాక ఇక ఏ అశౌచం ఉండదు. అశౌచ సమయాలలో ఏ పారాయణం అయినా బయటకు వినపడకుండా మనసులో చదువుకోవచ్చు. కొత్తవి చదవాల్సిన అవసరం లేదు. భగవన్నామస్మరణ అన్నివేళలా శ్రేయోదాయకమైనదే.
పురాణాల్లో వ్యక్తుల పేర్లు.. అర్ధాలు
Filed under: తెలుసుకుందామా Author: జ్యోతి
అనసూయ - అసూయ లేనిది
అర్జునుడు - స్వచ్చమైన చాయ కలవాడు
అశ్వత్థామ - గుర్రము వలె సామర్ధ్యము/బలము కలవాడు, ఇతను పుట్టగానే అశ్వము వలె పెద్ద ధ్వని రావడం వలన అశ్వత్థామ అయ్యాడు.
ఆంజనేయుడు - 'అంజన'కు పుట్టినవాడు.
ఇంద్రజిత్తు - ఇంద్రుని జయించినవాడు (జితమంగా విజయము)
ఊర్వశి - నారాయణుడి ఊరువు (తొడ) నుండి ఉద్భవించినది.
కర్ణుడు - పుట్టుకతో 'కర్ణ'కుండలాలు కలవాడు.
కుంభకర్ణుడు - ఏనుగు యొక్క 'కుంభస్థల' ప్రమాణముగల కర్ణములు (చెవులు) కలవాడు.
కుచేలుడు - చినిగిన లేక మాసిన వస్త్రము కలవాడు (చేలము అనగా వస్త్రము).
కుబేరుడు - నికృష్టమైన శరీరము కలవాడు (బేరమనగా శరీరము).
గంగ - గమన శీలము కలది .భగీరధునకు పుత్రికగా ప్రసిద్ధినొందినది కనుక భాగీరధి అని, జహ్నుమునికి పుత్రికగా ప్రసిద్ధి నొందినది కనుక జాహ్నవి అని గంగకు పేర్లు కలవు.
గరుత్మంతుడు - విశిష్టమైన రెక్కలు కలవాడు
ఘటోత్కచుడు - కుండవలె గుబురైన జుట్టు కలవాడు (ఘటమనగా కుండ)
జరాసంధుడు - 'జర' అను రాక్షసి చేత శరీర భాగాలు సంధింపబడిన (అతికింపబడిన) వాడు.
తుంబురుడు - తుంబుర (వాద్య విశేషము) కలవాడు
దశరధుడు - దశ (పది) దిశలలో రధ గమనము కలవాడు.
ధృతరాష్ట్రుడు - రాష్ట్రమునంతటినీ అదుపులో ఉంచుకొనువాడు.
త్రిశంకుడు - 1. తండ్రిని ఎదిరించుట 2, పరభార్యను అపహరించుట 3. గోమాంసము తినుట అను మూడు
శంకువులు(పాపాలు) చేసినవాడు.
దమయంతి - 1. 'దమనుడు' అను ముని వరము వలన జన్మించినది. 2. తన అందముచే ఇతరులను దమించునది.(అణచునది).
దుర్వాసుడు - దుష్టమైన వస్త్రము కలవాడు. (వాసమనగా వస్త్రము)
దుర్యోధనుడు - (దుర్+యోధుడు) ఇతరులు సుఖముగా యుద్ధము చేయుటకు వీలుపడనివాడు.
దుశ్శాసనుడు - సుఖముగా శాసింప (అదుపు చేయ) సాధ్యము కానివాడు.
ద్రోణుడు - ద్రోణము(కుండ)నుండి పుట్టినవాడు.
ధర్మరాజు - సత్యము, అహింస మొదలగు ధర్మములను పాటించే రాజు. కుంతి భర్త అనుమతి పొంది ధర్ముని వలన(యమధర్మరాజు) కన్న సంతానము కనుక ధర్మజుడని, యుద్ధమునందు స్థిరమైన పరాక్రమమును
ప్రదర్శించువాడు కనుక యుధిష్టిరుడని పేర్లు కలిగాయి.
నారదుడు - 1.జ్ఞానమును ఇచ్చువాడు (నారమనగా జ్ఞానము) 2. కలహప్రియుడగుటచే నరసంధమును భేదించువాడు.
ప్రద్యుమ్నుడు - ప్రకృష్టమైన (అధికమైన) బలము కలవాడు (ధ్యుమ్నము :బలము)
ప్రభావతి - ప్రభ (వెలుగు)కలది.
ప్రహ్లాదుడు - భగవంతుని దర్శనముచే అధికమైన ఆహ్లాదము పొందువాడు
బలరాముడు - బలముచే జనులను రమింపచేయువాడు.
బృహస్పతి - బృహత్తులకు (వేదమంత్రాలకు) ప్రభువు (బృహస్‌పతి)
భరతుడు - అశేషమైన భూమిని భరించిన (పోషించిన) వాడు.
భీముడు - భయమును కలిగించువాడు
భీష్ముడు - తండ్రి సుఖము కొరకై తను రాజ్య సుఖములను వదులుకోవడమే కాక వివాహం చేసుకోను అని భీష్మమైన
(భయంకరమైన) ప్రతిజ్ఞ చేసినవాడు.
మండోదరి - పలుచని ఉదరము కలది (మండ-పలుచని)
మన్మధుడు - మనస్సు కలత పెట్టువాడు.
మహిషాసురుడు 1. రంభుడు మహిషంతో (గేదే) రమించగా పుట్టినవాడు
2. 'మహిష్మతి' అనే ఆమె శాపం వలన మహిషమై(గేదె) ఉండి సింధు ధ్వీపుడనే రాజు రేతస్సును మింగి గర్భాన్నిధరించి ఇతనికి జన్మనిస్తుంది.
యముడు - యమము (లయ)నుపొందించువాడు.
యశోద యశస్సును (కీర్తి) కలిగించునది.
రాముడు - రమంతే యోగినః అస్మెన్ = రామ(రమ్ -క్రీడించుట)
యోగులందరూ ఈ పరమాత్మునియందు విహరించెదరు/ఆనందించెదరు.
రావణాసురుడు - కైలాసమును రావణుడు ఎత్తగా దానిని శివుడు బొటనవేలితో నొక్కినప్పుడు గొప్ప రవము (ధ్వని)
చేసినవాడు
రుక్మిణి - రుక్మము(బంగారము) కలది
వాల్మీకి -ఆయన నిరాహారుడై తపస్సు చేయగా వాని శరీరముపై వల్మీకములు (పుట్టలు) మొలచుటవలన వాల్మీకి
అయ్యాడు.
వ్యాసుడు -వేదాల్ని వ్యాసం (విభజించి వ్యాప్తి చేయుట) చేసినవాడు.
విదురుడు - బుద్ధిమంతుడు , తెలివిగలవాడు
విభీషణుడు - దుష్టులకు విశేష భీతిని కలిగించువాడు
శంతనుడు - శం = సుఖము/శుభము తను = విస్తరింపజేయుట , సుఖమును, శుభమును విస్తరింపజేయువాడు
ములుకులతో(బాణములతో) బాధించువాడు (శల్యమంగా బాణము)
శకుంతల - శకుంతలములచే (పక్షులచే) రక్షింపబడినది.
శూర్పణఖ - చేటల వంటి గోరులుకలది (శూర్పమనగా చేట, నఖ మనగా గోరు)
సగరుడు - విషముతో పుట్టినవాడు (గర/గరళ శబ్దాలకు విషమని అర్ధము) (గర్భములో ఉండగా విష ప్రయోగానికిగురై ఆ విషంతోనే పుట్టినవాడు)
సత్యభామ - నిజమైన కోపము కలది ( భామ - క్రోధే)
సీత - నాగటి చాలు (జనక చక్రవర్తి భూమి దున్నుతుండగా నాగటి చాలులో దొరికిన శిశువు కనుక సీత అయినది)
అర్జునుడు - స్వచ్చమైన చాయ కలవాడు
అశ్వత్థామ - గుర్రము వలె సామర్ధ్యము/బలము కలవాడు, ఇతను పుట్టగానే అశ్వము వలె పెద్ద ధ్వని రావడం వలన అశ్వత్థామ అయ్యాడు.
ఆంజనేయుడు - 'అంజన'కు పుట్టినవాడు.
ఇంద్రజిత్తు - ఇంద్రుని జయించినవాడు (జితమంగా విజయము)
ఊర్వశి - నారాయణుడి ఊరువు (తొడ) నుండి ఉద్భవించినది.
కర్ణుడు - పుట్టుకతో 'కర్ణ'కుండలాలు కలవాడు.
కుంభకర్ణుడు - ఏనుగు యొక్క 'కుంభస్థల' ప్రమాణముగల కర్ణములు (చెవులు) కలవాడు.
కుచేలుడు - చినిగిన లేక మాసిన వస్త్రము కలవాడు (చేలము అనగా వస్త్రము).
కుబేరుడు - నికృష్టమైన శరీరము కలవాడు (బేరమనగా శరీరము).
గంగ - గమన శీలము కలది .భగీరధునకు పుత్రికగా ప్రసిద్ధినొందినది కనుక భాగీరధి అని, జహ్నుమునికి పుత్రికగా ప్రసిద్ధి నొందినది కనుక జాహ్నవి అని గంగకు పేర్లు కలవు.
గరుత్మంతుడు - విశిష్టమైన రెక్కలు కలవాడు
ఘటోత్కచుడు - కుండవలె గుబురైన జుట్టు కలవాడు (ఘటమనగా కుండ)
జరాసంధుడు - 'జర' అను రాక్షసి చేత శరీర భాగాలు సంధింపబడిన (అతికింపబడిన) వాడు.
తుంబురుడు - తుంబుర (వాద్య విశేషము) కలవాడు
దశరధుడు - దశ (పది) దిశలలో రధ గమనము కలవాడు.
ధృతరాష్ట్రుడు - రాష్ట్రమునంతటినీ అదుపులో ఉంచుకొనువాడు.
త్రిశంకుడు - 1. తండ్రిని ఎదిరించుట 2, పరభార్యను అపహరించుట 3. గోమాంసము తినుట అను మూడు
శంకువులు(పాపాలు) చేసినవాడు.
దమయంతి - 1. 'దమనుడు' అను ముని వరము వలన జన్మించినది. 2. తన అందముచే ఇతరులను దమించునది.(అణచునది).
దుర్వాసుడు - దుష్టమైన వస్త్రము కలవాడు. (వాసమనగా వస్త్రము)
దుర్యోధనుడు - (దుర్+యోధుడు) ఇతరులు సుఖముగా యుద్ధము చేయుటకు వీలుపడనివాడు.
దుశ్శాసనుడు - సుఖముగా శాసింప (అదుపు చేయ) సాధ్యము కానివాడు.
ద్రోణుడు - ద్రోణము(కుండ)నుండి పుట్టినవాడు.
ధర్మరాజు - సత్యము, అహింస మొదలగు ధర్మములను పాటించే రాజు. కుంతి భర్త అనుమతి పొంది ధర్ముని వలన(యమధర్మరాజు) కన్న సంతానము కనుక ధర్మజుడని, యుద్ధమునందు స్థిరమైన పరాక్రమమును
ప్రదర్శించువాడు కనుక యుధిష్టిరుడని పేర్లు కలిగాయి.
నారదుడు - 1.జ్ఞానమును ఇచ్చువాడు (నారమనగా జ్ఞానము) 2. కలహప్రియుడగుటచే నరసంధమును భేదించువాడు.
ప్రద్యుమ్నుడు - ప్రకృష్టమైన (అధికమైన) బలము కలవాడు (ధ్యుమ్నము :బలము)
ప్రభావతి - ప్రభ (వెలుగు)కలది.
ప్రహ్లాదుడు - భగవంతుని దర్శనముచే అధికమైన ఆహ్లాదము పొందువాడు
బలరాముడు - బలముచే జనులను రమింపచేయువాడు.
బృహస్పతి - బృహత్తులకు (వేదమంత్రాలకు) ప్రభువు (బృహస్‌పతి)
భరతుడు - అశేషమైన భూమిని భరించిన (పోషించిన) వాడు.
భీముడు - భయమును కలిగించువాడు
భీష్ముడు - తండ్రి సుఖము కొరకై తను రాజ్య సుఖములను వదులుకోవడమే కాక వివాహం చేసుకోను అని భీష్మమైన
(భయంకరమైన) ప్రతిజ్ఞ చేసినవాడు.
మండోదరి - పలుచని ఉదరము కలది (మండ-పలుచని)
మన్మధుడు - మనస్సు కలత పెట్టువాడు.
మహిషాసురుడు 1. రంభుడు మహిషంతో (గేదే) రమించగా పుట్టినవాడు
2. 'మహిష్మతి' అనే ఆమె శాపం వలన మహిషమై(గేదె) ఉండి సింధు ధ్వీపుడనే రాజు రేతస్సును మింగి గర్భాన్నిధరించి ఇతనికి జన్మనిస్తుంది.
యముడు - యమము (లయ)నుపొందించువాడు.
యశోద యశస్సును (కీర్తి) కలిగించునది.
రాముడు - రమంతే యోగినః అస్మెన్ = రామ(రమ్ -క్రీడించుట)
యోగులందరూ ఈ పరమాత్మునియందు విహరించెదరు/ఆనందించెదరు.
రావణాసురుడు - కైలాసమును రావణుడు ఎత్తగా దానిని శివుడు బొటనవేలితో నొక్కినప్పుడు గొప్ప రవము (ధ్వని)
చేసినవాడు
రుక్మిణి - రుక్మము(బంగారము) కలది
వాల్మీకి -ఆయన నిరాహారుడై తపస్సు చేయగా వాని శరీరముపై వల్మీకములు (పుట్టలు) మొలచుటవలన వాల్మీకి
అయ్యాడు.
వ్యాసుడు -వేదాల్ని వ్యాసం (విభజించి వ్యాప్తి చేయుట) చేసినవాడు.
విదురుడు - బుద్ధిమంతుడు , తెలివిగలవాడు
విభీషణుడు - దుష్టులకు విశేష భీతిని కలిగించువాడు
శంతనుడు - శం = సుఖము/శుభము తను = విస్తరింపజేయుట , సుఖమును, శుభమును విస్తరింపజేయువాడు
ములుకులతో(బాణములతో) బాధించువాడు (శల్యమంగా బాణము)
శకుంతల - శకుంతలములచే (పక్షులచే) రక్షింపబడినది.
శూర్పణఖ - చేటల వంటి గోరులుకలది (శూర్పమనగా చేట, నఖ మనగా గోరు)
సగరుడు - విషముతో పుట్టినవాడు (గర/గరళ శబ్దాలకు విషమని అర్ధము) (గర్భములో ఉండగా విష ప్రయోగానికిగురై ఆ విషంతోనే పుట్టినవాడు)
సత్యభామ - నిజమైన కోపము కలది ( భామ - క్రోధే)
సీత - నాగటి చాలు (జనక చక్రవర్తి భూమి దున్నుతుండగా నాగటి చాలులో దొరికిన శిశువు కనుక సీత అయినది)








